Last Updated:
Popcorn History: థియేటర్లలో తినే పాప్‌కార్న్ వెనుక ప్రపంచ యుద్ధం ఉందా? చక్కెర కొరత వల్ల అమెరికాను ఊపేసి ప్రపంచవ్యాప్తంగా ప్రతి ఇంటా నంబర్ వన్ స్నాక్ గా మారిన పాప్‌కార్న్ హిస్టరీ ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం…
Popcorn History: ఇంటి వద్ద టీవీ చూస్తున్నప్పుడు, సినిమా థియేటర్లలో కూర్చున్నప్పుడు మనందరికీ వెంటనే గుర్తొచ్చే స్నాక్ ‘పాప్‌కార్న్’. తేలికగా, రుచిగా ఉండే ఈ పాప్‌కార్న్ నేడు గ్లోబల్ వైడ్ గా భారీ బిజినెస్ మార్కెట్ ను కలిగి ఉంది. అయితే పాప్‌కార్న్ అనేది నిన్న మొన్న వచ్చింది కాదు, దీనికి వేల సంవత్సరాల పురాతన చరిత్ర ఉందట. న్యూస్18 ఇంగ్లీష్ కథనం ప్రకారం పాప్‌కార్న్ హిస్టరీని తవ్వితే దాదాపు 5,000 సంవత్సరాలకు పైగా పురాతన ఆధారాలు లభిస్తాయి. ఆ ఇంట్రెస్టింగ్ హిస్టరీ ఏంటో ఇప్పుడు క్లియర్ గా తెలుసుకుందాం.
1. 5 వేల ఏళ్ల నాటి స్నాక్ – ఆభరణాలుగా కూడా..
న్యూ మెక్సికోలోని పురాతన గుహలలో లభించిన అవశేషాల ప్రకారం.. క్రీస్తు పూర్వమే అమెరికా ఖండంలోని పూర్వీకులు మొక్కజొన్న పొత్తులను నిప్పులపై వేడి చేసి పాప్‌కార్న్ తయారుచేసేవారని తెలుస్తోంది. వీరు కేవలం తినడానికే కాకుండా పాప్‌కార్న్ తో పూసలు చేసి ఆభరణాలుగా ధరించడం, దేవుళ్లకు నివేదనగా సమర్పించడం లాంటివి చేసేవారని న్యూస్18 ఇంగ్లీష్ కథనం చెబుతోంది.
2. ఆర్థిక మాంద్యంలో థియేటర్ల ఎంట్రీ..
1920-1930ల మధ్య కాలంలో అమెరికాను చుట్టుముట్టిన ‘ది గ్రేట్ డిప్రెషన్’ అనే తీవ్రమైన ఆర్థిక మాంద్యం సమయంలో పాప్‌కార్న్ వ్యాపారం బాగా పుంజుకుంది. ఆర్థిక మాంద్యం వల్ల ప్రజల దగ్గర డబ్బులు లేని సమయంలో పాప్‌కార్న్ చాలా తక్కువ ధరకు లభించడంతో పేదవారు కూడా సులభంగా కొనుగోలు చేయడానికి వీలయ్యేది. దాంతో వీధి వ్యాపారులు సినిమా థియేటర్ల ముందు పాప్‌కార్న్ బండ్లు పెట్టడం స్టార్ట్ చేశారు. ఆ తర్వాత సినిమా థియేటర్ల యజమానులు కూడా థియేటర్లలోనే పాప్‌కార్న్ విక్రయాలు ప్రారంభించి భారీగా లాభాలు గడించారు.
3. రెండో ప్రపంచ యుద్ధం – అసలైన టర్నింగ్ పాయింట్…
పాప్‌కార్న్ పాపులారిటీ రాత్రికి రాత్రే ఊహించని రేంజ్ లో పెరగడానికి రెండో ప్రపంచ యుద్ధం (1939-1945) అసలైన టర్నింగ్ పాయింట్ గా మారిందని న్యూస్18 ఇంగ్లీష్ రిపోర్ట్ స్పష్టం చేసింది. యుద్ధ సమయంలో అమెరికా ప్రభుత్వం సైనికుల కోసం చక్కెర సరఫరాను రిజర్వ్ చేసింది. దాంతో సాధారణ ప్రజలకు చక్కెర రేషనింగ్ పెట్టి లభ్యత తగ్గించారు. చక్కెర దొరకకపోవడం వల్ల కాండీలు, చాక్లెట్లు, స్వీట్లు, సోడాల తయారీ తీవ్రంగా పడిపోయింది. తీపి పదార్థాలు దొరకని ఆ సమయంలో ప్రజలు ప్రత్యామ్నాయంగా ఉప్పు, వెన్నతో లభించే క్రంచీ పాప్‌కార్న్ తినడం వైపు విపరీతంగా మొగ్గు చూపారు. స్వీట్లకు బదులుగా పాప్‌కార్న్ సేల్స్ ఏకంగా మునుపెన్నడూ లేని విధంగా మూడు రెట్లు పెరిగాయి.
4. మైక్రోవేవ్ ట్రెండ్ – నేషనల్ పాప్‌కార్న్ డే..
రెండో ప్రపంచ యుద్ధం తర్వాత పాప్‌కార్న్ కు అలవాటు పడిన ప్రజలు ఇళ్లల్లో కూడా దీన్ని తయారుచేయడం మొదలుపెట్టారు. 1980లలో మార్కెట్ లోకి వచ్చిన ‘మైక్రోవేవ్ పాప్‌కార్న్ ప్యాకెట్లు’ ఈ స్నాక్ ని నిమిషాల్లో ఇంట్లోనే చేసుకునేలా మార్చేసాయి. దాంతో ప్రపంచంలోనే అత్యంత ఆదరణ పొందిన స్నాక్స్ లో పాప్‌కార్న్ మొదటి స్థానంలో నిలిచింది. ఈ అద్భుతమైన స్నాక్ చరిత్రను గౌరవిస్తూ ప్రతి సంవత్సరం జనవరి 19న ‘నేషనల్ పాప్‌కార్న్ డే’గా జరుపుకుంటారు. మొక్కజొన్న గింజ నుండి మొదలై ప్రపంచ యుద్ధం మీదుగా ప్రపంచాన్ని ఊపేసే లెవెల్ కు చేరిన పాప్‌కార్న్ ప్రయాణం నిజంగానే ఒక రోలర్ కోస్టర్ రైడ్ అని చెప్పొచ్చు!
Hyderabad,Telangana

