ప్రభన్యూస్

Jabardasth Dhanraj: రంగస్థలం మహేష్, జబర్దస్త్ ధ‌న్‌రాజ్ కాంబోలో శివాలయం.. ఇదిగో డీటెయిల్స్ | తెలుగు సినిమా వార్తలు


Last Updated:

భక్తి, ఆధ్యాత్మికత, భావోద్వేగాల సమ్మేళనంగా శ్రీ శివసాయి ఫిలిమ్స్, శ్రీమ‌తి శ్రీ ల‌క్ష్మిన‌ర్సింహ‌రెడ్డి చిత్రాల‌యం సంయుక్త‌ బ్యానర్‌ల‌పై తెరకెక్కుతున్న చిత్రం ‘శివాలయం’. ఈ సినిమాలో ‘రంగస్థలం’ ఫేమ్ ఆచంట మహేష్, జబర్దస్త్ ధ‌న్‌రాజ్ కీలక పాత్రల్లో నటిస్తున్నారు.

News18
News18

తెలుగు ప్రేక్షకులను భక్తిరసంతో అలరించేందుకు మరో ఆధ్యాత్మిక చిత్రం సిద్ధమవుతోంది. భక్తి, ఆధ్యాత్మికత, భావోద్వేగాల సమ్మేళనంగా శ్రీ శివసాయి ఫిలిమ్స్, శ్రీమ‌తి శ్రీ ల‌క్ష్మిన‌ర్సింహ‌రెడ్డి చిత్రాల‌యం సంయుక్త‌ బ్యానర్‌ల‌పై తెరకెక్కుతున్న చిత్రం ‘శివాలయం’. ఈ సినిమా టీజర్, పోస్టర్ ఆవిష్కరణ కార్యక్రమం హైదరాబాద్‌లోని ప్రసాద్ ల్యాబ్‌లో ఘనంగా జరిగింది. ఈ వేడుక కోసం చిత్ర బృందం ప్రత్యేకంగా శివాలయం సెట్‌ను ఏర్పాటు చేయడం విశేష ఆకర్షణగా నిలిచింది.

‘శివాలయం’ మూవీ టీజర్, పోస్టర్ లాంచ్ వేడుక‌లో ముఖ్య అతిథులుగా నిర్మాత‌లు ఈద (EEDA) రవి రాజా, సాయిలక్ష్మణ్ అల్లు, నబీ షేక్, పి.నాగలక్ష్మి, కుప్పిలి శ్రీనివాస పాల్గొని చిత్ర‌యూనిట్‌కు శుభాకాంక్ష‌లు అందించారు. సినిమా భారీ హిట్ సాధించాల‌ని ఆకాంక్షించారు. ‘రంగస్థలం’ ఫేమ్ ఆచంట మహేష్, కాంచన దీప్తిరెడ్డి, ధ‌న్‌రాజ్, సుష్మ ప్రధాన పాత్రల్లో నటిస్తున్న ఈ చిత్రానికి వెంకట్‌రెడ్డి నంది దర్శకత్వం వహిస్తున్నారు. వెంకట్‌రెడ్డి నందితో పాటు కళ్లెం నర్సింహారెడ్డి నిర్మాణ బాధ్యతలు చేపట్టారు.

ఈ సందర్భంగా నటుడు ఘర్షణ శ్రీనివాస్ మాట్లాడుతూ.. ప్రస్తుతం సినిమా నిర్మించి విడుదల చేయడం సవాలుగా మారిన పరిస్థితుల్లోనూ దర్శకుడు వెంకట్‌రెడ్డి వరుసగా సినిమాలు రూపొందిస్తూ ప్రేక్షకుల ముందుకు తీసుకురావడం అభినందనీయమన్నారు. ఆయన మంచి ప్రతిభావంతుడైన దర్శకుడని, ‘శివాలయం’ సినిమాను ప్రేక్షకులు ఆదరించి విజయవంతం చేయాలని కోరారు.

సీనియర్ నటుడు నాగ మహేష్ మాట్లాడుతూ.. ఈ చిత్రంలో తనకు మంచి పాత్రతో పాటు ఓ పాటలో నటించే అవకాశం కల్పించిన దర్శకుడు వెంకట్‌రెడ్డికి కృతజ్ఞతలు తెలిపారు. సినిమా ఘన విజయం సాధించాలని ఆకాంక్షించారు. ఈ చిత్రంలో మూడు పాటలు ఉన్నాయని, సంగీత దర్శకుడిగా అవకాశం కల్పించిన దర్శక నిర్మాతలకు ధన్యవాదాలు అని సంగీత దర్శకుడు డ్రమ్స్ రాము తెలిపారు.

