Coriander Leaves: మనం ప్రతిరోజూ వండే కూరలు, పప్పు, బిర్యానీలలో రుచి కోసం, గార్నిషింగ్ కోసం కొత్తిమీరను విరివిగా ఉపయోగిస్తుంటాం. ఆయుర్వేదం, ఆధునిక పోషకాహార శాస్త్రం ప్రకారం కొత్తిమీరలో విటమిన్ ఎ, సి, కే తో పాటు యాంటీ ఆక్సిడెంట్లు సమృద్ధిగా లభిస్తాయి బ్రో. ఇది జీర్ణక్రియను మెరుగుపరచడానికి ఎంతో తోడ్పడుతుంది. అయితే ఎంత మంచి ఆహారమైనా సరే అందరికీ పడాలని లేదని హైదరాబాద్ హైటెక్ సిటీ యశోద హాస్పిటల్స్ క్లినికల్ డైరెక్టర్, సీనియర్ కన్సల్టెంట్ గ్యాస్ట్రోఎంటరాలజిస్ట్ అండ్ హెపటాలజిస్ట్ డాక్టర్ కేఎస్ సోమశేఖర్ రావు హెచ్చరిస్తున్నారు. కొందరి శరీర తత్వాలకు, ఇప్పటికే ఉన్న రోగాలకు కొత్తిమీరను ఎక్కువగా తీసుకోవడం వల్ల ప్రతికూల ఫలితాలు వస్తాయి. కింది ఆరోగ్య సమస్యలు ఉన్నవారు కొత్తిమీర వాడకంలో ఎందుకు కేర్‌ఫుల్ గా ఉండాలో ఆ 5 ముఖ్యమైన కారణాలు ఇప్పుడు క్లియర్ గా తెలుసుకుందాం.

