ప్రభన్యూస్

Puri Curry Recipe: పూరీ కర్రీ ఇలా చేస్తే రుచి అదిరిపోతుంది.. హోటల్ స్టైల్ సీక్రెట్ టిప్స్ ఇవే! | లైఫ్ స్టైల్


Last Updated:

పూరీలతో పాటు రుచికరమైన ఆలూ కర్రీ ఉంటే ఆ రుచే వేరు. ముఖ్యంగా హోటళ్లలో లభించే విధంగా ఇంట్లోనే పూరీ కర్రీ తయారు చేసుకోవాలని చాలామంది అనుకుంటారు. కానీ కొన్నిసార్లు కూర రుచిగా రాకపోవడం, మరికొన్నిసార్లు సరైన చిక్కదనం లేకపోవడం జరుగుతుంది.

News18
News18

పూరీలు అంటే ఇష్టపడని వారు చాలా అరుదుగా ఉంటారు. ఉదయం అల్పాహారంలోనైనా, ప్రత్యేక సందర్భాల్లోనైనా వేడివేడి పూరీలను ఇష్టంగా తింటుంటారు. అయితే పూరీలతో పాటు రుచికరమైన ఆలూ కర్రీ ఉంటే ఆ రుచే వేరు. ముఖ్యంగా హోటళ్లలో లభించే విధంగా ఇంట్లోనే పూరీ కర్రీ తయారు చేసుకోవాలని చాలామంది అనుకుంటారు. కానీ కొన్నిసార్లు కూర రుచిగా రాకపోవడం, మరికొన్నిసార్లు సరైన చిక్కదనం లేకపోవడం జరుగుతుంది. అలాంటి సమస్యలు రాకుండా కొన్ని సులభమైన చిట్కాలు పాటిస్తే ఇంట్లోనే రుచికరమైన పూరీ కర్రీ తయారు చేసుకోవచ్చు.

కావలసిన పదార్థాలు

ఈ కూర తయారు చేయడానికి రెండు చిన్న బంగాళదుంపలు, ఒక ఉల్లిపాయ, రెండు పచ్చిమిర్చి, మూడు ఎండుమిర్చి, రెండు టీ స్పూన్ల నూనె, అర టీ స్పూన్ శనగపప్పు, అర టీ స్పూన్ ఆవాలు, పావు టీ స్పూన్ జీలకర్ర, కొద్దిగా కరివేపాకు, పావు టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, పావు టీ స్పూన్ పసుపు, మూడు టీ స్పూన్ల శనగపిండి, తగినంత ఉప్పు, సన్నగా తరిగిన కొత్తిమీర అవసరమవుతాయి. కూర తయారు చేయడానికి సరిపడా నీటిని కూడా సిద్ధంగా ఉంచుకోవాలి.

పూరీ కర్రీ తయారీ విధానం

ముందుగా స్టవ్ మీద ఒక పాన్ పెట్టి రెండు టీ స్పూన్ల నూనె వేయాలి. నూనె వేడయ్యాక శనగపప్పు, ఆవాలు, జీలకర్ర వేసి చిటపటలాడే వరకు వేయించాలి. ఆ తర్వాత ఎండుమిర్చి వేసి కొద్దిసేపు వేయించాలి. ఇప్పుడు పొడవుగా సన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కలు, చీలికలుగా కట్ చేసిన పచ్చిమిర్చి, కరివేపాకు వేసి బాగా కలపాలి. ఉల్లిపాయలను గోధుమ రంగులోకి వచ్చే వరకు వేయించాల్సిన అవసరం లేదు. వాటి పచ్చివాసన పోయే వరకు వేయిస్తే సరిపోతుంది.

తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి పచ్చివాసన పోయే వరకు వేయించాలి. అనంతరం పసుపు వేసి బాగా కలిపి, ఒక టీ గ్లాసు నీళ్లు పోసి మరిగించాలి. ఈలోగా ఒక చిన్న గిన్నెలో మూడు టీ స్పూన్ల శనగపిండి తీసుకుని, కొద్దికొద్దిగా నీళ్లు కలుపుతూ ఉండలు లేకుండా మిశ్రమాన్ని సిద్ధం చేసుకోవాలి.

నీళ్లు మరిగిన తర్వాత ముందుగా ఉడికించి మెదిపి పెట్టుకున్న బంగాళదుంపలను పాన్‌లో వేయాలి. బంగాళదుంపలను పూర్తిగా మెదపకుండా కొద్దిగా ముక్కలు ఉండేలా కలిపినా కూర రుచిగా ఉంటుంది. ఇప్పుడు శనగపిండి మిశ్రమాన్ని నెమ్మదిగా పోస్తూ మరో చేత్తో కలపాలి. ఇలా చేయడం వల్ల ఉండలు ఏర్పడకుండా ఉంటాయి. కూర మరీ చిక్కగా అనిపిస్తే కొద్దిగా వేడి నీళ్లు కలుపుకోవచ్చు.

