ప్రభన్యూస్

కంప్యూటర్లు, ల్యాప్‌టాప్‌లు కొనేవారికి కీలక అప్డేట్.. కేంద్రం కొత్త రూల్స్.. అసలేంటంటే? | బిజినెస్


Last Updated:

Computer Manufacturing Rules: మన ఇళ్లలో, ఆఫీసుల్లో ఉపయోగించే కంప్యూటర్లు, ల్యాప్‌టాప్‌లు ఎక్కడ తయారవుతున్నాయో ఎప్పుడైనా ఆలోచించారా? వాటిలో ఎన్ని విడిభాగాలు మన దేశంలోనే తయారవుతున్నాయి? ఇప్పటివరకు విదేశీ విడిభాగాలపై ఆధారపడుతున్న ఐటీ హార్డ్‌వేర్ రంగంలో దేశీయ తయారీని పెంచేందుకు కేంద్ర ప్రభుత్వం కీలక అడుగు వేసింది.

News18
News18

మన దేశంలో ఉపయోగించే కంప్యూటర్లు, ల్యాప్‌టాప్‌లు, సర్వర్లు ఎక్కడ తయారవుతున్నాయి? వాటిలో భారతీయ కంపెనీలు తయారు చేసిన విడిభాగాలు ఎన్ని ఉంటున్నాయి? ఇకపై ఇలాంటి అంశాలకు కేంద్ర ప్రభుత్వం మరింత ప్రాధాన్యత ఇవ్వనుంది. దేశీయంగా ఎలక్ట్రానిక్ ఉత్పత్తుల తయారీని పెంచడంతో పాటు, విదేశీ విడిభాగాలపై ఆధారపడటాన్ని తగ్గించే దిశగా కీలక నిర్ణయం తీసుకుంది. ఇందులో భాగంగా ఎలక్ట్రానిక్స్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ మంత్రిత్వ శాఖ (MeitY) ఐటీ హార్డ్‌వేర్ ఉత్పత్తుల్లో స్థానికంగా తయారైన విడిభాగాల విలువను లెక్కించే విధానాన్ని మార్చింది. ఈ నిర్ణయం వల్ల భారతీయ తయారీదారులు, టెక్నాలజీ రంగంలోని కంపెనీలకు ప్రయోజనం కలిగే అవకాశం ఉంది.

ఏయే ఉత్పత్తులకు ఈ కొత్త విధానం వర్తిస్తుంది?

కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన ఈ మార్పులు ఆరు రకాల ఐటీ హార్డ్‌వేర్ ఉత్పత్తులకు వర్తిస్తాయి. వీటిలో డెస్క్‌టాప్ కంప్యూటర్లు, ఆల్ ఇన్ వన్ పీసీలు, ల్యాప్‌టాప్‌లు, థిన్ క్లయింట్లు, సర్వర్లు, కంప్యూటర్ మానిటర్లు, ఇంటరాక్టివ్ ఫ్లాట్ ప్యానెల్ డిస్‌ప్లేలు ఉన్నాయి. పబ్లిక్ ప్రొక్యూర్‌మెంట్ (ప్రిఫరెన్స్ టు మేక్ ఇన్ ఇండియా) ఆర్డర్ 2017 కింద ఈ మార్పులు చేశారు. గతంలో 2020 సెప్టెంబర్ 7న జారీ చేసిన నోటిఫికేషన్‌లోని నిబంధనలను ఈ కొత్త విధానం సవరిస్తుంది. ప్రభుత్వ కొనుగోళ్లలో భారతదేశంలో తయారైన ఉత్పత్తులకు ప్రాధాన్యత కల్పించడం దీని ముఖ్య ఉద్దేశం.

దేశీయంగా తయారైన విడిభాగాలకు ప్రాధాన్యత..

