Last Updated:
రామాయణ సినిమా నుంచి చిత్రం నుంచి ‘రైజ్ ఆఫ్ అసుర’ (Rise of Asura) అనే టైటిల్‌తో ‘శివతాండవం’ గ్లింప్స్‌ను మేకర్స్ విడుదల చేశారు. ఈ వీడియో సోషల్ మీడియాలో సెన్సేషన్ అవుతోంది.
భారతీయ చలనచిత్ర పరిశ్రమలో అత్యంత ప్రతిష్టాత్మకంగా రూపొందుతున్న పౌరాణిక ఇతిహాస చిత్రం ‘రామాయణ’ (Ramayana). దంగల్ ఫేమ్, బాలీవుడ్ ప్రముఖ దర్శకుడు నితేశ్ తివారీ అత్యంత భారీ బడ్జెట్‌తో, విజువల్ వండర్‌గా ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. ఇందులో మర్యాదా పురుషోత్తముడైన శ్రీరాముడిగా బాలీవుడ్ స్టార్ హీరో రణ్‌బీర్ కపూర్ నటిస్తుండగా, సీతాదేవిగా న్యాచురల్ బ్యూటీ సాయి పల్లవి కనిపించనుంది. అయితే, ఈ సినిమాలో ప్రేక్షకుల దృష్టిని అత్యంత విశేషంగా ఆకర్షిస్తున్న పాత్ర రావణాసురుడిది. పాన్ ఇండియా సూపర్ స్టార్, కేజీఎఫ్ ఫేమ్ యశ్ (Yash) ఈ చిత్రంలో లంకాధిపతి రావణుడిగా తన నట విశ్వరూపం చూపించడానికి సిద్ధమయ్యారు.
తాజాగా దసరా పండుగ కానుకగా చిత్ర బృందం అభిమానులకు ఒక భారీ సర్ ప్రైజ్ ఇచ్చింది. ఈ చిత్రం నుంచి ‘రైజ్ ఆఫ్ అసుర’ (Rise of Asura) అనే టైటిల్‌తో ‘శివతాండవం’ గ్లింప్స్‌ను మేకర్స్ విడుదల చేశారు. విడుదలైన క్షణాల్లోనే ఈ వీడియో సామాజిక మాధ్యమాల్లో ట్రెండింగ్‌గా మారింది. ఇందులో రావణాసురుడిగా యశ్ ఆహార్యం, ఆయన కళ్లలో కనిపించే రౌద్రం, పలికించిన హావభావాలు అద్భుతంగా ఉన్నాయి.
ముఖ్యంగా పరమశివుడిని ప్రసన్నం చేసుకునేందుకు ఆయన చేసే శివ తాండవం గ్లింప్స్ లో యశ్ శక్తిమంతమైన స్క్రీన్ ప్రెజెన్స్ ప్రేక్షకులను మంత్రముగ్ధులను చేస్తోంది. యశ్ నటన సినిమాపై ఉన్న అంచనాలను అమాంతం పెంచేసిందని, కచ్చితంగా ఇది భారతీయ సినిమా చరిత్రలో నిలిచిపోయే విలనిజం అవుతుందని నెటిజన్లు కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు. ‘రాకింగ్ స్టార్’ యశ్ ఒక పౌరాణిక ప్రతినాయకుడిగా మారడం అభిమానుల్లో తీవ్ర ఆసక్తిని రేకెత్తిస్తోంది.
నవంబర్ 5న ప్రపంచవ్యాప్తంగా రికార్డు స్థాయిలో థియేటర్లలో భారీ ఎత్తున విడుదల కానున్న ఈ సినిమాకు సంబంధించి అప్పుడే ఓవర్సీస్ తో పాటు పలు చోట్ల అడ్వాన్స్ బుకింగ్స్ కూడా ప్రారంభమయ్యాయి. టికెట్ విక్రయాలు రికార్డు స్థాయిలో సాగుతుండటం సినిమాపై ఉన్న క్రేజ్‌కు నిదర్శనం. ఈ ఎపిక్ డ్రామాలో బాలీవుడ్ సీనియర్ నటుడు సన్నీ దేఓల్, టాలీవుడ్ స్టార్ హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్ తదితరులు ఇతర కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ఈ సందర్భంగా చిత్ర బృందం ప్రచార కార్యక్రమాలను ముమ్మరం చేసింది. “భారతీయ సినిమా సత్తాను, మన ఇతిహాసాల గొప్పదనాన్ని ప్రపంచ స్థాయిలో నిలబెట్టాలనే ఏకైక లక్ష్యంతో, హాలీవుడ్ స్థాయి వీఎఫ్ఎక్స్ (VFX) అత్యున్నత సాంకేతిక విలువలతో చేసిన చిత్రమే ఈ ‘రామాయణ'” అని మేకర్స్ సగర్వంగా చెబుతున్నారు.

