ప్రభన్యూస్

France Riots: అట్టుడుకుతున్న ఫ్రాన్స్.. ఎక్కడికక్కడే కర్ఫ్యూలు విధించిన ప్రభుత్వం! |


Last Updated:

France Riots: ఫ్రాన్స్ రాజధాని ప్యారిస్‌తో పాటు పలు ప్రధాన నగరాల్లో ప్రజాగ్రహం కట్టలు తెంచుకుంది.

ఫ్రాన్స్ అల్లర్లు
ఫ్రాన్స్ అల్లర్లు

పెరుగుతున్న నిత్యావసర వస్తువుల ధరలు, భరించలేని జీవన వ్యయం, విద్యా రంగంలో మౌలిక వసతుల కొరత తదితర సమస్యలను నిరసిస్తూ ప్రారంభమైన విద్యార్థులు, యువత ఉద్యమం తీవ్ర హింసాత్మక రూపం దాల్చింది. ప్రభుత్వ కార్యాలయాలు, సిటీ హాళ్లు, వాణిజ్య సముదాయాలు, ప్రైవేటు దుకాణాలపై నిరసనకారులు పెద్దఎత్తున దాడులు, విధ్వంసాలకు పాల్పడ్డారు. బాంబు పేలుళ్లు, దహనకాండలు చోటుచేసుకోవడంతో శాంతిభద్రతల పరిరక్షణ కోసం ప్రభుత్వం ఎక్కడికక్కడే పరిమిత స్థాయిలో స్థానికంగా కర్ఫ్యూలు విధించేందుకు అత్యవసర ఆదేశాలు జారీ చేసింది.

ఒక్కరూ చనిపోకపోవడం ఒక అద్భుతం

ప్రధాని వ్యాఖ్యలుదేశవ్యాప్తంగా శనివారం రాత్రి చోటుచేసుకున్న హింసాత్మక ఘర్షణలు తీవ్ర భయాందోళనలు సృష్టించాయి. ఇంతటి తీవ్రస్థాయి ఘర్షణలు, దాడులు జరిగినప్పటికీ ఘటనల్లో ఒక్కరు కూడా ప్రాణాలు కోల్పోకపోవడం ఒక అద్భుతమేనని ఫ్రాన్స్ ప్రధానమంత్రి సెబాస్టియన్ లెకోర్నూ వ్యాఖ్యానించారు. పరిస్థితులను సమీక్షిస్తున్నామని, శాంతిభద్రతలను అదుపులోకి తెచ్చేందుకు ఏయే ప్రాంతాల్లో కర్ఫ్యూ అమలు చేయనున్నామనే పూర్తి వివరాలను త్వరలోనే అధికారికంగా వెల్లడిస్తామని ఆయన స్పష్టం చేశారు. మరోవైపు, దేశంలో చెలరేగిన తీవ్రమైన అల్లర్లకు నైతిక బాధ్యత వహిస్తూ ఫ్రాన్స్ అంతర్గత వ్యవహారాల శాఖ మంత్రి లారెంట్ న్యూనెజ్ తన పదవికి రాజీనామా చేసేందుకు ముందుకొచ్చారు. అయితే ప్రస్తుత సంక్షోభ పరిస్థితుల దృష్ట్యా దేశాధ్యక్షుడు ఇమాన్యుయెల్ మెక్రాన్ ఆయన రాజీనామాను తిరస్కరించి, విధుల్లో కొనసాగాల్సిందిగా ఆదేశించారు.

ఫాక్స్ న్యూస్ సంచలన నివేదిక

ఆందోళనల వెనుక 50 సంస్థలు?ఫ్రాన్స్‌లో రోజురోజుకూ తీవ్రరూపం దాల్చుతున్న ఈ ఆందోళనలు కేవలం విద్యార్థుల సమస్యలతో మాత్రమే పరిమితం కాలేదని, వీటి వెనుక భారీ అంతర్జాతీయ నెట్‌వర్క్ పనిచేస్తోందంటూ ‘ఫాక్స్ న్యూస్ డిజిటల్’ పరిశోధనాత్మక నివేదిక సంచలన విషయాలను బయటపెట్టింది. విద్యార్థుల అసంతృప్తిని అడ్డం పెట్టుకుని కొన్ని తీవ్ర వామపక్ష, సోషలిస్ట్, కమ్యూనిస్ట్ సంస్థలు తమ విస్తృత రాజకీయ అజెండాను అమలు చేస్తున్నాయని ఆ నివేదిక పేర్కొంది. ఈ ఉద్యమంతో ప్రత్యక్షంగా, పరోక్షంగా సంబంధాలు ఉన్న 50 సంస్థలను గుర్తించగా, వాటిలో కేవలం 15 మాత్రమే విద్యార్థి లేదా యువజన సంఘాలని వెల్లడించింది.

