ప్రభన్యూస్

Actor Ramesh: టాలీవుడ్ నటుడు రమేష్‌కు బ్రెయిన్ స్ట్రోక్.. ఐసీయూలో చికిత్స, అభిమానుల్లో ఆందోళన! | తెలుగు సినిమా వార్తలు


Last Updated:

టాలీవుడ్ నటుడు రమేష్ హాస్పిటల్‌లో చేరాడు. ఆయనకు బ్రెయిన్ స్ట్రోక్ రావడంతో కుటుంబ సభ్యులు వెంటనే హైదరాబాద్‌లోని అపోలో ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం ఆయన ఐసీయూలో చికిత్స పొందుతున్నారు. వైద్యులు ఆయన ఆరోగ్య పరిస్థితిని ఎప్పటికప్పుడు పరిశీలిస్తూ ప్రత్యేక ట్రీట్‌మెంట్ అందిస్తున్నారు.

News18
News18

టాలీవుడ్ నటుడు రమేష్ హాస్పిటల్‌లో చేరాడు. ఆయనకు బ్రెయిన్ స్ట్రోక్ రావడంతో కుటుంబ సభ్యులు వెంటనే హైదరాబాద్‌లోని అపోలో ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం ఆయన ఐసీయూలో చికిత్స పొందుతున్నారు. వైద్యులు ఆయన ఆరోగ్య పరిస్థితిని ఎప్పటికప్పుడు పరిశీలిస్తూ ప్రత్యేక ట్రీట్‌మెంట్ అందిస్తున్నారు. న్యూరాలజిస్టులు సహా ప్రత్యేక వైద్య బృందం రమేష్‌కు చికిత్స అందిస్తోంది. శరీరం చికిత్సకు ఎలా స్పందిస్తోంది అనే విషయాన్ని నిరంతరం గమనిస్తూ తదుపరి వైద్య విధానాన్ని కొనసాగిస్తున్నారు. ప్రస్తుతం ఆయనను వైద్యుల పర్యవేక్షణలోనే ఉంచినట్లు సమాచారం.

రమేష్ పేరు వినగానే చాలామందికి ముందుగా గుర్తుకు వచ్చే సినిమా ‘గబ్బర్ సింగ్’. 2012లో పవన్ కళ్యాణ్ హీరోగా నటించిన ఈ బ్లాక్ బస్టర్ సినిమాతో రమేష్ తెలుగు ప్రేక్షకులకు పరిచయమయ్యారు. ఇందులో విలన్ గ్యాంగ్ సభ్యుడిగా కనిపించిన ఆయన తన ప్రత్యేకమైన నటనతో ప్రేక్షకుల దృష్టిని ఆకర్షించారు. ముఖ్యంగా పోలీస్ స్టేషన్‌లో వచ్చే అంత్యాక్షరి కామెడీ సన్నివేశంలో ఆయన చేసిన నటన ఇప్పటికీ ప్రేక్షకులకు గుర్తుండిపోయేలా ఉంది. ఆ ఒక్క సన్నివేశమే రమేష్‌కు మంచి గుర్తింపును తీసుకొచ్చింది.

గబ్బర్ సింగ్ తర్వాత కూడా పవన్ కళ్యాణ్ నటించిన అత్తారింటికి దారేది అలాగే సర్దార్ గబ్బర్ సింగ్ సినిమాల్లో కూడా రమేష్ నటించారు. కామెడీతో పాటు విలన్ తరహా పాత్రల్లో ఆయన తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్నారు. అంతే కాదు మరి కొన్ని తెలుగు సినిమాల్లో సహాయక నటుడిగా కనిపిస్తూ ప్రేక్షకులను అలరించారు. చిన్న పాత్ర అయినా తన నటనతో గుర్తుండిపోయేలా చేయడం రమేష్ ప్రత్యేకతగా చెప్పాలి.

సినిమాలతో పాటు సోషల్ మీడియాలో కూడా రమేష్ చాలా యాక్టివ్‌గా ఉంటారు. తన షూటింగ్ విశేషాలు అలాగే వ్యక్తిగత జీవితానికి సంబంధించిన విషయాలను అభిమానులతో పంచుకుంటూ ఉంటారు. ఆసక్తికరమైన విషయం ఏంటంటే కేవలం రెండు రోజుల క్రితమే షూటింగ్ లొకేషన్ నుంచి ఒక వీడియోను తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో షేర్ చేశారు. ఆ వీడియో చూసిన అభిమానులు ఆయన కొత్త చిత్రం గురించి ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. కానీ అంతలోనే ఆయనకు బ్రెయిన్ స్ట్రోక్ వచ్చిన వార్త బయటకు రావడంతో అందరూ ఒక్కసారిగా షాక్‌కు గురయ్యారు.

