Last Updated:
స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా రిలయన్స్ డిజిటల్ భారీ ఆఫర్లతో ముందుకొచ్చింది. రూ.30,000 వరకు డిస్కౌంట్, రూ.10,000 ఎక్స్‌చేంజ్ బోనస్, 50% తగ్గింపు… కానీ ఈ ఆఫర్లు ఏయే ఉత్పత్తులపై ఉన్నాయి? ఎప్పుడు వరకు అందుబాటులో ఉంటాయి? కొనుగోలు చేసే ముందు తప్పక తెలుసుకోవాల్సిన పూర్తి వివరాలు ఇవే.
Independence Day Sale: స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకుని దేశంలోని ప్రముఖ కన్స్యూమర్ ఎలక్ట్రానిక్స్ రిటైల్ సంస్థ Reliance Digital ప్రత్యేక ఆఫర్లతో కూడిన D.I.S.C.O. (Digital India Sale Crazy Offers) ప్రచారాన్ని ప్రారంభించింది. గతంలో నిర్వహించిన Digital India Saleకు కొత్త గుర్తింపుగా తీసుకొచ్చిన ఈ సేల్ ఆగస్టు 16 వరకు కొనసాగనుంది. దేశవ్యాప్తంగా ఉన్న రిలయన్స్ డిజిటల్ స్టోర్లు, RelianceDigital.in వెబ్‌సైట్, అలాగే MyJio Storesలో ఈ ఆఫర్లు అందుబాటులో ఉంటాయని సంస్థ వెల్లడించింది.

