సాగు చేస్తున్న పంటను బట్టి బీమా ప్రీమియం, నమోదు గడువు తేదీలు వేర్వేరుగా ఉంటాయి. వరి పంటకు రూ.840 ప్రీమియం చెల్లిస్తే రూ.42,000 బీమా వర్తిస్తుంది, దీనికి ఆగస్టు 15 చివరి తేదీ. రాగికి రూ.170 ప్రీమియంతో రూ.17,000 బీమా, కందికి రూ.400 ప్రీమియంతో రూ.20,000 కవరేజీ లభిస్తుంది, వీటికి జూలై 31 ఆఖరు. ఇక ఆర్‌డబ్ల్యూబీసీఐఎస్ కింద వేరుశనగకు రూ.560 కడితే రూ.28,000 బీమా అందుతుంది. టమాటాకు రూ.1,500 చెల్లిస్తే రూ.30,000 బీమా రక్షణ ఉంటుంది. ఈ రెండు పంటలకు జూలై 24 లోపు నమోదు ప్రక్రియ పూర్తి చేసుకోవాలి.

