ప్రభన్యూస్

Janhvi Kapoor: సినిమా ఇండస్ట్రీ అంటేనే అలాంటిది, అమ్మ ముందే చెప్పింది.. షాకింగ్ సీక్రెట్స్ బయటపెట్టిన జాన్వీ కపూర్ | తెలుగు సినిమా వార్తలు


Last Updated:

దివంగత శ్రీదేవి ముద్దుల తనయ జాన్వీ కపూర్ తాజాగా ఓ ఇంటర్వ్యూలో చేసిన వ్యాఖ్యలు నెట్టింట సెన్సేషన్ అయ్యాయి. కెరీర్ ఆరంభంలో తన తల్లి పెట్టిన కండిషన్లు, సినిమా రంగం పట్ల ఆమె ఇచ్చిన హెచ్చరికలతో పాటు తన ముక్కు సర్జరీ గురించి జాన్వీ సంచలన విషయాలు బయటపెట్టింది.

News18
News18

బాలీవుడ్ బ్యూటీ, అతిలోక సుందరి, దివంగత శ్రీదేవి ముద్దుల తనయ జాన్వీ కపూర్ తాజాగా ఓ ఇంటర్వ్యూలో చేసిన వ్యాఖ్యలు నెట్టింట సెన్సేషన్ అయ్యాయి. కెరీర్ ఆరంభంలో తన తల్లి పెట్టిన కండిషన్లు, సినిమా రంగం పట్ల ఆమె ఇచ్చిన హెచ్చరికలతో పాటు తన ముక్కు సర్జరీ (Nose Job) గురించి జాన్వీ సంచలన విషయాలు బయటపెట్టింది. 2018లో ‘ధడక్’ సినిమాతో ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన ఈ భామ.. అప్పటి విషయాలను తాజాగా నెమరువేసుకుంది.

తనకు సినిమాల్లోకి రావాలని ఉన్న విషయాన్ని ముందుగా తల్లికి చెప్పినప్పుడు, శ్రీదేవి తీవ్రంగా వ్యతిరేకించారని జాన్వీ తెలిపింది. సినీ రంగం పూలపాన్పు కాదని, రంగుల ప్రపంచం వెనుక ఎన్నో కష్టాలు, సవాళ్లు ఉంటాయని శ్రీదేవి హెచ్చరించారట. “ఒకసారి ఇండస్ట్రీలోకి అడుగుపెడితే జీవితాంతం నటనకే అంకితం కావాలి. అడుగడుగునా విమర్శలు, ఒత్తిళ్లు ఎదుర్కోవాల్సి వస్తుంది. దానికి పూర్తి నిబద్ధత అవసరం” అని శ్రీదేవి తన కూతురికి తేల్చి చెప్పారు. సున్నిత మనస్కురాలైన జాన్వీ ఈ సవాళ్లను తట్టుకోగలదా లేదా అన్న అనుమానం మొదట్లో శ్రీదేవికి తీవ్రంగా ఉండేదట.

అయితే, ఈ ఇంటర్వ్యూలో అందరి దృష్టిని ఆకర్షించిన మరో ప్రధాన అంశం ‘ప్లాస్టిక్ సర్జరీ’. సినిమాల్లోకి రాకముందే తాను ముక్కుకు సర్జరీ చేయించుకున్నానని జాన్వీ ఎలాంటి మొహమాటం లేకుండా ఓపెన్‌గా ఒప్పుకుంది. తన తల్లి శ్రీదేవి సూచన, సలహా మేరకే ఈ సాహసోపేత నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించింది. ముఖకవళికల్లో ఆ చిన్న మార్పు జరిగిన తర్వాతే.. తనలో ఓ గ్లామర్ తారగా, నటిగా రాణించగల లక్షణాలు ఉన్నాయని శ్రీదేవి పూర్తిగా నమ్మారని జాన్వీ చెప్పుకొచ్చింది.

ప్రస్తుతం సోషల్ మీడియాలో యువతలు అందం విషయంలో పడుతున్న ఆరాటంపై కూడా జాన్వీ స్పందించింది. ఇన్‌స్టాగ్రామ్, ఫేస్‌బుక్‌లలో కనిపించే ఫిల్టర్ ఫొటోలు, కృత్రిమ అందాలను చూసి ఎవరూ తమను తాము తక్కువ అంచనా వేసుకోవద్దని, ఇతరులతో అందాన్ని పోల్చుకోవడం మానుకోవాలని హితవు పలికింది. తన ఆలోచనా విధానం, కెరీర్ ఎదుగుదల వెనుక తన తల్లి శ్రీదేవి స్పూర్తి ఎంతో ఉందని జాన్వీ భావోద్వేగానికి గురైంది. ప్రస్తుతం బాలీవుడ్‌లో బిజీగా ఉన్న జాన్వీ కపూర్.. తెలుగులో జూనియర్ ఎన్టీఆర్ సరసన ‘దేవర’, రామ్ చరణ్ సరసన ‘పెద్ది’ చిత్రాలతో టాలీవుడ్ ప్రేక్షకులను సైతం ఆకట్టుకుంది.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