అతి తక్కువ సమయంలోనే చిత్రాన్ని పూర్తి చేయడం ఆనందంగా ఉందన్నారు. నిర్మాత కళ్లెం నర్సింహారెడ్డి గొప్ప వ్యవసాయవేత్త అని, నందమూరి తారక రామారావుతో కలిసి పనిచేసిన అనుభవం ఉన్న ఆయన తమ చిత్రాన్ని నిర్మించడం గర్వకారణమని హీరో ఆచంట మహేష్ పేర్కొన్నారు.

తనకు ఈ చిత్రంలో అవకాశం కల్పించిన దర్శక నిర్మాతలకు కృతజ్ఞతలు తెలిపారు. ప్రేక్షకుల ప్రేమ, ఆదరణ తమకు ఎంతో ముఖ్యమని అన్నారు. మరో హీరోయిన్ సుష్మ మాట్లాడుతూ.. సినిమాలో అన్ని రకాల అంశాలు ఉన్నాయని, ప్రేక్షకులను తప్పకుండా ఆకట్టుకుంటుందని ఆశాభావం వ్యక్తం చేశారు హీరోయిన్ దీప్తిరెడ్డి.

నటుడు దిల్ రమేష్ మాట్లాడుతూ.. తక్కువ రోజుల్లోనే సినిమాను పూర్తి చేసిన దర్శకుడు వెంకట్‌రెడ్డిని అభినందించారు. తెలుగు నటీనటులు, సాంకేతిక నిపుణులకు అవకాశాలు కల్పించడం సంతోషకరమన్నారు. 89 ఏళ్ల వయసులోనూ ఎంతో నిబద్ధతతో సినిమాను నిర్మిస్తున్న నిర్మాత కళ్లెం నర్సింహారెడ్డికి పాదాభివందనం చేస్తున్న‌ట్టు తెలిపారు. ఈ చిత్రంలో ఘర్షణ శ్రీనివాస్, స‌మ్మెట గాంధీ, మురం రెడ్డి వెంకటేశ్వర్లు, మధుమతి కొక్కంటి, ముత్యాల ఉమా, చిట్టిబాబు, దిల్ రమేష్ తదితరులు కీలక పాత్రలు పోషిస్తున్నారు.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

×
prabhanews.co.in
Logo
Date of Publish : 09 November 2026, 4:59 pm Digital Edition : Prabhanews
Jabardasth Dhanraj: రంగస్థలం మహేష్, జబర్దస్త్ ధ‌న్‌రాజ్ కాంబోలో శివాలయం.. ఇదిగో డీటెయిల్స్ | తెలుగు సినిమా వార్తలు