మిగిలిన 35 సంస్థల్లో కార్మిక సంఘాలు, రాజకీయ పార్టీలు, వామపక్ష బృందాలు, పౌర హక్కుల సంఘాలు ఉన్నట్లు స్పష్టం చేసింది. ఈ నెట్‌వర్క్ ఒక్క ఫ్రాన్స్‌కే పరిమితం కాకుండా అమెరికా, బ్రిటన్, గ్రీస్, బ్రెజిల్, భారత్ తదితర దేశాల గ్రూపులతో అనుసంధానమై ఉన్నట్లు వివరించింది.

భారత లింకులు – అంతర్జాతీయ ప్రచారం

ఈ నివేదికలో ఫ్రాన్స్‌లో కార్యకలాపాలు సాగిస్తున్న ‘ఇండియన్ అలయన్స్ పాలిస్’ అనే సంస్థ పేరును సైతం ప్రస్తావించారు. భారతీయ విద్యార్థులు, పరిశోధకులు, వృత్తినిపుణులు సభ్యులుగా ఉన్న ఈ వేదిక సామాజిక మాధ్యమాల ద్వారా ఫ్రాన్స్ ఉద్యమానికి సంపూర్ణ మద్దతు ప్రకటించిందని, ఈ నిరసనలను భారత్‌లోని విద్యార్థి ఉద్యమాలతో పోలుస్తూ ప్రచారం చేసిందని పేర్కొంది. అంతేకాకుండా భారత లోక్‌సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీని పోలీసులు గతంలో అదుపులోకి తీసుకున్న వీడియోను, అలాగే అక్టోబర్ 7న ఎన్నికల సందర్భంగా జరిగిన పరిణామాలకు సంబంధించిన వార్తా కథనాలను ఆ సంస్థ తమ అధికారిక ఖాతాలో పంచుకున్నట్లు నివేదిక వెల్లడించింది.

మరోవైపు అమెరికాలోని న్యూయార్క్‌కు చెందిన ప్రోలెట్రా న్యూస్ వంటి మీడియా సంస్థలు సైతం ఈ నిరసనలను ‘హిస్టారిక్ స్ట్రైక్’గా అభివర్ణిస్తూ అంతర్జాతీయంగా విస్తృత ప్రచారం కల్పించినట్లు కథనం పేర్కొంది. ప్రస్తుతం ఫ్రాన్స్ ప్రభుత్వం కర్ఫ్యూ ఆంక్షలతో పాటు ఈ సంస్థల ఆర్థిక, వ్యవస్థాగత లింకులపై కూడా లోతైన దృష్టి సారించింది.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

×
prabhanews.co.in
Logo
Date of Publish : 20 October 2026, 8:36 am Digital Edition : Prabhanews
France Riots: అట్టుడుకుతున్న ఫ్రాన్స్.. ఎక్కడికక్కడే కర్ఫ్యూలు విధించిన ప్రభుత్వం! |

