వినోద రంగంలో, ముఖ్యంగా బుల్లితెరపై సెలబ్రిటీల వ్యక్తిగత జీవితాలు ఎప్పుడూ ఆసక్తికరంగానే ఉంటాయి. ప్రేమ, పెళ్లి, విడాకులు, మళ్లీ కొత్త జీవితాన్ని ప్రారంభించడం ఈ రోజుల్లో సర్వసాధారణంగా మారిపోయాయి. తాజాగా ప్రముఖ తెలుగు సీరియల్ నటి శిరీష (Sireesha) తన జీవితంలో కొత్త అధ్యాయాన్ని ప్రారంభించారు. గత కొంతకాలంగా ఒంటరిగా ఉంటున్న ఆమె, ప్రముఖ యాంకర్, నటుడు మహేంద్ర బొర్రాను రెండో వివాహం చేసుకున్నారు.