కొన్ని రోజుల క్రితం వరకు షూటింగ్‌లో బిజీగా కనిపించిన రమేష్ ఇప్పుడు ఐసీయూలో చికిత్స పొందుతుండటం అభిమానులను తీవ్ర ఆందోళనకు గురిచేస్తోంది. కుటుంబ సభ్యులు కూడా ఆసుపత్రిలోనే ఉంటూ వైద్యులతో ఎప్పటికప్పుడు మాట్లాడుతున్నారు. ఆయన ఆరోగ్య పరిస్థితి త్వరగా మెరుగుపడాలని ప్రతి ఒక్కరూ ఆశిస్తున్నారు.

రమేష్ ఎన్నో సినిమాల్లో చిన్న చిన్న పాత్రలతో ప్రేక్షకులను అలరించారు. తెరపై కనిపించే సమయం తక్కువే అయినా ఆయన నటన మాత్రం ప్రత్యేకంగా నిలిచేది. అందుకే ఆయనకు అభిమానుల్లో ప్రత్యేక గుర్తింపు ఉంది. ఇప్పుడు ఆయన అనారోగ్య వార్త తెలిసిన తర్వాత సోషల్ మీడియాలో పలువురు ఆయన త్వరగా కోలుకోవాలని ప్రార్థిస్తున్నారు.

Click here to add News18 as your preferred news source on Google.

సినిమా న్యూస్, మూవీ అప్‌డేట్స్, సినిమా రివ్యూస్, OTT అప్‌డేట్స్, టీవీ షోస్‌, రియాల్టీ షోస్‌, వెబ్‌స్టోరీస్ ఈ కేటగిరీలో చూడొచ్చు. న్యూస్ 18 తెలుగులో లేటెస్ట్ ఎంటర్‌టైన్‌మెంట్ అప్‌డేట్స్ చదవండి. మరిన్ని వార్తల కోసం న్యూస్ 18 తెలుగు ఫాలో అవండి.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

×
prabhanews.co.in
Logo
Date of Publish : 22 July 2026, 7:14 pm Digital Edition : Prabhanews
Actor Ramesh: టాలీవుడ్ నటుడు రమేష్‌కు బ్రెయిన్ స్ట్రోక్.. ఐసీయూలో చికిత్స, అభిమానుల్లో ఆందోళన! | తెలుగు సినిమా వార్తలు

