వర్షాకాలం ఎండల నుంచి ఉపశమనం కలిగించినప్పటికీ, ఇళ్లలో తేమ (సీలింగ్), ఫంగస్, దుర్వాసన వంటి సమస్యలను తీసుకొస్తుంది. ఎడతెరిపి లేకుండా కురిసే వర్షాల కారణంగా గోడలు, పైకప్పుల్లో తేమ చేరి పెయింట్ ఊడిపోవడం, ప్లాస్టర్ రాలిపోవడం, నల్లటి లేదా ఆకుపచ్చ రంగు ఫంగస్ ఏర్పడడం వంటి సమస్యలు కనిపిస్తాయి. వీటిని నిర్లక్ష్యం చేస్తే ఇంటి అందమే కాకుండా నిర్మాణ బలం కూడా దెబ్బతినే ప్రమాదం ఉంది. అయితే కొన్ని సులభమైన జాగ్రత్తలు పాటిస్తే వర్షాకాలంలో కూడా ఇంటిని తేమ సమస్య నుంచి రక్షించుకోవచ్చు.

