ప్రభన్యూస్

RRB Recruitment 2026: నిరుద్యోగులకు గుడ్ న్యూస్.. 1,265 పోస్టులకు నోటిఫికేషన్ విడుదల.. ఏ డిగ్రీ ఉన్నా జాబ్‌కు అప్లై చేసుకోవచ్చు! |


Last Updated:

రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డు (RRB) 1,265 స్టేషన్ మాస్టర్ పోస్టుల భర్తీకి దరఖాస్తు ప్రక్రియ ప్రారంభించింది. జీకే విభాగం తొలగింపు, సింగిల్ సీబీటీ పరీక్ష, కనీస వయస్సు 20 ఏళ్లకు పెంపు వంటి కీలక మార్పులు చోటుచేసుకున్నాయి.

News18
News18

రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డు (RRB) స్టేషన్ మాస్టర్ ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న నిరుద్యోగ యువతకు అదిరిపోయే శుభవార్త అందించింది. దేశవ్యాప్తంగా వివిధ రైల్వే జోన్ల పరిధిలో మొత్తం 1,265 స్టేషన్ మాస్టర్ పోస్టుల భర్తీకి సంబంధించి అధికారిక దరఖాస్తు ప్రక్రియ అక్టోబర్ 27న ప్రారంభమైంది. ఏదైనా గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయం నుంచి డిగ్రీ పూర్తి చేసిన అభ్యర్థులు నవంబర్ 25 అర్ధరాత్రి వరకు ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తులు సమర్పించడానికి రైల్వే బోర్డు గడువు ఇచ్చింది. గతంలో 1,250 ఖాళీలు ఉంటాయని ప్రకటించినప్పటికీ, తాజాగా మరో 15 పోస్టులు పెంచి మొత్తం సంఖ్యను 1,265కు చేర్చారు. ఈసారి స్టేషన్ మాస్టర్ నియామకాలను ఎన్‌టీపీసీ నుంచి వేరుచేసి స్వతంత్ర నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేస్తుండటం గమనార్హం.

జోన్ల వారీగా ఖాళీలు.. వయోపరిమితిలో మార్పులు

ఈ రిక్రూట్‌మెంట్‌లో భాగంగా అత్యధికంగా ముంబై బోర్డుకు 125 పోస్టులు కేటాయించారు. ఆ తర్వాత శ్రీనగర్‌లో 122, చెన్నైలో 119, తిరువనంతపురంలో 114 ఖాళీలు ఉన్నాయి. ప్రయాగ్‌రాజ్ పరిధిలో నార్త్ సెంట్రల్ రైల్వే కింద 104, నార్తర్న్ రైల్వే పరిధిలో 8 కలిపి మొత్తం 112 పోస్టులు ఉన్నాయి. బెంగళూరు బోర్డుకు 102 పోస్టులు దక్కాయి. ఇక వయోపరిమితి విషయానికి వస్తే రైల్వే శాఖ కీలక మార్పులు చేసింది. కనీస వయస్సును 18 ఏళ్ల నుంచి 20 ఏళ్లకు పెంచగా, గరిష్ట వయస్సును 30 ఏళ్లుగా నిర్ణయించింది. నిబంధనల ప్రకారం ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ వర్గాలకు ప్రభుత్వ వయోపరిమితి సడలింపులు వర్తిస్తాయి.

సిలబస్ నుంచి జీకే తొలగింపు.. కొత్త పరీక్ష విధానం

రాతపరీక్ష విధానంలో బోర్డు విప్లవాత్మక మార్పులు తీసుకొచ్చింది. గతంలో ఉన్న రెండు దశల పరీక్షల విధానాన్ని రద్దు చేసి, కేవలం ఒకే దశ కంప్యూటర్ ఆధారిత పరీక్ష (CBT) నిర్వహించాలని నిర్ణయించింది. 100 మార్కులకు గాను 2 గంటల వ్యవధిలో ఈ పరీక్ష జరగనుంది. అత్యంత కీలకమైన అంశం ఏమిటంటే.. ఇందులో జనరల్ నాలెడ్జ్ (GK), జనరల్ స్టడీస్ (GS) విభాగాలను పూర్తిగా తొలగించారు.

