అయితే ఇలాంటి విషయాలు ప్రధానంగా సంప్రదాయాలు, వ్యక్తిగత విశ్వాసాలకు సంబంధించినవే. తిన్న ప్లేట్లో చేతులు కడగడం వల్ల దురదృష్టం వస్తుందనే విషయానికి శాస్త్రీయ ఆధారాలు లేవు. పరిశుభ్రత, ఆహారానికి గౌరవం, మంచి అలవాట్లు పాటించడం మాత్రం ప్రతి ఒక్కరికీ అవసరం. అందువల్ల కుటుంబ సంప్రదాయాలను గౌరవిస్తూ, అదే సమయంలో పరిశుభ్రతకు ప్రాధాన్యం ఇవ్వడం ఉత్తమమైన మార్గమని నిపుణులు సూచిస్తున్నారు.

