ప్రభన్యూస్

Akkineni Akhil: భార్య జైనబ్‌‌పై అక్కినేని అఖిల్ మనసులో మాట.. అయ్యగారు మామూలోడు కాదబ్బా | తెలుగు సినిమా వార్తలు


Last Updated:

అక్కినేని అఖిల్ లేటెస్ట్ మూవీ ‘లెనిన్‌’ (Lenin Movie) మూవీ సక్సెస్ మీట్ ఘనంగా జరిగింది. ఈ వేదికపై అఖిల్ చేసిన కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.

News18
News18

అక్కినేని హీరో అఖిల్ (Akhil Akkineni) ప్రధాన పాత్రలో నటించిన తాజా యాక్షన్ ఎంటర్‌టైనర్ ‘లెనిన్‌’ (Lenin Movie) ఇటీవల ప్రేక్షకుల ముందుకు వచ్చి బాక్సాఫీస్ వద్ద ఘన విజయాన్ని సొంతం చేసుకుంది. తన కెరీర్ లో సరైన హిట్ కోసం ఎంతో కాలంగా ఎదురుచూస్తున్న అఖిల్‌కు ఈ చిత్రం భారీ బ్రేక్ ఇచ్చింది. ఈ సినిమా సూపర్ హిట్ సాధించిన ఆనందంలో చిత్ర యూనిట్ గుంటూరులో అభిమానుల సమక్షంలో ‘సక్సెస్ మీట్’ను గ్రాండ్‌గా నిర్వహించింది. ఈ వేదికపై అఖిల్ ఎంతో భావోద్వేగానికి గురయ్యారు. తన కెరీర్, కుటుంబం, ముఖ్యంగా భార్య జైనబ్ (Zainab), తండ్రి నాగార్జున (Nagarjuna) తనకు అందించిన అండదండలను గుర్తుచేసుకుంటూ ఎమోషనల్ కామెంట్స్ చేశారు.

గత కొన్నేళ్లుగా తాను పడిన మానసిక సంఘర్షణ గురించి చెబుతూ అఖిల్ ఎమోషనల్ అయ్యారు. “గత మూడేళ్లుగా నా కెరీర్‌లో ఎన్నో ఒడిదుడుకులు, అపజయాలు ఎదుర్కొన్నాను. నేను తీవ్రమైన బాధలో ఉన్న ఆ సమయంలో నా భార్య జైనబ్ నా వెన్నంటే నిలబడింది. నేను ఆమెను ఇంట్లో ‘బంగారు తల్లి’ అని ముద్దుగా పిలుచుకుంటాను. నేను మానసికంగా కృంగిపోయిన ప్రతిసారీ నాకు ఒక గైడ్‌లా దిశానిర్దేశం చేస్తూ, ఎంతో ధైర్యాన్నిచ్చింది,” అని అఖిల్ తన సతీమణికి కృతజ్ఞతలు తెలిపారు.

ఈ సందర్భంగా తన తండ్రి అక్కినేని నాగార్జున గురించి మాట్లాడుతూ వేదికపై కన్నీటి పర్యంతమయ్యారు అఖిల్. ‘లెనిన్‌’ సినిమా విడుదలయ్యాక జరిగిన ఒక ఈవెంట్‌లో నాన్నను గట్టిగా హగ్ చేసుకున్నాను. ఆ క్షణంలో గత పదేళ్లుగా నా మనసులో అణుచుకున్న ఎమోషన్స్ అన్నీ ఒక్కసారిగా కన్నీళ్ల రూపంలో బయటకు వచ్చాయి. ఇన్నేళ్ల నా ప్రయాణంలో హిట్లు, ఫ్లాప్‌లు వచ్చినా నాన్న నన్ను ఒక్కసారి కూడా తిట్టలేదు, ఏనాడూ నిరుత్సాహపరచలేదు. నాకు ఆయన ఒక తండ్రిగానే కాకుండా మంచి స్నేహితుడిలా తోడుగా నిలిచారు.

అక్కినేని అభిమానులకు ఒక మంచి సినిమా అందించాలనే కసితో ‘లెనిన్‌’ బాధ్యతను నాన్న తన భుజాలపై వేసుకుని నడిపించారు. నాకెప్పుడూ ఆయనే సర్వస్వం అన్నారు అఖిల్.

