ఈ ప్రశ్నను లోక్సభ సభ్యుడు ఉజ్వల్ రమణ్ సింగ్ అడిగారు. వందే భారత్ టికెట్ ధరలు మధ్యతరగతి, తక్కువ ఆదాయం ఉన్న వారికి భారంగా మారుతున్నాయా? దీనిపై ప్రభుత్వం ఏ చర్యలు తీసుకుంది? అందరికీ అందుబాటులో ఉండే ప్రజా రవాణాపై వరల్డ్ బ్యాంక్ సూచనలకు ఈ ధరల విధానం అనుగుణంగా ఉందా? అని ఆయన అడిగారు. దీనికి సమాధానంగా మంత్రి మాట్లాడుతూ, భారతీయ రైల్వేలు సాధారణ ప్యాసింజర్ రైళ్లు, మెయిల్, ఎక్స్ప్రెస్ రైళ్లు, అమృత్ భారత్, వందే భారత్, వందే భారత్ స్లీపర్, నమో భారత్ ర్యాపిడ్ రైల్, తేజస్, హమ్సఫర్, రాజధాని, శతాబ్ది, దురంతో, గరీబ్ రథ్ వంటి అనేక రకాల సేవలను అందిస్తున్నాయని చెప్పారు. (ప్రతీకాత్మక చిత్రం)

