మీ మొత్తం పెట్టుబడుల్లో వెండికి ఎంత వాటా కేటాయించాలన్నది కూడా ముఖ్యమైన అంశం. ప్రశాంత్ గుప్తా ప్రకారం, బంగారం, వెండి వంటి విలువైన లోహాలకు పోర్ట్‌ఫోలియోలో పరిమితమైన వాటానే కేటాయించాలి. బంగారంతో పోలిస్తే వెండి ధరల్లో ఒడిదుడుకులు ఎక్కువగా ఉంటాయి. అందుకే వెండికి కేటాయించే వాటా సాధారణంగా బంగారం కంటే తక్కువగా ఉండాలి. దీనిని ఒక ఉదాహరణతో అర్థం చేసుకోవచ్చు. మీ మొత్తం పెట్టుబడుల విలువ రూ.10 లక్షలు ఉందనుకుందాం. అందులో రూ.2.5 లక్షలు వెండిలో పెట్టారు. ఇప్పుడు వెండి ధర మరో 10 శాతం తగ్గితే, మీ వెండి పెట్టుబడి విలువ రూ.25,000 తగ్గుతుంది. మిగతా పెట్టుబడుల విలువలో ఎలాంటి మార్పు లేదని అనుకుంటే, మీ మొత్తం పోర్ట్‌ఫోలియో విలువ కూడా రూ.25,000 తగ్గుతుంది. అంటే, ఒకే ఆస్తిలో ఎక్కువ మొత్తాన్ని పెట్టుబడి పెట్టడం వల్ల దాని ధర తగ్గినప్పుడు మొత్తం పెట్టుబడులపై ప్రభావం పడుతుంది. (ప్రతీకాత్మక చిత్రం)

