ప్రభన్యూస్

Irumudi: ఇరుముడి సినిమా వివాదం.. నిర్మాతలకు తెలంగాణ కార్మిక శాఖ సమన్లు.. అసలేం జరిగింది? | తెలుగు సినిమా వార్తలు


Last Updated:

‘ఇరుముడి’ చిత్రంలో మైనర్ బాలికతో షూటింగ్, ప్రమోషన్లు నిర్వహించడంపై వివాదం చెలరేగింది. బాల కార్మిక చట్టాల ఉల్లంఘన ఆరోపణలపై తెలంగాణ కార్మిక శాఖ చిత్ర నిర్మాతలకు నోటీసులు జారీ చేసి డాక్యుమెంట్లు సమర్పించాలని ఆదేశించింది.

News18
News18

మాస్ మహారాజా రవితేజ నటించిన తాజా చిత్రం ‘ఇరుముడి’ చుట్టూ బాల కార్మిక చట్టాల ఉల్లంఘన వివాదం ముదిరింది. చిత్రంలో ఒక మైనర్ బాలికతో షూటింగ్ జరపడంతో పాటు ప్రమోషన్లలో ఆమెను భాగస్వామ్యం చేయడంపై తెలంగాణ రాష్ట్ర కార్మిక శాఖ తీవ్రంగా స్పందించింది. నిబంధనలు పాటించారా లేదా అనే అంశంపై పూర్తి స్థాయి ఆధారాలతో విచారణకు హాజరుకావాలంటూ రంగారెడ్డి జోన్ జాయింట్ కమిషనర్ చిత్ర నిర్మాణ సంస్థకు సమన్లు జారీ చేశారు. జై లోక్ సత్తా సోషల్ జస్టిస్ ఫోరం అధ్యక్షుడు సి. మహేష్ బాబు దాఖలు చేసిన ఫిర్యాదు ఆధారంగా అధికారులు ఈ చర్యలు చేపట్టారు.

నవంబర్ 4న ఆర్టీసీ క్రాస్ రోడ్స్‌లోని అంజయ్య కార్మిక సంక్షేమ భవన్‌లో జరిగే విచారణకు నిర్మాతలు స్వయంగా లేదా అధీకృత ప్రతినిధి ద్వారా అన్ని రికార్డులతో హాజరు కావాలని స్పష్టం చేశారు.

చట్టపరమైన అనుమతులు, డిపాజిట్లపై అధికారుల ఆరా

మైనర్ బాలికతో చిత్రీకరణ చేపట్టేందుకు జిల్లా మేజిస్ట్రేట్ నుంచి ముందస్తు అనుమతి తీసుకున్నారా? తల్లిదండ్రుల లిఖితపూర్వక సమ్మతి పత్రాలు ఉన్నాయా? అనే అంశాలపై అధికారులు నివేదిక కోరారు. ఆమెకు కేటాయించిన కాల్‌షీట్లు, పని గంటలు, రోజువారీ హాజరు పట్టీలతో పాటు చదువుకు ఇబ్బంది కలగకుండా తీసుకున్న ప్రత్యామ్నాయ చర్యల వివరాలను సమర్పించాలని ఆదేశించారు.

బాల కార్మిక నిబంధనల ప్రకారం బాలికకు అందించిన మొత్తం పారితోషికంలో 20 శాతం మొత్తాన్ని ఆమె పేరుతో ఫిక్స్‌డ్ డిపాజిట్ చేశారా లేదా అన్న విషయాన్ని స్పష్టం చేయాలని నోటీసుల్లో పేర్కొన్నారు. ఈవెంట్లు, ప్రమోషన్ల సమయంలో మాట్లాడిన సంభాషణలు, ఉపయోగించిన భాష చిన్నారి గౌరవానికి భంగం కలిగించేలా ఉన్నాయా అనే కోణంలోనూ విచారణ జరపనున్నారు. నియమ నిబంధనలు ఉల్లంఘించినట్లు తేలితే కఠిన చర్యలు తప్పవని అధికారులు హెచ్చరించారు.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