అభిమానుల రుణం తీర్చుకుంటా..

హిట్, ఫ్లాప్ లతో సంబంధం లేకుండా నిరంతరం తనకు అండగా నిలబడుతున్న అక్కినేని అభిమానులను ఉద్దేశించి అఖిల్ కీలక వ్యాఖ్యలు చేశారు. “ఎన్నో జన్మల పుణ్యం చేసుకుంటే తప్ప ఇలాంటి నిస్వార్థమైన అభిమానులు దొరకరు. ఫ్యాన్స్ కోసమైనా నేను కచ్చితంగా హిట్ కొట్టాలని జైనబ్ తో ఎప్పుడూ చెబుతుండేవాడిని. నన్ను నమ్మిన ప్రేక్షక దేవుళ్లకు ఒకటే మాటిస్తున్నాను. ఈ విజయంతో నేను కాలర్ ఎగరేయను, సక్సెస్ సాధించానని గర్వపడను. నా కొత్త ప్రయాణం ఇప్పుడే మొదలైంది. ఇకపై నేను చేయాల్సిన యుద్ధాన్ని అత్యంత ప్రశాంతంగా, పకడ్బందీగా చేస్తాను” అని అఖిల్ స్పష్టం చేశారు.

Click here to add News18 as your preferred news source on Google.

సినిమా న్యూస్, మూవీ అప్‌డేట్స్, సినిమా రివ్యూస్, OTT అప్‌డేట్స్, టీవీ షోస్‌, రియాల్టీ షోస్‌, వెబ్‌స్టోరీస్ ఈ కేటగిరీలో చూడొచ్చు. న్యూస్ 18 తెలుగులో లేటెస్ట్ ఎంటర్‌టైన్‌మెంట్ అప్‌డేట్స్ చదవండి. మరిన్ని వార్తల కోసం న్యూస్ 18 తెలుగు ఫాలో అవండి.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

×
prabhanews.co.in
Logo
Date of Publish : 16 July 2026, 3:04 pm Digital Edition : Prabhanews
Akkineni Akhil: భార్య జైనబ్‌‌పై అక్కినేని అఖిల్ మనసులో మాట.. అయ్యగారు మామూలోడు కాదబ్బా | తెలుగు సినిమా వార్తలు

