ప్రభన్యూస్

Prabhas Fauzi: ప్రభాస్ అభిమానులకు గుడ్‌ న్యూస్.. పుట్టినరోజు కానుక రెడీ | తెలుగు సినిమా వార్తలు


Last Updated:

రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా హను రాఘవపూడి దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమా ‘ఫౌజీ’. ఈ సినిమా నుంచి ప్రభాస్ పుట్టినరోజు కానుక రెడీ అయింది.

News18
News18

పాన్ ఇండియా సూపర్ స్టార్ ప్రభాస్, డైరెక్టర్ హను రాఘవపూడి కాంబినేషన్లో తెరకెక్కుతున్న ప్రతిష్టాత్మక చిత్రం ‘ఫౌజీ’. మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్‌పై నవీన్ ఎర్నేని, వై. రవిశంకర్ అత్యంత భారీ బడ్జెట్‌తో నిర్మిస్తున్న ఈ పీరియాడికల్ వార్ లవ్ డ్రామా కోసం దేశవ్యాప్తంగా సినీ అభిమానులు వేయికళ్లతో ఎదురుచూస్తున్నారు. దసరా పండుగకు ఈ సినిమా నుంచి ఏదైనా స్పెషల్ అప్‌డేట్ వస్తుందని ఆశించిన డార్లింగ్ ఫ్యాన్స్‌కు మేకర్స్ నుంచి ఎలాంటి ప్రకటన రాకపోవడంతో కాస్త నిరాశ చెందారు. అయితే, అభిమానుల నిరాశను పోగొడుతూ నిర్మాత వై. రవిశంకర్ అదిరిపోయే గుడ్ న్యూస్ అందించారు. అక్టోబర్ 23న ప్రభాస్ పుట్టినరోజు సందర్భంగా ‘ఫౌజీ’ సినిమా నుంచి ఒక స్పెషల్ గ్లింప్స్ వీడియోను విడుదల చేయబోతున్నట్లు ఆయన అధికారికంగా ప్రకటించారు.

ఈ స్పెషల్ గ్లింప్స్ ద్వారా సినిమాలో ప్రభాస్ క్యారెక్టరైజేషన్ ఏమిటి, అసలు ఈ సినిమా నేపథ్యం ఎలా ఉండబోతోంది అనే విషయాలపై ప్రేక్షకులకు ఒక స్పష్టమైన విజన్ రానుందని రవిశంకర్ తెలిపారు. “అక్టోబర్ 23న ప్రభాస్ బర్త్ డే స్పెషల్‌గా ఒక చిన్న వీడియోను రిలీజ్ చేస్తున్నాం. ఇందులో హీరో పాత్ర ఎలా ఉండబోతోంది? అతను ఏం చేస్తాడు? సినిమా కథాంశం ఏంటి? అనే విషయాలపై ఒక హింట్ ఇస్తాం. అయితే, ఇది కేవలం క్యారెక్టర్ ఇంట్రడక్షన్ మాత్రమే కాబట్టి ‘బాహుబలి’ రేంజ్ భారీ యాక్షన్ ఎలిమెంట్స్ ఆశించవద్దు. సినిమా మూడ్ ఎలా ఉండబోతోందో ఈ వీడియోలో చూపిస్తాం” అని ఆయన స్పష్టం చేశారు. అంతేకాకుండా, థియేటర్లలో ప్రదర్శితమయ్యే ‘418’ సినిమాతో పాటు ఈ ఫౌజీ గ్లింప్స్‌ను కూడా స్క్రీనింగ్ చేయనున్నట్లు తెలిపారు. బిగ్ స్క్రీన్ మీద ఆ విజువల్స్ చూస్తే ఫ్యాన్స్ కచ్చితంగా ఎంజాయ్ చేస్తారని ఆయన ధీమా వ్యక్తం చేశారు.

‘సీతారామం’ లాంటి బ్లాక్ బస్టర్ క్లాసిక్ తర్వాత హను రాఘవపూడి దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రం 1940ల నాటి స్వాతంత్ర్య పూర్వపు యుద్ధ నేపథ్యంలో సాగే ఫిక్షనల్ హిస్టారికల్ యాక్షన్ లవ్ స్టోరీగా రూపొందుతోంది. ఇప్పటికే విడుదలైన టైటిల్ పోస్టర్, ఫస్ట్ లుక్ ప్రభాస్ వింటేజ్ లుక్‌ను పరిచయం చేసి అంచనాలను అమాంతం పెంచేశాయి. ఈ సినిమాలో ప్రభాస్ బ్రిటిష్ ఇండియన్ ఆర్మీలో పనిచేసే వీర సైనికుడిగా కనిపించనున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం ప్రభాస్ లైనప్‌లో ‘కల్కి 2’, సందీప్ రెడ్డి వంగా ‘స్పిరిట్’ వంటి భారీ పాన్ ఇండియా ప్రాజెక్ట్స్ ఉన్నప్పటికీ, చాలా కాలం తర్వాత ప్రభాస్ చేస్తున్న పూర్తిస్థాయి ప్రేమకథ కావడంతో ‘ఫౌజీ’పై ఇండస్ట్రీలో ప్రత్యేక ఆసక్తి నెలకొంది. విశాల్ చంద్రశేఖర్ సంగీతం అందిస్తున్న ఈ సినిమా గ్లింప్స్ కోసం అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

