ప్రభన్యూస్

Ranabaali Censor: విజయ్ దేవరకొండ ‘రణబాలి’ సెన్సార్ పూర్తి.. రన్ టైమ్ ఎంతో తెలుసా? | తెలుగు సినిమా వార్తలు


Last Updated:

విజయ్ దేవరకొండ, రష్మిక మందన్న జంటగా నటిస్తున్న ప్రతిష్టాత్మక పాన్ ఇండియా చిత్రం ‘రణబాలి’. తాజాగా ఈ సినిమా సెన్సార్ రిపోర్ట్ బయటకొచ్చింది.

News18
News18

రౌడీ స్టార్ విజయ్ దేవరకొండ, నేషనల్ క్రష్ రష్మిక మందన్న జంటగా నటిస్తున్న ప్రతిష్టాత్మక పాన్ ఇండియా చిత్రం ‘రణబాలి’ విడుదలకు సర్వం సిద్ధమైంది. ‘గీత గోవిందం’, ‘డియర్ కామ్రేడ్’ వంటి బ్లాక్ బస్టర్ చిత్రాల తర్వాత వీరిద్దరి కలయికలో వస్తున్న హ్యాట్రిక్ సినిమా కావడంతో దేశవ్యాప్తంగా సినీ ప్రియుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. ‘టాక్సీవాలా’ లాంటి సూపర్ హిట్ తర్వాత దర్శకుడు రాహుల్ సాంకృత్యన్, విజయ్ దేవరకొండ కాంబినేషన్‌లో వస్తున్న ఈ యాక్షన్ పీరియాడిక్ డ్రామాను అగ్ర నిర్మాణ సంస్థలు మైత్రీ మూవీ మేకర్స్, టీ-సిరీస్ సంయుక్తంగా అత్యంత భారీ బడ్జెట్‌తో నిర్మిస్తున్నాయి. తాజాగా ఈ చిత్రం సెన్సార్ కార్యక్రమాలను పూర్తి చేసుకుంది. సెన్సార్ బోర్డు ఈ సినిమాకు ఒక్క కట్ కూడా లేకుండా ‘U/A’ సర్టిఫికెట్ జారీ చేసింది.

విశేషమేమిటంటే, ఈ సినిమాలో భారీ యాక్షన్ ఎపిసోడ్స్, గూస్‌బంప్స్ తెప్పించే పోరాట ఘట్టాలు ఉన్నప్పటికీ, సెన్సార్ బోర్డు సభ్యులు ఒక్క సన్నివేశాన్ని కూడా తొలగించలేదు. కనీసం ఒక్క డైలాగ్‌ను కూడా మ్యూట్ చేయమని సూచించకుండా జీరో కట్స్‌తో ప్రదర్శనకు అనుమతి ఇవ్వడం విశేషం. కథలోని ఎమోషన్‌ను, చారిత్రక నేపథ్యాన్ని ఎక్కడా మితిమీరిన హింస లేకుండా, కుటుంబ సమేతంగా చూసేలా దర్శకుడు అద్భుతంగా తెరకెక్కించారని సెన్సార్ సభ్యులు ప్రశంసించినట్లు సమాచారం. దీనికి తోడు సామాన్య ప్రేక్షకులను దృష్టిలో ఉంచుకుని ఈ సినిమాకు థియేటర్లలో ఎలాంటి అదనపు టికెట్ రేట్లు పెంచడం లేదని నిర్మాతలు ముందుగానే ప్రకటించడం సినిమాపై మరింత పాజిటివిటీని పెంచుతోంది.

కథా నేపథ్యం విషయానికొస్తే.. 1854 నుంచి 1878 మధ్య బ్రిటిష్ వలస పాలన కాలంలో జరిగిన యదార్థ పరిస్థితుల ఆధారంగా ఈ సినిమా రూపొందింది. నాటి మద్రాస్ ప్రెసిడెన్సీ పరిధిలోని రాయలసీమ ప్రాంతాన్ని అతలాకుతలం చేసిన భయంకరమైన కరువు పరిస్థితులు, ఆకలి చావులను ఈ చిత్రంలో ప్రధానంగా ఆవిష్కరించారు. తినడానికి తిండి లేక ప్రజలు విలవిలలాడుతున్నా కనికరం లేకుండా తెల్లదొరలు వసూలు చేసిన అమానుష పన్నుల విధానాన్ని ఎదిరించి, ప్రజల పక్షాన నిలబడిన ఓ స్థానిక యోధుడి చారిత్రక గాథే ఈ ‘రణబాలి’.