మ్యాథమెటిక్స్ & బేసిక్ సైన్స్: 30 మార్కులు

డేటా అనాలసిస్ & ఇంటర్‌ప్రిటేషన్ (DI): 30 మార్కులు

లాజికల్ రీజనింగ్: 20 మార్కులు

మెంటల్ రీజనింగ్: 20 మార్కులు ఈ రాతపరీక్షలో అర్హత సాధించిన అభ్యర్థులకు తదుపరి దశలో కంప్యూటర్ బేస్డ్ ఆప్టిట్యూడ్ టెస్ట్ (CBAT) నిర్వహిస్తారు.

ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకునే విధానం

అభ్యర్థులు అధికారిక rrbapply.gov.in పోర్టల్ ద్వారా మాత్రమే ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. ముందుగా పోర్టల్‌లో అకౌంట్ క్రియేట్ చేసుకుని రిజిస్ట్రేషన్ పూర్తి చేయాలి. ఆ తర్వాత లాగిన్ అయి వ్యక్తిగత, విద్యార్హత వివరాలు నమోదు చేయాలి. ఫోటో, సంతకం వంటి అవసరమైన పత్రాలను నిర్దేశిత సైజులో అప్‌లోడ్ చేసి, కేటగిరీ ఆధారంగా నిర్దేశించిన పరీక్ష ఫీజును నెట్ బ్యాంకింగ్, యూపీఐ లేదా కార్డుల ద్వారా చెల్లించాలి. దరఖాస్తు పూర్తయిన తర్వాత భవిష్యత్తు అవసరాల కోసం అప్లికేషన్ ఫారమ్‌ను డౌన్‌లోడ్ చేసుకుని భద్రపరుచుకోవాలి. చివరి తేదీ నవంబర్ 25 వరకు వేచి చూడకుండా ముందే దరఖాస్తు చేసుకోవాలని రైల్వే బోర్డు సూచించింది.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

×
prabhanews.co.in
Logo
Date of Publish : 28 October 2026, 8:48 pm Digital Edition : Prabhanews
RRB Recruitment 2026: నిరుద్యోగులకు గుడ్ న్యూస్.. 1,265 పోస్టులకు నోటిఫికేషన్ విడుదల.. ఏ డిగ్రీ ఉన్నా జాబ్‌కు అప్లై చేసుకోవచ్చు! |