×
prabhanews.co.in
Logo
Date of Publish : 22 October 2026, 11:05 am Digital Edition : Prabhanews
Prabhas Fauzi: ప్రభాస్ అభిమానులకు గుడ్‌ న్యూస్.. పుట్టినరోజు కానుక రెడీ | తెలుగు సినిమా వార్తలు

Last Updated:Oct 22, 2026 10:56 AM ISTరెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా హను రాఘవపూడి దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమా ‘ఫౌజీ’. ఈ సినిమా నుంచి ప్రభాస్ పుట్టినరోజు కానుక రెడీ అయింది.News18పాన్ ఇండియా సూపర్ స్టార్ ప్రభాస్, డైరెక్టర్ హను రాఘవపూడి కాంబినేషన్లో తెరకెక్కుతున్న ప్రతిష్టాత్మక చిత్రం ‘ఫౌజీ’. మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్‌పై నవీన్ ఎర్నేని, వై. రవిశంకర్ అత్యంత భారీ బడ్జెట్‌తో నిర్మిస్తున్న ఈ పీరియాడికల్ వార్ లవ్ డ్రామా కోసం దేశవ్యాప్తంగా సినీ అభిమానులు వేయికళ్లతో ఎదురుచూస్తున్నారు. దసరా పండుగకు ఈ సినిమా నుంచి ఏదైనా స్పెషల్ అప్‌డేట్ వస్తుందని ఆశించిన డార్లింగ్ ఫ్యాన్స్‌కు మేకర్స్ నుంచి ఎలాంటి ప్రకటన రాకపోవడంతో కాస్త నిరాశ చెందారు. అయితే, అభిమానుల నిరాశను పోగొడుతూ నిర్మాత వై. రవిశంకర్ అదిరిపోయే గుడ్ న్యూస్ అందించారు. అక్టోబర్ 23న ప్రభాస్ పుట్టినరోజు సందర్భంగా ‘ఫౌజీ’ సినిమా నుంచి ఒక స్పెషల్ గ్లింప్స్ వీడియోను విడుదల చేయబోతున్నట్లు ఆయన అధికారికంగా ప్రకటించారు.ఈ స్పెషల్ గ్లింప్స్ ద్వారా సినిమాలో ప్రభాస్ క్యారెక్టరైజేషన్ ఏమిటి, అసలు ఈ సినిమా నేపథ్యం ఎలా ఉండబోతోంది అనే విషయాలపై ప్రేక్షకులకు ఒక స్పష్టమైన విజన్ రానుందని రవిశంకర్ తెలిపారు. "అక్టోబర్ 23న ప్రభాస్ బర్త్ డే స్పెషల్‌గా ఒక చిన్న వీడియోను రిలీజ్ చేస్తున్నాం. ఇందులో హీరో పాత్ర ఎలా ఉండబోతోంది? అతను ఏం చేస్తాడు? సినిమా కథాంశం ఏంటి? అనే విషయాలపై ఒక హింట్ ఇస్తాం. అయితే, ఇది కేవలం క్యారెక్టర్ ఇంట్రడక్షన్ మాత్రమే కాబట్టి 'బాహుబలి' రేంజ్ భారీ యాక్షన్ ఎలిమెంట్స్ ఆశించవద్దు. సినిమా మూడ్ ఎలా ఉండబోతోందో ఈ వీడియోలో చూపిస్తాం" అని ఆయన స్పష్టం చేశారు. అంతేకాకుండా, థియేటర్లలో ప్రదర్శితమయ్యే ‘418’ సినిమాతో పాటు ఈ ఫౌజీ గ్లింప్స్‌ను కూడా స్క్రీనింగ్ చేయనున్నట్లు తెలిపారు. బిగ్ స్క్రీన్ మీద ఆ విజువల్స్ చూస్తే ఫ్యాన్స్ కచ్చితంగా ఎంజాయ్ చేస్తారని ఆయన ధీమా వ్యక్తం చేశారు.'సీతారామం' లాంటి బ్లాక్ బస్టర్ క్లాసిక్ తర్వాత హను రాఘవపూడి దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రం 1940ల నాటి స్వాతంత్ర్య పూర్వపు యుద్ధ నేపథ్యంలో సాగే ఫిక్షనల్ హిస్టారికల్ యాక్షన్ లవ్ స్టోరీగా రూపొందుతోంది. ఇప్పటికే విడుదలైన టైటిల్ పోస్టర్, ఫస్ట్ లుక్ ప్రభాస్ వింటేజ్ లుక్‌ను పరిచయం చేసి అంచనాలను అమాంతం పెంచేశాయి. ఈ సినిమాలో ప్రభాస్ బ్రిటిష్ ఇండియన్ ఆర్మీలో పనిచేసే వీర సైనికుడిగా కనిపించనున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం ప్రభాస్ లైనప్‌లో 'కల్కి 2', సందీప్ రెడ్డి వంగా 'స్పిరిట్' వంటి భారీ పాన్ ఇండియా ప్రాజెక్ట్స్ ఉన్నప్పటికీ, చాలా కాలం తర్వాత ప్రభాస్ చేస్తున్న పూర్తిస్థాయి ప్రేమకథ కావడంతో 'ఫౌజీ'పై ఇండస్ట్రీలో ప్రత్యేక ఆసక్తి నెలకొంది. విశాల్ చంద్రశేఖర్ సంగీతం అందిస్తున్న ఈ సినిమా గ్లింప్స్ కోసం అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.మరింత చదవండి

Source link