×
prabhanews.co.in
Logo
Date of Publish : 31 October 2026, 9:42 pm Digital Edition : Prabhanews
Irumudi: ఇరుముడి సినిమా వివాదం.. నిర్మాతలకు తెలంగాణ కార్మిక శాఖ సమన్లు.. అసలేం జరిగింది? | తెలుగు సినిమా వార్తలు

Last Updated:Oct 31, 2026 9:39 PM IST'ఇరుముడి' చిత్రంలో మైనర్ బాలికతో షూటింగ్, ప్రమోషన్లు నిర్వహించడంపై వివాదం చెలరేగింది. బాల కార్మిక చట్టాల ఉల్లంఘన ఆరోపణలపై తెలంగాణ కార్మిక శాఖ చిత్ర నిర్మాతలకు నోటీసులు జారీ చేసి డాక్యుమెంట్లు సమర్పించాలని ఆదేశించింది.News18మాస్ మహారాజా రవితేజ నటించిన తాజా చిత్రం 'ఇరుముడి' చుట్టూ బాల కార్మిక చట్టాల ఉల్లంఘన వివాదం ముదిరింది. చిత్రంలో ఒక మైనర్ బాలికతో షూటింగ్ జరపడంతో పాటు ప్రమోషన్లలో ఆమెను భాగస్వామ్యం చేయడంపై తెలంగాణ రాష్ట్ర కార్మిక శాఖ తీవ్రంగా స్పందించింది. నిబంధనలు పాటించారా లేదా అనే అంశంపై పూర్తి స్థాయి ఆధారాలతో విచారణకు హాజరుకావాలంటూ రంగారెడ్డి జోన్ జాయింట్ కమిషనర్ చిత్ర నిర్మాణ సంస్థకు సమన్లు జారీ చేశారు. జై లోక్ సత్తా సోషల్ జస్టిస్ ఫోరం అధ్యక్షుడు సి. మహేష్ బాబు దాఖలు చేసిన ఫిర్యాదు ఆధారంగా అధికారులు ఈ చర్యలు చేపట్టారు.నవంబర్ 4న ఆర్టీసీ క్రాస్ రోడ్స్‌లోని అంజయ్య కార్మిక సంక్షేమ భవన్‌లో జరిగే విచారణకు నిర్మాతలు స్వయంగా లేదా అధీకృత ప్రతినిధి ద్వారా అన్ని రికార్డులతో హాజరు కావాలని స్పష్టం చేశారు.చట్టపరమైన అనుమతులు, డిపాజిట్లపై అధికారుల ఆరామైనర్ బాలికతో చిత్రీకరణ చేపట్టేందుకు జిల్లా మేజిస్ట్రేట్ నుంచి ముందస్తు అనుమతి తీసుకున్నారా? తల్లిదండ్రుల లిఖితపూర్వక సమ్మతి పత్రాలు ఉన్నాయా? అనే అంశాలపై అధికారులు నివేదిక కోరారు. ఆమెకు కేటాయించిన కాల్‌షీట్లు, పని గంటలు, రోజువారీ హాజరు పట్టీలతో పాటు చదువుకు ఇబ్బంది కలగకుండా తీసుకున్న ప్రత్యామ్నాయ చర్యల వివరాలను సమర్పించాలని ఆదేశించారు.బాల కార్మిక నిబంధనల ప్రకారం బాలికకు అందించిన మొత్తం పారితోషికంలో 20 శాతం మొత్తాన్ని ఆమె పేరుతో ఫిక్స్‌డ్ డిపాజిట్ చేశారా లేదా అన్న విషయాన్ని స్పష్టం చేయాలని నోటీసుల్లో పేర్కొన్నారు. ఈవెంట్లు, ప్రమోషన్ల సమయంలో మాట్లాడిన సంభాషణలు, ఉపయోగించిన భాష చిన్నారి గౌరవానికి భంగం కలిగించేలా ఉన్నాయా అనే కోణంలోనూ విచారణ జరపనున్నారు. నియమ నిబంధనలు ఉల్లంఘించినట్లు తేలితే కఠిన చర్యలు తప్పవని అధికారులు హెచ్చరించారు.మరింత చదవండి

Source link