Last Updated:
Gold Rate Today: అంతర్జాతీయ మార్కెట్ ట్రెండ్స్, డాలర్ ఇండెక్స్ మార్పులు, పెట్టుబడిదారుల కొనుగోలు ఆసక్తి ప్రభావంతో దేశీయంగా ఈరోజు బంగారం ధరలు కీలకంగా మారాయి. హైదరాబాద్‌తో పాటు దేశంలోని ప్రధాన నగరాల్లో 22 క్యారెట్లు, 24 క్యారెట్ల గోల్డ్ రేట్లు ప్రస్తుతం వినియోగదారుల దృష్టిని ఆకర్షిస్తున్నాయి.
దేశంలో బంగారం పతనం కొనసాగుతుంది. ఫెడ్ వడ్డీ రేట్లను యథాతథంగా ఉంచడంతో గోల్డ్, సిల్వర్ విషయంలో తీవ్ర ఒత్తిడి నెలకొని ఉంది. దాంతో ఇన్వెస్టర్లు బంగారం, వెండిని వదిలించుకునే ప్రయత్నం చేస్తున్నారు. ఫలితంగా బంగారం, వెండి ధరల్లో భారీ పతనం కనిపిస్తోంది. ఇక ఎంసీఎక్స్‌లో శుక్రవారం బంగారం, వెండి భారీగా తగ్గాయి.
ఉదయం 9:05 నిమిషాలకు మనీకంట్రోల్ వెల్లడించిన లైవ్ మార్కెట్ వివరాల ప్రకారం, మల్టీ కమోడిటీ ఎక్స్చేంజ్ (MCX)లో బంగారం భారీగా పతనం అయ్యింది. ప్రస్తుతం ఆగస్టు 5 ఫ్యూచర్ కాంట్రాక్టులో ఎంసీఎక్స్ 24 క్యారెట్ల బంగారం ధర 10 గ్రాములకు రూ.1,42,490 వద్ద ట్రేడవుతోంది. గత ట్రేడింగ్ సెషన్ ముగింపు ధరతో పోలిస్తే ఇది రూ.742 తగ్గుదల. ఇక వెండి కూడా పడింది. సెప్టెంబర్ 4 ఫ్యూచర్ కాంట్రాక్టులో ఎంసీఎక్స్‌లో కిలో వెండి ధర ప్రస్తుతం రూ.2,19,103 వద్ద ట్రేడవుతోంది. గత ట్రేడింగ్ సెషన్‌తో పోలిస్తే వెండి ధర కిలోకు రూ.864 తగ్గింది.
ఫ్యూచర్స్ మార్కెట్ మాత్రమే కాకుండా స్పాట్ మార్కెట్‌లో కూడా బంగారం, వెండి ధరలు తగ్గాయి. ఉదయం 9:10 గంటలకు bullions.co.in విడుదల చేసిన ధరల ప్రకారం.. హైదరాబాద్ బులియన్ మార్కెట్‌లో 24 క్యారెట్ల స్వచ్ఛమైన బంగారం ధర 10 గ్రాములకు క్రితం ముగింపుతో పోలిస్తే రూ.70 తగ్గి రూ.1,44,010కు చేరుకుంది. అలాగే 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర కూడా తగ్గి ప్రస్తుతం రూ.1,32,009 వద్ద కొనసాగుతోంది. వెండి ధరలు భారీగా పడ్డాయి. గత మార్కెట్ క్లోజింగ్ రేటుతో పోలిస్తే కిలో వెండిపై రూ.790 తగ్గింది. ప్రస్తుతం హైదరాబాద్ బులియన్ మార్కెట్‌లో కిలో వెండి ధర రూ.2,19,730 వద్ద కొనసాగుతోంది.
Hyderabad,Telangana

