ఇప్పుడు చెన్నై వర్గాల్లో వినిపిస్తున్న మాట ఏమిటంటే, ఈ అందగాడు ఓ ఇంటివాడు కాబోతున్నాడు. అనిరుధ్, సన్‌రైజర్స్ అధినేత్రి కావ్య మారన్‌ను పెళ్లి చేసుకోబోతున్నాడని తెలిసింది. గత రెండు మూడు సంవత్సరాలుగా ఈ విషయం అందరి నోళ్లలో నానుతోంది.. కానీ ఇప్పుడు చెన్నైలో ఇది అధికారికమని గట్టిగా వినిపిస్తోంది. అంతేకాకుండా, పెళ్లి వేడుక తేదీ, వేదిక కూడా ఇప్పటికే ఖరారయ్యాయని తెలిసింది.
