అయితే నివేదిక తయారీలో కేవలం గణాంకాలు, ఆర్థిక అంశాలే కాకుండా ఉద్యోగ సంఘాలు, వివిధ అసోసియేషన్ల అభిప్రాయాలు కూడా కీలక పాత్ర పోషిస్తాయి. ఈ కారణంగా వేతన సంఘం దేశంలోని పలు ప్రాంతాల్లో సమావేశాలు నిర్వహిస్తూ ఉద్యోగ ప్రతినిధులతో చర్చలు కొనసాగిస్తోంది. ఢిల్లీ, బెంగళూరు, ఒడిశా, లడఖ్, ఉత్తరప్రదేశ్ వంటి ప్రాంతాల్లో ఇప్పటికే సమావేశాలు జరిగాయి. మరో విడత సంప్రదింపులు ముంబైలో అక్టోబర్ 22 నుంచి ప్రారంభం కానున్నట్లు సమాచారం. ఈ సంఘం నివేదికలో ఫిట్‌మెంట్ ఫ్యాక్టర్, ప్రాథమిక వేతనాల సవరణ, పెన్షన్ విధానంలో మార్పులు, సర్వీస్ సంబంధిత ప్రయోజనాలు, భత్యాల పునర్వ్యవస్థీకరణ వంటి కీలక అంశాలపై సిఫార్సులు ఉండే అవకాశం ఉంది. ముఖ్యంగా ఫిట్‌మెంట్ ఫ్యాక్టర్ ఎంతగా నిర్ణయిస్తారన్న అంశంపై ఉద్యోగులు ఎక్కువ ఆసక్తి చూపుతున్నారు. ఎందుకంటే అదే కొత్త వేతన నిర్మాణానికి పునాది అవుతుంది.

