Last Updated:
టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి నేడు తన 71వ పుట్టినరోజు జరుపుకుంటున్నారు. నాలుగు దశాబ్దాలుగా ఇండస్ట్రీని ఏలుతున్న ఆయన.. ఇప్పటికీ కుర్ర హీరోలకు ఏమాత్రం తీసిపోని ఫిట్‌నెస్‌తో ఆకట్టుకుంటున్నారు. వయసు కేవలం అంకె మాత్రమే అని నిరూపిస్తున్న చిరు డైట్, వర్కౌట్ విశేషాలివే.
తెలుగు సినిమా ఐకాన్, మెగాస్టార్ చిరంజీవి ఆగస్టు 22, 2026న తన 71వ వసంతంలోకి అడుగుపెట్టారు. నాలుగు దశాబ్దాలకు పైగా సుదీర్ఘ నట ప్రస్థానంలో ఎన్నో అద్భుతమైన పాత్రలతో ఆయన ప్రేక్షకులను అలరించారు. సినిమా కోసం ఎంతటి కష్టమైన పాత్రలైనా అలవోకగా పోషించే చిరు.. వయసు పెరుగుతున్నా తన ఫిట్‌నెస్ విషయంలో ఏమాత్రం రాజీ పడటం లేదు. తాజాగా ఆయన తన రాబోయే ప్రాజెక్ట్ కోసం జిమ్‌లో తీవ్రంగా శ్రమిస్తున్న వీడియోలు నెట్టింట వైరల్‌గా మారాయి. వయసు కేవలం ఒక సంఖ్య మాత్రమే అని నిరూపిస్తూ, 70 ఏళ్ల వయసులో కూడా ఆయన చేస్తున్న వర్కౌట్స్ అందరికీ ఆదర్శంగా నిలుస్తున్నాయి. సినిమా షూటింగ్స్, వర్షం లాంటివి ఉన్నప్పటికీ ఆయన క్రమం తప్పకుండా జిమ్‌లో చెమటోడ్చుతారు.