Last Updated:Jul 16, 2026 2:44 PM ISTఅక్కినేని అఖిల్ లేటెస్ట్ మూవీ ‘లెనిన్‌’ (Lenin Movie) మూవీ సక్సెస్ మీట్ ఘనంగా జరిగింది. ఈ వేదికపై అఖిల్ చేసిన కామెంట్స్ వైరల్ అవుతున్నాయి. News18అక్కినేని హీరో అఖిల్ (Akhil Akkineni) ప్రధాన పాత్రలో నటించిన తాజా యాక్షన్ ఎంటర్‌టైనర్ ‘లెనిన్‌’ (Lenin Movie) ఇటీవల ప్రేక్షకుల ముందుకు వచ్చి బాక్సాఫీస్ వద్ద ఘన విజయాన్ని సొంతం చేసుకుంది. తన కెరీర్ లో సరైన హిట్ కోసం ఎంతో కాలంగా ఎదురుచూస్తున్న అఖిల్‌కు ఈ చిత్రం భారీ బ్రేక్ ఇచ్చింది. ఈ సినిమా సూపర్ హిట్ సాధించిన ఆనందంలో చిత్ర యూనిట్ గుంటూరులో అభిమానుల సమక్షంలో 'సక్సెస్ మీట్'ను గ్రాండ్‌గా నిర్వహించింది. ఈ వేదికపై అఖిల్ ఎంతో భావోద్వేగానికి గురయ్యారు. తన కెరీర్, కుటుంబం, ముఖ్యంగా భార్య జైనబ్ (Zainab), తండ్రి నాగార్జున (Nagarjuna) తనకు అందించిన అండదండలను గుర్తుచేసుకుంటూ ఎమోషనల్ కామెంట్స్ చేశారు.గత కొన్నేళ్లుగా తాను పడిన మానసిక సంఘర్షణ గురించి చెబుతూ అఖిల్ ఎమోషనల్ అయ్యారు. "గత మూడేళ్లుగా నా కెరీర్‌లో ఎన్నో ఒడిదుడుకులు, అపజయాలు ఎదుర్కొన్నాను. నేను తీవ్రమైన బాధలో ఉన్న ఆ సమయంలో నా భార్య జైనబ్ నా వెన్నంటే నిలబడింది. నేను ఆమెను ఇంట్లో 'బంగారు తల్లి' అని ముద్దుగా పిలుచుకుంటాను. నేను మానసికంగా కృంగిపోయిన ప్రతిసారీ నాకు ఒక గైడ్‌లా దిశానిర్దేశం చేస్తూ, ఎంతో ధైర్యాన్నిచ్చింది," అని అఖిల్ తన సతీమణికి కృతజ్ఞతలు తెలిపారు.ఈ సందర్భంగా తన తండ్రి అక్కినేని నాగార్జున గురించి మాట్లాడుతూ వేదికపై కన్నీటి పర్యంతమయ్యారు అఖిల్. ‘లెనిన్‌’ సినిమా విడుదలయ్యాక జరిగిన ఒక ఈవెంట్‌లో నాన్నను గట్టిగా హగ్ చేసుకున్నాను. ఆ క్షణంలో గత పదేళ్లుగా నా మనసులో అణుచుకున్న ఎమోషన్స్ అన్నీ ఒక్కసారిగా కన్నీళ్ల రూపంలో బయటకు వచ్చాయి. ఇన్నేళ్ల నా ప్రయాణంలో హిట్లు, ఫ్లాప్‌లు వచ్చినా నాన్న నన్ను ఒక్కసారి కూడా తిట్టలేదు, ఏనాడూ నిరుత్సాహపరచలేదు. నాకు ఆయన ఒక తండ్రిగానే కాకుండా మంచి స్నేహితుడిలా తోడుగా నిలిచారు.అక్కినేని అభిమానులకు ఒక మంచి సినిమా అందించాలనే కసితో ‘లెనిన్‌’ బాధ్యతను నాన్న తన భుజాలపై వేసుకుని నడిపించారు. నాకెప్పుడూ ఆయనే సర్వస్వం అన్నారు అఖిల్.అభిమానుల రుణం తీర్చుకుంటా..హిట్, ఫ్లాప్ లతో సంబంధం లేకుండా నిరంతరం తనకు అండగా నిలబడుతున్న అక్కినేని అభిమానులను ఉద్దేశించి అఖిల్ కీలక వ్యాఖ్యలు చేశారు. "ఎన్నో జన్మల పుణ్యం చేసుకుంటే తప్ప ఇలాంటి నిస్వార్థమైన అభిమానులు దొరకరు. ఫ్యాన్స్ కోసమైనా నేను కచ్చితంగా హిట్ కొట్టాలని జైనబ్ తో ఎప్పుడూ చెబుతుండేవాడిని. నన్ను నమ్మిన ప్రేక్షక దేవుళ్లకు ఒకటే మాటిస్తున్నాను. ఈ విజయంతో నేను కాలర్ ఎగరేయను, సక్సెస్ సాధించానని గర్వపడను. నా కొత్త ప్రయాణం ఇప్పుడే మొదలైంది. ఇకపై నేను చేయాల్సిన యుద్ధాన్ని అత్యంత ప్రశాంతంగా, పకడ్బందీగా చేస్తాను" అని అఖిల్ స్పష్టం చేశారు.Click here to add News18 as your preferred news source on Google. సినిమా న్యూస్, మూవీ అప్‌డేట్స్, సినిమా రివ్యూస్, OTT అప్‌డేట్స్, టీవీ షోస్‌, రియాల్టీ షోస్‌, వెబ్‌స్టోరీస్ ఈ కేటగిరీలో చూడొచ్చు. న్యూస్ 18 తెలుగులో లేటెస్ట్ ఎంటర్‌టైన్‌మెంట్ అప్‌డేట్స్ చదవండి. మరిన్ని వార్తల కోసం న్యూస్ 18 తెలుగు ఫాలో అవండి.Location :Hyderabad,Hyderabad,Telanganaమరింత చదవండి

Source link