Last Updated:Oct 20, 2026 8:26 AM ISTFrance Riots: ఫ్రాన్స్ రాజధాని ప్యారిస్‌తో పాటు పలు ప్రధాన నగరాల్లో ప్రజాగ్రహం కట్టలు తెంచుకుంది.ఫ్రాన్స్ అల్లర్లుపెరుగుతున్న నిత్యావసర వస్తువుల ధరలు, భరించలేని జీవన వ్యయం, విద్యా రంగంలో మౌలిక వసతుల కొరత తదితర సమస్యలను నిరసిస్తూ ప్రారంభమైన విద్యార్థులు, యువత ఉద్యమం తీవ్ర హింసాత్మక రూపం దాల్చింది. ప్రభుత్వ కార్యాలయాలు, సిటీ హాళ్లు, వాణిజ్య సముదాయాలు, ప్రైవేటు దుకాణాలపై నిరసనకారులు పెద్దఎత్తున దాడులు, విధ్వంసాలకు పాల్పడ్డారు. బాంబు పేలుళ్లు, దహనకాండలు చోటుచేసుకోవడంతో శాంతిభద్రతల పరిరక్షణ కోసం ప్రభుత్వం ఎక్కడికక్కడే పరిమిత స్థాయిలో స్థానికంగా కర్ఫ్యూలు విధించేందుకు అత్యవసర ఆదేశాలు జారీ చేసింది.ఒక్కరూ చనిపోకపోవడం ఒక అద్భుతంప్రధాని వ్యాఖ్యలుదేశవ్యాప్తంగా శనివారం రాత్రి చోటుచేసుకున్న హింసాత్మక ఘర్షణలు తీవ్ర భయాందోళనలు సృష్టించాయి. ఇంతటి తీవ్రస్థాయి ఘర్షణలు, దాడులు జరిగినప్పటికీ ఘటనల్లో ఒక్కరు కూడా ప్రాణాలు కోల్పోకపోవడం ఒక అద్భుతమేనని ఫ్రాన్స్ ప్రధానమంత్రి సెబాస్టియన్ లెకోర్నూ వ్యాఖ్యానించారు. పరిస్థితులను సమీక్షిస్తున్నామని, శాంతిభద్రతలను అదుపులోకి తెచ్చేందుకు ఏయే ప్రాంతాల్లో కర్ఫ్యూ అమలు చేయనున్నామనే పూర్తి వివరాలను త్వరలోనే అధికారికంగా వెల్లడిస్తామని ఆయన స్పష్టం చేశారు. మరోవైపు, దేశంలో చెలరేగిన తీవ్రమైన అల్లర్లకు నైతిక బాధ్యత వహిస్తూ ఫ్రాన్స్ అంతర్గత వ్యవహారాల శాఖ మంత్రి లారెంట్ న్యూనెజ్ తన పదవికి రాజీనామా చేసేందుకు ముందుకొచ్చారు. అయితే ప్రస్తుత సంక్షోభ పరిస్థితుల దృష్ట్యా దేశాధ్యక్షుడు ఇమాన్యుయెల్ మెక్రాన్ ఆయన రాజీనామాను తిరస్కరించి, విధుల్లో కొనసాగాల్సిందిగా ఆదేశించారు.ఫాక్స్ న్యూస్ సంచలన నివేదికఆందోళనల వెనుక 50 సంస్థలు?ఫ్రాన్స్‌లో రోజురోజుకూ తీవ్రరూపం దాల్చుతున్న ఈ ఆందోళనలు కేవలం విద్యార్థుల సమస్యలతో మాత్రమే పరిమితం కాలేదని, వీటి వెనుక భారీ అంతర్జాతీయ నెట్‌వర్క్ పనిచేస్తోందంటూ 'ఫాక్స్ న్యూస్ డిజిటల్' పరిశోధనాత్మక నివేదిక సంచలన విషయాలను బయటపెట్టింది. విద్యార్థుల అసంతృప్తిని అడ్డం పెట్టుకుని కొన్ని తీవ్ర వామపక్ష, సోషలిస్ట్, కమ్యూనిస్ట్ సంస్థలు తమ విస్తృత రాజకీయ అజెండాను అమలు చేస్తున్నాయని ఆ నివేదిక పేర్కొంది. ఈ ఉద్యమంతో ప్రత్యక్షంగా, పరోక్షంగా సంబంధాలు ఉన్న 50 సంస్థలను గుర్తించగా, వాటిలో కేవలం 15 మాత్రమే విద్యార్థి లేదా యువజన సంఘాలని వెల్లడించింది.మిగిలిన 35 సంస్థల్లో కార్మిక సంఘాలు, రాజకీయ పార్టీలు, వామపక్ష బృందాలు, పౌర హక్కుల సంఘాలు ఉన్నట్లు స్పష్టం చేసింది. ఈ నెట్‌వర్క్ ఒక్క ఫ్రాన్స్‌కే పరిమితం కాకుండా అమెరికా, బ్రిటన్, గ్రీస్, బ్రెజిల్, భారత్ తదితర దేశాల గ్రూపులతో అనుసంధానమై ఉన్నట్లు వివరించింది.భారత లింకులు – అంతర్జాతీయ ప్రచారంఈ నివేదికలో ఫ్రాన్స్‌లో కార్యకలాపాలు సాగిస్తున్న ‘ఇండియన్ అలయన్స్ పాలిస్’ అనే సంస్థ పేరును సైతం ప్రస్తావించారు. భారతీయ విద్యార్థులు, పరిశోధకులు, వృత్తినిపుణులు సభ్యులుగా ఉన్న ఈ వేదిక సామాజిక మాధ్యమాల ద్వారా ఫ్రాన్స్ ఉద్యమానికి సంపూర్ణ మద్దతు ప్రకటించిందని, ఈ నిరసనలను భారత్‌లోని విద్యార్థి ఉద్యమాలతో పోలుస్తూ ప్రచారం చేసిందని పేర్కొంది. అంతేకాకుండా భారత లోక్‌సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీని పోలీసులు గతంలో అదుపులోకి తీసుకున్న వీడియోను, అలాగే అక్టోబర్ 7న ఎన్నికల సందర్భంగా జరిగిన పరిణామాలకు సంబంధించిన వార్తా కథనాలను ఆ సంస్థ తమ అధికారిక ఖాతాలో పంచుకున్నట్లు నివేదిక వెల్లడించింది.మరోవైపు అమెరికాలోని న్యూయార్క్‌కు చెందిన ప్రోలెట్రా న్యూస్ వంటి మీడియా సంస్థలు సైతం ఈ నిరసనలను ‘హిస్టారిక్ స్ట్రైక్’గా అభివర్ణిస్తూ అంతర్జాతీయంగా విస్తృత ప్రచారం కల్పించినట్లు కథనం పేర్కొంది. ప్రస్తుతం ఫ్రాన్స్ ప్రభుత్వం కర్ఫ్యూ ఆంక్షలతో పాటు ఈ సంస్థల ఆర్థిక, వ్యవస్థాగత లింకులపై కూడా లోతైన దృష్టి సారించింది.మరింత చదవండి

Source link