ఈ సినిమా కాజల్‌కు ఏ రేంజ్‌లో క్రేజ్ తెచ్చిపెట్టిందంటే ఏకంగా రాజమౌళి ‘మగధీర’లో ఛాన్స్ కొట్టేసింది. ఈ సినిమా తర్వాత కాజల్ వెనక్కి తిరిగి చూసుకోలేదు. బ్యాక్ టు బ్యాక్ హిట్లతో టాలీవుడ్‌లో స్టార్ హీరోల రేంజ్‌లో పాపులారిటీ సంపాదించుకుంది. ఆ తర్వాత డార్లింగ్, బృందావనం, మిస్టర్ పర్‌ఫెక్ట్, బిజినెస్ మ్యాన్, నాయక్, బాద్‌షా, ఎవడు, టెంపర్ ఇలా 5 ఏళ్ల గ్యాప్‌లోనే 8 బ్లాక్ బస్టర్ హిట్లు కొట్టి మోస్ట్ సక్సెస్ ఫుల్ హీరోయిన్‌గా నిలిచిపోయింది.