ఇప్పటివరకు ఒక ఉత్పత్తిలో ఎంతమేరకు స్థానికంగా తయారైన భాగాలు ఉన్నాయనే విషయాన్ని గుర్తించేందుకు కొన్ని విధానాలు ఉన్నాయి. ఇప్పుడు కేంద్రం బిల్ ఆఫ్ మెటీరియల్స్ (BoM) ఆధారంగా కొత్త లెక్కింపు విధానాన్ని తీసుకొచ్చింది. అంటే ఒక కంప్యూటర్ లేదా ల్యాప్‌టాప్ తయారీలో ఉపయోగించిన విడిభాగాలు, వాటి తయారీకి సంబంధించిన వివరాలను పరిశీలిస్తారు. మదర్‌బోర్డులను భారతదేశంలోనే SMT టెక్నాలజీతో అసెంబుల్ చేయడం, ప్రింటెడ్ సర్క్యూట్ బోర్డులను దేశీయంగా సేకరించడం వంటి పనులకు గుర్తింపు లభిస్తుంది. అలాగే RAM, SSD వంటి మెమరీ, స్టోరేజ్ విడిభాగాల అసెంబ్లీ, పరీక్షలు, ప్యాకేజింగ్‌కు కూడా ప్రాధాన్యత ఉంటుంది.

కేవలం విడిభాగాలను అసెంబుల్ చేయడమే కాకుండా, దేశంలోనే కొత్త టెక్నాలజీని అభివృద్ధి చేసే కంపెనీలను కూడా ప్రోత్సహించాలని కేంద్రం భావిస్తోంది. ఇందులో భాగంగా భారతదేశంలో నిర్వహించే పరిశోధన, అభివృద్ధి (R&D) కార్యకలాపాలకు ప్రాధాన్యత ఇస్తుంది. భారతీయ కంపెనీలు సొంతంగా ఉత్పత్తుల డిజైన్లు రూపొందించడం, కొత్త ఆవిష్కరణలు చేయడం, మేధో సంపత్తి హక్కులను (IPR) సొంతం చేసుకోవడాన్ని ప్రోత్సహిస్తుంది. దీనివల్ల విదేశీ టెక్నాలజీపై ఆధారపడకుండా దేశీయంగా సాంకేతిక సామర్థ్యాలు పెరిగే అవకాశం ఉంటుంది.

స్వీయ ధృవీకరణకు ప్రత్యేక ఫార్మాట్..

దేశీయ విలువ జోడింపును (DVA) లెక్కించేందుకు, దాని వివరాలను ధృవీకరించేందుకు కేంద్రం ప్రత్యేక ఫార్మాట్‌ను కూడా ప్రవేశపెట్టింది. దీని ద్వారా కంపెనీలు తమ ఉత్పత్తుల్లో ఎంతమేరకు స్థానిక విడిభాగాలు ఉపయోగించాయో వివరాలను సమర్పించవచ్చు. అవసరమైనప్పుడు అధికారులు వాటిని పరిశీలించి ధృవీకరించవచ్చు. దీనివల్ల లెక్కింపులో పారదర్శకత పెరగడంతో పాటు, అన్ని కంపెనీలకు ఒకే విధమైన ప్రమాణాలు వర్తిస్తాయి.

ఎప్పటి నుంచి అమల్లోకి వస్తుంది?

ఈ కొత్త విధానం అధికారిక గెజిట్‌లో ప్రచురించిన తేదీ నుంచి ఆరు నెలల తర్వాత అమల్లోకి వస్తుంది. ఆ తర్వాత పేర్కొన్న ఐటీ ఉత్పత్తులకు సంబంధించి 2020 నాటి పాత నిబంధనల స్థానంలో కొత్త విధానం అమలవుతుంది. మొత్తంగా ఈ నిర్ణయం ద్వారా దేశీయ ఎలక్ట్రానిక్స్ తయారీ, పరిశోధన, ఉపాధి అవకాశాలు పెంచడంతో పాటు మేక్ ఇన్ ఇండియా కార్యక్రమానికి మరింత బలం చేకూర్చాలని కేంద్రం లక్ష్యంగా పెట్టుకుంది.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

