ప్రస్తుతం సారా అర్జున్ తమిళం, తెలుగు, హిందీ చిత్రాల్లో తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకుంది. చిన్న వయసులోనే ప్రకటనల ద్వారా కెరీర్ ప్రారంభించిన ఆమె, ఆ తర్వాత ఏక్ థీ డాయన్, సైవం, మణిరత్నం రూపొందించిన పొన్నియిన్ సెల్వన్ సిరీస్ వంటి ప్రతిష్ఠాత్మక చిత్రాల్లో కీలక పాత్రలు పోషించింది.