Last Updated:Nov 09, 2026 4:48 PM ISTభక్తి, ఆధ్యాత్మికత, భావోద్వేగాల సమ్మేళనంగా శ్రీ శివసాయి ఫిలిమ్స్, శ్రీమ‌తి శ్రీ ల‌క్ష్మిన‌ర్సింహ‌రెడ్డి చిత్రాల‌యం సంయుక్త‌ బ్యానర్‌ల‌పై తెరకెక్కుతున్న చిత్రం ‘శివాలయం’. ఈ సినిమాలో ‘రంగస్థలం’ ఫేమ్ ఆచంట మహేష్, జబర్దస్త్ ధ‌న్‌రాజ్ కీలక పాత్రల్లో నటిస్తున్నారు. News18తెలుగు ప్రేక్షకులను భక్తిరసంతో అలరించేందుకు మరో ఆధ్యాత్మిక చిత్రం సిద్ధమవుతోంది. భక్తి, ఆధ్యాత్మికత, భావోద్వేగాల సమ్మేళనంగా శ్రీ శివసాయి ఫిలిమ్స్, శ్రీమ‌తి శ్రీ ల‌క్ష్మిన‌ర్సింహ‌రెడ్డి చిత్రాల‌యం సంయుక్త‌ బ్యానర్‌ల‌పై తెరకెక్కుతున్న చిత్రం ‘శివాలయం’. ఈ సినిమా టీజర్, పోస్టర్ ఆవిష్కరణ కార్యక్రమం హైదరాబాద్‌లోని ప్రసాద్ ల్యాబ్‌లో ఘనంగా జరిగింది. ఈ వేడుక కోసం చిత్ర బృందం ప్రత్యేకంగా శివాలయం సెట్‌ను ఏర్పాటు చేయడం విశేష ఆకర్షణగా నిలిచింది.‘శివాలయం’ మూవీ టీజర్, పోస్టర్ లాంచ్ వేడుక‌లో ముఖ్య అతిథులుగా నిర్మాత‌లు ఈద (EEDA) రవి రాజా, సాయిలక్ష్మణ్ అల్లు, నబీ షేక్, పి.నాగలక్ష్మి, కుప్పిలి శ్రీనివాస పాల్గొని చిత్ర‌యూనిట్‌కు శుభాకాంక్ష‌లు అందించారు. సినిమా భారీ హిట్ సాధించాల‌ని ఆకాంక్షించారు. ‘రంగస్థలం’ ఫేమ్ ఆచంట మహేష్, కాంచన దీప్తిరెడ్డి, ధ‌న్‌రాజ్, సుష్మ ప్రధాన పాత్రల్లో నటిస్తున్న ఈ చిత్రానికి వెంకట్‌రెడ్డి నంది దర్శకత్వం వహిస్తున్నారు. వెంకట్‌రెడ్డి నందితో పాటు కళ్లెం నర్సింహారెడ్డి నిర్మాణ బాధ్యతలు చేపట్టారు.ఈ సందర్భంగా నటుడు ఘర్షణ శ్రీనివాస్ మాట్లాడుతూ.. ప్రస్తుతం సినిమా నిర్మించి విడుదల చేయడం సవాలుగా మారిన పరిస్థితుల్లోనూ దర్శకుడు వెంకట్‌రెడ్డి వరుసగా సినిమాలు రూపొందిస్తూ ప్రేక్షకుల ముందుకు తీసుకురావడం అభినందనీయమన్నారు. ఆయన మంచి ప్రతిభావంతుడైన దర్శకుడని, ‘శివాలయం’ సినిమాను ప్రేక్షకులు ఆదరించి విజయవంతం చేయాలని కోరారు.సీనియర్ నటుడు నాగ మహేష్ మాట్లాడుతూ.. ఈ చిత్రంలో తనకు మంచి పాత్రతో పాటు ఓ పాటలో నటించే అవకాశం కల్పించిన దర్శకుడు వెంకట్‌రెడ్డికి కృతజ్ఞతలు తెలిపారు. సినిమా ఘన విజయం సాధించాలని ఆకాంక్షించారు. ఈ చిత్రంలో మూడు పాటలు ఉన్నాయని, సంగీత దర్శకుడిగా అవకాశం కల్పించిన దర్శక నిర్మాతలకు ధన్యవాదాలు అని సంగీత దర్శకుడు డ్రమ్స్ రాము తెలిపారు.అతి తక్కువ సమయంలోనే చిత్రాన్ని పూర్తి చేయడం ఆనందంగా ఉందన్నారు. నిర్మాత కళ్లెం నర్సింహారెడ్డి గొప్ప వ్యవసాయవేత్త అని, నందమూరి తారక రామారావుతో కలిసి పనిచేసిన అనుభవం ఉన్న ఆయన తమ చిత్రాన్ని నిర్మించడం గర్వకారణమని హీరో ఆచంట మహేష్ పేర్కొన్నారు.తనకు ఈ చిత్రంలో అవకాశం కల్పించిన దర్శక నిర్మాతలకు కృతజ్ఞతలు తెలిపారు. ప్రేక్షకుల ప్రేమ, ఆదరణ తమకు ఎంతో ముఖ్యమని అన్నారు. మరో హీరోయిన్ సుష్మ మాట్లాడుతూ.. సినిమాలో అన్ని రకాల అంశాలు ఉన్నాయని, ప్రేక్షకులను తప్పకుండా ఆకట్టుకుంటుందని ఆశాభావం వ్యక్తం చేశారు హీరోయిన్ దీప్తిరెడ్డి.నటుడు దిల్ రమేష్ మాట్లాడుతూ.. తక్కువ రోజుల్లోనే సినిమాను పూర్తి చేసిన దర్శకుడు వెంకట్‌రెడ్డిని అభినందించారు. తెలుగు నటీనటులు, సాంకేతిక నిపుణులకు అవకాశాలు కల్పించడం సంతోషకరమన్నారు. 89 ఏళ్ల వయసులోనూ ఎంతో నిబద్ధతతో సినిమాను నిర్మిస్తున్న నిర్మాత కళ్లెం నర్సింహారెడ్డికి పాదాభివందనం చేస్తున్న‌ట్టు తెలిపారు. ఈ చిత్రంలో ఘర్షణ శ్రీనివాస్, స‌మ్మెట గాంధీ, మురం రెడ్డి వెంకటేశ్వర్లు, మధుమతి కొక్కంటి, ముత్యాల ఉమా, చిట్టిబాబు, దిల్ రమేష్ తదితరులు కీలక పాత్రలు పోషిస్తున్నారు.మరింత చదవండి

Source link