×
prabhanews.co.in
Logo
Date of Publish : 21 November 2026, 1:08 pm Digital Edition : Prabhanews
కంప్యూటర్లు, ల్యాప్‌టాప్‌లు కొనేవారికి కీలక అప్డేట్.. కేంద్రం కొత్త రూల్స్.. అసలేంటంటే? | బిజినెస్

Last Updated:Nov 21, 2026 1:00 PM ISTComputer Manufacturing Rules: మన ఇళ్లలో, ఆఫీసుల్లో ఉపయోగించే కంప్యూటర్లు, ల్యాప్‌టాప్‌లు ఎక్కడ తయారవుతున్నాయో ఎప్పుడైనా ఆలోచించారా? వాటిలో ఎన్ని విడిభాగాలు మన దేశంలోనే తయారవుతున్నాయి? ఇప్పటివరకు విదేశీ విడిభాగాలపై ఆధారపడుతున్న ఐటీ హార్డ్‌వేర్ రంగంలో దేశీయ తయారీని పెంచేందుకు కేంద్ర ప్రభుత్వం కీలక అడుగు వేసింది.
News18మన దేశంలో ఉపయోగించే కంప్యూటర్లు, ల్యాప్‌టాప్‌లు, సర్వర్లు ఎక్కడ తయారవుతున్నాయి? వాటిలో భారతీయ కంపెనీలు తయారు చేసిన విడిభాగాలు ఎన్ని ఉంటున్నాయి? ఇకపై ఇలాంటి అంశాలకు కేంద్ర ప్రభుత్వం మరింత ప్రాధాన్యత ఇవ్వనుంది. దేశీయంగా ఎలక్ట్రానిక్ ఉత్పత్తుల తయారీని పెంచడంతో పాటు, విదేశీ విడిభాగాలపై ఆధారపడటాన్ని తగ్గించే దిశగా కీలక నిర్ణయం తీసుకుంది. ఇందులో భాగంగా ఎలక్ట్రానిక్స్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ మంత్రిత్వ శాఖ (MeitY) ఐటీ హార్డ్‌వేర్ ఉత్పత్తుల్లో స్థానికంగా తయారైన విడిభాగాల విలువను లెక్కించే విధానాన్ని మార్చింది. ఈ నిర్ణయం వల్ల భారతీయ తయారీదారులు, టెక్నాలజీ రంగంలోని కంపెనీలకు ప్రయోజనం కలిగే అవకాశం ఉంది.ఏయే ఉత్పత్తులకు ఈ కొత్త విధానం వర్తిస్తుంది?కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన ఈ మార్పులు ఆరు రకాల ఐటీ హార్డ్‌వేర్ ఉత్పత్తులకు వర్తిస్తాయి. వీటిలో డెస్క్‌టాప్ కంప్యూటర్లు, ఆల్ ఇన్ వన్ పీసీలు, ల్యాప్‌టాప్‌లు, థిన్ క్లయింట్లు, సర్వర్లు, కంప్యూటర్ మానిటర్లు, ఇంటరాక్టివ్ ఫ్లాట్ ప్యానెల్ డిస్‌ప్లేలు ఉన్నాయి. పబ్లిక్ ప్రొక్యూర్‌మెంట్ (ప్రిఫరెన్స్ టు మేక్ ఇన్ ఇండియా) ఆర్డర్ 2017 కింద ఈ మార్పులు చేశారు. గతంలో 2020 సెప్టెంబర్ 7న జారీ చేసిన నోటిఫికేషన్‌లోని నిబంధనలను ఈ కొత్త విధానం సవరిస్తుంది. ప్రభుత్వ కొనుగోళ్లలో భారతదేశంలో తయారైన ఉత్పత్తులకు ప్రాధాన్యత కల్పించడం దీని ముఖ్య ఉద్దేశం.దేశీయంగా తయారైన విడిభాగాలకు ప్రాధాన్యత..