Last Updated:Oct 28, 2026 8:46 PM ISTరైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డు (RRB) 1,265 స్టేషన్ మాస్టర్ పోస్టుల భర్తీకి దరఖాస్తు ప్రక్రియ ప్రారంభించింది. జీకే విభాగం తొలగింపు, సింగిల్ సీబీటీ పరీక్ష, కనీస వయస్సు 20 ఏళ్లకు పెంపు వంటి కీలక మార్పులు చోటుచేసుకున్నాయి.News18రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డు (RRB) స్టేషన్ మాస్టర్ ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న నిరుద్యోగ యువతకు అదిరిపోయే శుభవార్త అందించింది. దేశవ్యాప్తంగా వివిధ రైల్వే జోన్ల పరిధిలో మొత్తం 1,265 స్టేషన్ మాస్టర్ పోస్టుల భర్తీకి సంబంధించి అధికారిక దరఖాస్తు ప్రక్రియ అక్టోబర్ 27న ప్రారంభమైంది. ఏదైనా గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయం నుంచి డిగ్రీ పూర్తి చేసిన అభ్యర్థులు నవంబర్ 25 అర్ధరాత్రి వరకు ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తులు సమర్పించడానికి రైల్వే బోర్డు గడువు ఇచ్చింది. గతంలో 1,250 ఖాళీలు ఉంటాయని ప్రకటించినప్పటికీ, తాజాగా మరో 15 పోస్టులు పెంచి మొత్తం సంఖ్యను 1,265కు చేర్చారు. ఈసారి స్టేషన్ మాస్టర్ నియామకాలను ఎన్‌టీపీసీ నుంచి వేరుచేసి స్వతంత్ర నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేస్తుండటం గమనార్హం.జోన్ల వారీగా ఖాళీలు.. వయోపరిమితిలో మార్పులుఈ రిక్రూట్‌మెంట్‌లో భాగంగా అత్యధికంగా ముంబై బోర్డుకు 125 పోస్టులు కేటాయించారు. ఆ తర్వాత శ్రీనగర్‌లో 122, చెన్నైలో 119, తిరువనంతపురంలో 114 ఖాళీలు ఉన్నాయి. ప్రయాగ్‌రాజ్ పరిధిలో నార్త్ సెంట్రల్ రైల్వే కింద 104, నార్తర్న్ రైల్వే పరిధిలో 8 కలిపి మొత్తం 112 పోస్టులు ఉన్నాయి. బెంగళూరు బోర్డుకు 102 పోస్టులు దక్కాయి. ఇక వయోపరిమితి విషయానికి వస్తే రైల్వే శాఖ కీలక మార్పులు చేసింది. కనీస వయస్సును 18 ఏళ్ల నుంచి 20 ఏళ్లకు పెంచగా, గరిష్ట వయస్సును 30 ఏళ్లుగా నిర్ణయించింది. నిబంధనల ప్రకారం ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ వర్గాలకు ప్రభుత్వ వయోపరిమితి సడలింపులు వర్తిస్తాయి.సిలబస్ నుంచి జీకే తొలగింపు.. కొత్త పరీక్ష విధానంరాతపరీక్ష విధానంలో బోర్డు విప్లవాత్మక మార్పులు తీసుకొచ్చింది. గతంలో ఉన్న రెండు దశల పరీక్షల విధానాన్ని రద్దు చేసి, కేవలం ఒకే దశ కంప్యూటర్ ఆధారిత పరీక్ష (CBT) నిర్వహించాలని నిర్ణయించింది. 100 మార్కులకు గాను 2 గంటల వ్యవధిలో ఈ పరీక్ష జరగనుంది. అత్యంత కీలకమైన అంశం ఏమిటంటే.. ఇందులో జనరల్ నాలెడ్జ్ (GK), జనరల్ స్టడీస్ (GS) విభాగాలను పూర్తిగా తొలగించారు.మ్యాథమెటిక్స్ & బేసిక్ సైన్స్: 30 మార్కులుడేటా అనాలసిస్ & ఇంటర్‌ప్రిటేషన్ (DI): 30 మార్కులులాజికల్ రీజనింగ్: 20 మార్కులుమెంటల్ రీజనింగ్: 20 మార్కులు ఈ రాతపరీక్షలో అర్హత సాధించిన అభ్యర్థులకు తదుపరి దశలో కంప్యూటర్ బేస్డ్ ఆప్టిట్యూడ్ టెస్ట్ (CBAT) నిర్వహిస్తారు.ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకునే విధానంఅభ్యర్థులు అధికారిక rrbapply.gov.in పోర్టల్ ద్వారా మాత్రమే ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. ముందుగా పోర్టల్‌లో అకౌంట్ క్రియేట్ చేసుకుని రిజిస్ట్రేషన్ పూర్తి చేయాలి. ఆ తర్వాత లాగిన్ అయి వ్యక్తిగత, విద్యార్హత వివరాలు నమోదు చేయాలి. ఫోటో, సంతకం వంటి అవసరమైన పత్రాలను నిర్దేశిత సైజులో అప్‌లోడ్ చేసి, కేటగిరీ ఆధారంగా నిర్దేశించిన పరీక్ష ఫీజును నెట్ బ్యాంకింగ్, యూపీఐ లేదా కార్డుల ద్వారా చెల్లించాలి. దరఖాస్తు పూర్తయిన తర్వాత భవిష్యత్తు అవసరాల కోసం అప్లికేషన్ ఫారమ్‌ను డౌన్‌లోడ్ చేసుకుని భద్రపరుచుకోవాలి. చివరి తేదీ నవంబర్ 25 వరకు వేచి చూడకుండా ముందే దరఖాస్తు చేసుకోవాలని రైల్వే బోర్డు సూచించింది.మరింత చదవండి

Source link