×
prabhanews.co.in
Logo
Date of Publish : 09 November 2026, 4:07 pm Digital Edition : Prabhanews
Janhvi Kapoor: సినిమా ఇండస్ట్రీ అంటేనే అలాంటిది, అమ్మ ముందే చెప్పింది.. షాకింగ్ సీక్రెట్స్ బయటపెట్టిన జాన్వీ కపూర్ | తెలుగు సినిమా వార్తలు

Last Updated:Nov 09, 2026 4:01 PM ISTదివంగత శ్రీదేవి ముద్దుల తనయ జాన్వీ కపూర్ తాజాగా ఓ ఇంటర్వ్యూలో చేసిన వ్యాఖ్యలు నెట్టింట సెన్సేషన్ అయ్యాయి. కెరీర్ ఆరంభంలో తన తల్లి పెట్టిన కండిషన్లు, సినిమా రంగం పట్ల ఆమె ఇచ్చిన హెచ్చరికలతో పాటు తన ముక్కు సర్జరీ గురించి జాన్వీ సంచలన విషయాలు బయటపెట్టింది. News18బాలీవుడ్ బ్యూటీ, అతిలోక సుందరి, దివంగత శ్రీదేవి ముద్దుల తనయ జాన్వీ కపూర్ తాజాగా ఓ ఇంటర్వ్యూలో చేసిన వ్యాఖ్యలు నెట్టింట సెన్సేషన్ అయ్యాయి. కెరీర్ ఆరంభంలో తన తల్లి పెట్టిన కండిషన్లు, సినిమా రంగం పట్ల ఆమె ఇచ్చిన హెచ్చరికలతో పాటు తన ముక్కు సర్జరీ (Nose Job) గురించి జాన్వీ సంచలన విషయాలు బయటపెట్టింది. 2018లో 'ధడక్' సినిమాతో ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన ఈ భామ.. అప్పటి విషయాలను తాజాగా నెమరువేసుకుంది.తనకు సినిమాల్లోకి రావాలని ఉన్న విషయాన్ని ముందుగా తల్లికి చెప్పినప్పుడు, శ్రీదేవి తీవ్రంగా వ్యతిరేకించారని జాన్వీ తెలిపింది. సినీ రంగం పూలపాన్పు కాదని, రంగుల ప్రపంచం వెనుక ఎన్నో కష్టాలు, సవాళ్లు ఉంటాయని శ్రీదేవి హెచ్చరించారట. "ఒకసారి ఇండస్ట్రీలోకి అడుగుపెడితే జీవితాంతం నటనకే అంకితం కావాలి. అడుగడుగునా విమర్శలు, ఒత్తిళ్లు ఎదుర్కోవాల్సి వస్తుంది. దానికి పూర్తి నిబద్ధత అవసరం" అని శ్రీదేవి తన కూతురికి తేల్చి చెప్పారు. సున్నిత మనస్కురాలైన జాన్వీ ఈ సవాళ్లను తట్టుకోగలదా లేదా అన్న అనుమానం మొదట్లో శ్రీదేవికి తీవ్రంగా ఉండేదట.అయితే, ఈ ఇంటర్వ్యూలో అందరి దృష్టిని ఆకర్షించిన మరో ప్రధాన అంశం 'ప్లాస్టిక్ సర్జరీ'. సినిమాల్లోకి రాకముందే తాను ముక్కుకు సర్జరీ చేయించుకున్నానని జాన్వీ ఎలాంటి మొహమాటం లేకుండా ఓపెన్‌గా ఒప్పుకుంది. తన తల్లి శ్రీదేవి సూచన, సలహా మేరకే ఈ సాహసోపేత నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించింది. ముఖకవళికల్లో ఆ చిన్న మార్పు జరిగిన తర్వాతే.. తనలో ఓ గ్లామర్ తారగా, నటిగా రాణించగల లక్షణాలు ఉన్నాయని శ్రీదేవి పూర్తిగా నమ్మారని జాన్వీ చెప్పుకొచ్చింది.ప్రస్తుతం సోషల్ మీడియాలో యువతలు అందం విషయంలో పడుతున్న ఆరాటంపై కూడా జాన్వీ స్పందించింది. ఇన్‌స్టాగ్రామ్, ఫేస్‌బుక్‌లలో కనిపించే ఫిల్టర్ ఫొటోలు, కృత్రిమ అందాలను చూసి ఎవరూ తమను తాము తక్కువ అంచనా వేసుకోవద్దని, ఇతరులతో అందాన్ని పోల్చుకోవడం మానుకోవాలని హితవు పలికింది. తన ఆలోచనా విధానం, కెరీర్ ఎదుగుదల వెనుక తన తల్లి శ్రీదేవి స్పూర్తి ఎంతో ఉందని జాన్వీ భావోద్వేగానికి గురైంది. ప్రస్తుతం బాలీవుడ్‌లో బిజీగా ఉన్న జాన్వీ కపూర్.. తెలుగులో జూనియర్ ఎన్టీఆర్ సరసన 'దేవర', రామ్ చరణ్ సరసన 'పెద్ది' చిత్రాలతో టాలీవుడ్ ప్రేక్షకులను సైతం ఆకట్టుకుంది.మరింత చదవండి

Source link