చివరగా రుచికి సరిపడా ఉప్పు, సన్నగా తరిగిన కొత్తిమీర వేసి బాగా కలపాలి. మూడు నుంచి నాలుగు నిమిషాల పాటు చిన్న మంటపై ఉడికించాలి. శనగపిండి పచ్చివాసన పోయి, కూరకు మంచి చిక్కదనం వచ్చిన తర్వాత స్టవ్ ఆపేయాలి. అంతే.. వేడివేడి పూరీల్లోకి రుచికరమైన ఆలూ కర్రీ సిద్ధమైనట్లే. ఈ చిన్న చిట్కాలు పాటిస్తే ఇంట్లోనే హోటల్ రుచిని ఆస్వాదించవచ్చు.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

×
prabhanews.co.in
Logo
Date of Publish : 23 October 2026, 11:00 am Digital Edition : Prabhanews
Puri Curry Recipe: పూరీ కర్రీ ఇలా చేస్తే రుచి అదిరిపోతుంది.. హోటల్ స్టైల్ సీక్రెట్ టిప్స్ ఇవే! | లైఫ్ స్టైల్

Last Updated:Oct 23, 2026 10:51 AM ISTపూరీలతో పాటు రుచికరమైన ఆలూ కర్రీ ఉంటే ఆ రుచే వేరు. ముఖ్యంగా హోటళ్లలో లభించే విధంగా ఇంట్లోనే పూరీ కర్రీ తయారు చేసుకోవాలని చాలామంది అనుకుంటారు. కానీ కొన్నిసార్లు కూర రుచిగా రాకపోవడం, మరికొన్నిసార్లు సరైన చిక్కదనం లేకపోవడం జరుగుతుంది.News18పూరీలు అంటే ఇష్టపడని వారు చాలా అరుదుగా ఉంటారు. ఉదయం అల్పాహారంలోనైనా, ప్రత్యేక సందర్భాల్లోనైనా వేడివేడి పూరీలను ఇష్టంగా తింటుంటారు. అయితే పూరీలతో పాటు రుచికరమైన ఆలూ కర్రీ ఉంటే ఆ రుచే వేరు. ముఖ్యంగా హోటళ్లలో లభించే విధంగా ఇంట్లోనే పూరీ కర్రీ తయారు చేసుకోవాలని చాలామంది అనుకుంటారు. కానీ కొన్నిసార్లు కూర రుచిగా రాకపోవడం, మరికొన్నిసార్లు సరైన చిక్కదనం లేకపోవడం జరుగుతుంది. అలాంటి సమస్యలు రాకుండా కొన్ని సులభమైన చిట్కాలు పాటిస్తే ఇంట్లోనే రుచికరమైన పూరీ కర్రీ తయారు చేసుకోవచ్చు.కావలసిన పదార్థాలు ఈ కూర తయారు చేయడానికి రెండు చిన్న బంగాళదుంపలు, ఒక ఉల్లిపాయ, రెండు పచ్చిమిర్చి, మూడు ఎండుమిర్చి, రెండు టీ స్పూన్ల నూనె, అర టీ స్పూన్ శనగపప్పు, అర టీ స్పూన్ ఆవాలు, పావు టీ స్పూన్ జీలకర్ర, కొద్దిగా కరివేపాకు, పావు టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, పావు టీ స్పూన్ పసుపు, మూడు టీ స్పూన్ల శనగపిండి, తగినంత ఉప్పు, సన్నగా తరిగిన కొత్తిమీర అవసరమవుతాయి. కూర తయారు చేయడానికి సరిపడా నీటిని కూడా సిద్ధంగా ఉంచుకోవాలి.పూరీ కర్రీ తయారీ విధానం ముందుగా స్టవ్ మీద ఒక పాన్ పెట్టి రెండు టీ స్పూన్ల నూనె వేయాలి. నూనె వేడయ్యాక శనగపప్పు, ఆవాలు, జీలకర్ర వేసి చిటపటలాడే వరకు వేయించాలి. ఆ తర్వాత ఎండుమిర్చి వేసి కొద్దిసేపు వేయించాలి. ఇప్పుడు పొడవుగా సన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కలు, చీలికలుగా కట్ చేసిన పచ్చిమిర్చి, కరివేపాకు వేసి బాగా కలపాలి. ఉల్లిపాయలను గోధుమ రంగులోకి వచ్చే వరకు వేయించాల్సిన అవసరం లేదు. వాటి పచ్చివాసన పోయే వరకు వేయిస్తే సరిపోతుంది.తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి పచ్చివాసన పోయే వరకు వేయించాలి. అనంతరం పసుపు వేసి బాగా కలిపి, ఒక టీ గ్లాసు నీళ్లు పోసి మరిగించాలి. ఈలోగా ఒక చిన్న గిన్నెలో మూడు టీ స్పూన్ల శనగపిండి తీసుకుని, కొద్దికొద్దిగా నీళ్లు కలుపుతూ ఉండలు లేకుండా మిశ్రమాన్ని సిద్ధం చేసుకోవాలి.నీళ్లు మరిగిన తర్వాత ముందుగా ఉడికించి మెదిపి పెట్టుకున్న బంగాళదుంపలను పాన్‌లో వేయాలి. బంగాళదుంపలను పూర్తిగా మెదపకుండా కొద్దిగా ముక్కలు ఉండేలా కలిపినా కూర రుచిగా ఉంటుంది. ఇప్పుడు శనగపిండి మిశ్రమాన్ని నెమ్మదిగా పోస్తూ మరో చేత్తో కలపాలి. ఇలా చేయడం వల్ల ఉండలు ఏర్పడకుండా ఉంటాయి. కూర మరీ చిక్కగా అనిపిస్తే కొద్దిగా వేడి నీళ్లు కలుపుకోవచ్చు.చివరగా రుచికి సరిపడా ఉప్పు, సన్నగా తరిగిన కొత్తిమీర వేసి బాగా కలపాలి. మూడు నుంచి నాలుగు నిమిషాల పాటు చిన్న మంటపై ఉడికించాలి. శనగపిండి పచ్చివాసన పోయి, కూరకు మంచి చిక్కదనం వచ్చిన తర్వాత స్టవ్ ఆపేయాలి. అంతే.. వేడివేడి పూరీల్లోకి రుచికరమైన ఆలూ కర్రీ సిద్ధమైనట్లే. ఈ చిన్న చిట్కాలు పాటిస్తే ఇంట్లోనే హోటల్ రుచిని ఆస్వాదించవచ్చు.మరింత చదవండి

Source link