Last Updated:Jul 22, 2026 7:00 PM ISTటాలీవుడ్ నటుడు రమేష్ హాస్పిటల్‌లో చేరాడు. ఆయనకు బ్రెయిన్ స్ట్రోక్ రావడంతో కుటుంబ సభ్యులు వెంటనే హైదరాబాద్‌లోని అపోలో ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం ఆయన ఐసీయూలో చికిత్స పొందుతున్నారు. వైద్యులు ఆయన ఆరోగ్య పరిస్థితిని ఎప్పటికప్పుడు పరిశీలిస్తూ ప్రత్యేక ట్రీట్‌మెంట్ అందిస్తున్నారు. News18టాలీవుడ్ నటుడు రమేష్ హాస్పిటల్‌లో చేరాడు. ఆయనకు బ్రెయిన్ స్ట్రోక్ రావడంతో కుటుంబ సభ్యులు వెంటనే హైదరాబాద్‌లోని అపోలో ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం ఆయన ఐసీయూలో చికిత్స పొందుతున్నారు. వైద్యులు ఆయన ఆరోగ్య పరిస్థితిని ఎప్పటికప్పుడు పరిశీలిస్తూ ప్రత్యేక ట్రీట్‌మెంట్ అందిస్తున్నారు. న్యూరాలజిస్టులు సహా ప్రత్యేక వైద్య బృందం రమేష్‌కు చికిత్స అందిస్తోంది. శరీరం చికిత్సకు ఎలా స్పందిస్తోంది అనే విషయాన్ని నిరంతరం గమనిస్తూ తదుపరి వైద్య విధానాన్ని కొనసాగిస్తున్నారు. ప్రస్తుతం ఆయనను వైద్యుల పర్యవేక్షణలోనే ఉంచినట్లు సమాచారం.రమేష్ పేరు వినగానే చాలామందికి ముందుగా గుర్తుకు వచ్చే సినిమా 'గబ్బర్ సింగ్'. 2012లో పవన్ కళ్యాణ్ హీరోగా నటించిన ఈ బ్లాక్ బస్టర్ సినిమాతో రమేష్ తెలుగు ప్రేక్షకులకు పరిచయమయ్యారు. ఇందులో విలన్ గ్యాంగ్ సభ్యుడిగా కనిపించిన ఆయన తన ప్రత్యేకమైన నటనతో ప్రేక్షకుల దృష్టిని ఆకర్షించారు. ముఖ్యంగా పోలీస్ స్టేషన్‌లో వచ్చే అంత్యాక్షరి కామెడీ సన్నివేశంలో ఆయన చేసిన నటన ఇప్పటికీ ప్రేక్షకులకు గుర్తుండిపోయేలా ఉంది. ఆ ఒక్క సన్నివేశమే రమేష్‌కు మంచి గుర్తింపును తీసుకొచ్చింది.గబ్బర్ సింగ్ తర్వాత కూడా పవన్ కళ్యాణ్ నటించిన అత్తారింటికి దారేది అలాగే సర్దార్ గబ్బర్ సింగ్ సినిమాల్లో కూడా రమేష్ నటించారు. కామెడీతో పాటు విలన్ తరహా పాత్రల్లో ఆయన తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్నారు. అంతే కాదు మరి కొన్ని తెలుగు సినిమాల్లో సహాయక నటుడిగా కనిపిస్తూ ప్రేక్షకులను అలరించారు. చిన్న పాత్ర అయినా తన నటనతో గుర్తుండిపోయేలా చేయడం రమేష్ ప్రత్యేకతగా చెప్పాలి.సినిమాలతో పాటు సోషల్ మీడియాలో కూడా రమేష్ చాలా యాక్టివ్‌గా ఉంటారు. తన షూటింగ్ విశేషాలు అలాగే వ్యక్తిగత జీవితానికి సంబంధించిన విషయాలను అభిమానులతో పంచుకుంటూ ఉంటారు. ఆసక్తికరమైన విషయం ఏంటంటే కేవలం రెండు రోజుల క్రితమే షూటింగ్ లొకేషన్ నుంచి ఒక వీడియోను తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో షేర్ చేశారు. ఆ వీడియో చూసిన అభిమానులు ఆయన కొత్త చిత్రం గురించి ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. కానీ అంతలోనే ఆయనకు బ్రెయిన్ స్ట్రోక్ వచ్చిన వార్త బయటకు రావడంతో అందరూ ఒక్కసారిగా షాక్‌కు గురయ్యారు.కొన్ని రోజుల క్రితం వరకు షూటింగ్‌లో బిజీగా కనిపించిన రమేష్ ఇప్పుడు ఐసీయూలో చికిత్స పొందుతుండటం అభిమానులను తీవ్ర ఆందోళనకు గురిచేస్తోంది. కుటుంబ సభ్యులు కూడా ఆసుపత్రిలోనే ఉంటూ వైద్యులతో ఎప్పటికప్పుడు మాట్లాడుతున్నారు. ఆయన ఆరోగ్య పరిస్థితి త్వరగా మెరుగుపడాలని ప్రతి ఒక్కరూ ఆశిస్తున్నారు.రమేష్ ఎన్నో సినిమాల్లో చిన్న చిన్న పాత్రలతో ప్రేక్షకులను అలరించారు. తెరపై కనిపించే సమయం తక్కువే అయినా ఆయన నటన మాత్రం ప్రత్యేకంగా నిలిచేది. అందుకే ఆయనకు అభిమానుల్లో ప్రత్యేక గుర్తింపు ఉంది. ఇప్పుడు ఆయన అనారోగ్య వార్త తెలిసిన తర్వాత సోషల్ మీడియాలో పలువురు ఆయన త్వరగా కోలుకోవాలని ప్రార్థిస్తున్నారు.Click here to add News18 as your preferred news source on Google. సినిమా న్యూస్, మూవీ అప్‌డేట్స్, సినిమా రివ్యూస్, OTT అప్‌డేట్స్, టీవీ షోస్‌, రియాల్టీ షోస్‌, వెబ్‌స్టోరీస్ ఈ కేటగిరీలో చూడొచ్చు. న్యూస్ 18 తెలుగులో లేటెస్ట్ ఎంటర్‌టైన్‌మెంట్ అప్‌డేట్స్ చదవండి. మరిన్ని వార్తల కోసం న్యూస్ 18 తెలుగు ఫాలో అవండి.Location :Hyderabad,Telanganaమరింత చదవండి

Source link