ఇప్పటివరకు ఒక ఉత్పత్తిలో ఎంతమేరకు స్థానికంగా తయారైన భాగాలు ఉన్నాయనే విషయాన్ని గుర్తించేందుకు కొన్ని విధానాలు ఉన్నాయి. ఇప్పుడు కేంద్రం బిల్ ఆఫ్ మెటీరియల్స్ (BoM) ఆధారంగా కొత్త లెక్కింపు విధానాన్ని తీసుకొచ్చింది. అంటే ఒక కంప్యూటర్ లేదా ల్యాప్‌టాప్ తయారీలో ఉపయోగించిన విడిభాగాలు, వాటి తయారీకి సంబంధించిన వివరాలను పరిశీలిస్తారు. మదర్‌బోర్డులను భారతదేశంలోనే SMT టెక్నాలజీతో అసెంబుల్ చేయడం, ప్రింటెడ్ సర్క్యూట్ బోర్డులను దేశీయంగా సేకరించడం వంటి పనులకు గుర్తింపు లభిస్తుంది. అలాగే RAM, SSD వంటి మెమరీ, స్టోరేజ్ విడిభాగాల అసెంబ్లీ, పరీక్షలు, ప్యాకేజింగ్‌కు కూడా ప్రాధాన్యత ఉంటుంది.కేవలం విడిభాగాలను అసెంబుల్ చేయడమే కాకుండా, దేశంలోనే కొత్త టెక్నాలజీని అభివృద్ధి చేసే కంపెనీలను కూడా ప్రోత్సహించాలని కేంద్రం భావిస్తోంది. ఇందులో భాగంగా భారతదేశంలో నిర్వహించే పరిశోధన, అభివృద్ధి (R&D) కార్యకలాపాలకు ప్రాధాన్యత ఇస్తుంది. భారతీయ కంపెనీలు సొంతంగా ఉత్పత్తుల డిజైన్లు రూపొందించడం, కొత్త ఆవిష్కరణలు చేయడం, మేధో సంపత్తి హక్కులను (IPR) సొంతం చేసుకోవడాన్ని ప్రోత్సహిస్తుంది. దీనివల్ల విదేశీ టెక్నాలజీపై ఆధారపడకుండా దేశీయంగా సాంకేతిక సామర్థ్యాలు పెరిగే అవకాశం ఉంటుంది.స్వీయ ధృవీకరణకు ప్రత్యేక ఫార్మాట్..దేశీయ విలువ జోడింపును (DVA) లెక్కించేందుకు, దాని వివరాలను ధృవీకరించేందుకు కేంద్రం ప్రత్యేక ఫార్మాట్‌ను కూడా ప్రవేశపెట్టింది. దీని ద్వారా కంపెనీలు తమ ఉత్పత్తుల్లో ఎంతమేరకు స్థానిక విడిభాగాలు ఉపయోగించాయో వివరాలను సమర్పించవచ్చు. అవసరమైనప్పుడు అధికారులు వాటిని పరిశీలించి ధృవీకరించవచ్చు. దీనివల్ల లెక్కింపులో పారదర్శకత పెరగడంతో పాటు, అన్ని కంపెనీలకు ఒకే విధమైన ప్రమాణాలు వర్తిస్తాయి.ఎప్పటి నుంచి అమల్లోకి వస్తుంది?ఈ కొత్త విధానం అధికారిక గెజిట్‌లో ప్రచురించిన తేదీ నుంచి ఆరు నెలల తర్వాత అమల్లోకి వస్తుంది. ఆ తర్వాత పేర్కొన్న ఐటీ ఉత్పత్తులకు సంబంధించి 2020 నాటి పాత నిబంధనల స్థానంలో కొత్త విధానం అమలవుతుంది. మొత్తంగా ఈ నిర్ణయం ద్వారా దేశీయ ఎలక్ట్రానిక్స్ తయారీ, పరిశోధన, ఉపాధి అవకాశాలు పెంచడంతో పాటు మేక్ ఇన్ ఇండియా కార్యక్రమానికి మరింత బలం చేకూర్చాలని కేంద్రం లక్ష్యంగా పెట్టుకుంది.మరింత చదవండి

Source link