ఈ చిత్రంలో విజయ్ దేవరకొండ ‘శింగనమల బొబ్బిలి రణబాలి’ అనే అత్యంత శక్తిమంతమైన, తిరుగుబాటుదారుడి పాత్రలో విశ్వరూపం చూపించనున్నారు. ఆయనకు అండగా నిలిచే అత్యంత కీలకమైన పాత్రలో రష్మిక నటించింది. ఇక క్రూరుడైన బ్రిటిష్ అధికారి ‘సర్ థియోడర్ హెక్టర్’ పాత్రలో హాలీవుడ్ నటుడు ఆర్నాల్డ్ ఓస్లో విలనిజం పండించనున్నారు. ఈశ్వరీ రావు, జేసన్ షా, మైమ్ మధు తదితరులు ఇతర కీలక పాత్రలు పోషిస్తున్నారు. పాన్ ఇండియా స్థాయిలో తెలుగు, హిందీ, తమిళ, కన్నడ, మలయాళ భాషల్లో విడుదల కానున్న ఈ చారిత్రక చిత్రం కోసం ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. 2 గంట‌ల 50 నిమిషాల ర‌న్ టైమ్‌ తో అక్టోబర్ 16 ఈ సినిమా గ్రాండ్ రిలీజ్ కానుంది.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

×
prabhanews.co.in
Logo
Date of Publish : 13 October 2026, 5:44 pm Digital Edition : Prabhanews
Ranabaali Censor: విజయ్ దేవరకొండ ‘రణబాలి’ సెన్సార్ పూర్తి.. రన్ టైమ్ ఎంతో తెలుసా? | తెలుగు సినిమా వార్తలు

Last Updated:Oct 13, 2026 4:47 PM ISTవిజయ్ దేవరకొండ, రష్మిక మందన్న జంటగా నటిస్తున్న ప్రతిష్టాత్మక పాన్ ఇండియా చిత్రం 'రణబాలి'. తాజాగా ఈ సినిమా సెన్సార్ రిపోర్ట్ బయటకొచ్చింది. News18రౌడీ స్టార్ విజయ్ దేవరకొండ, నేషనల్ క్రష్ రష్మిక మందన్న జంటగా నటిస్తున్న ప్రతిష్టాత్మక పాన్ ఇండియా చిత్రం 'రణబాలి' విడుదలకు సర్వం సిద్ధమైంది. 'గీత గోవిందం', 'డియర్ కామ్రేడ్' వంటి బ్లాక్ బస్టర్ చిత్రాల తర్వాత వీరిద్దరి కలయికలో వస్తున్న హ్యాట్రిక్ సినిమా కావడంతో దేశవ్యాప్తంగా సినీ ప్రియుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. 'టాక్సీవాలా' లాంటి సూపర్ హిట్ తర్వాత దర్శకుడు రాహుల్ సాంకృత్యన్, విజయ్ దేవరకొండ కాంబినేషన్‌లో వస్తున్న ఈ యాక్షన్ పీరియాడిక్ డ్రామాను అగ్ర నిర్మాణ సంస్థలు మైత్రీ మూవీ మేకర్స్, టీ-సిరీస్ సంయుక్తంగా అత్యంత భారీ బడ్జెట్‌తో నిర్మిస్తున్నాయి. తాజాగా ఈ చిత్రం సెన్సార్ కార్యక్రమాలను పూర్తి చేసుకుంది. సెన్సార్ బోర్డు ఈ సినిమాకు ఒక్క కట్ కూడా లేకుండా 'U/A' సర్టిఫికెట్ జారీ చేసింది.విశేషమేమిటంటే, ఈ సినిమాలో భారీ యాక్షన్ ఎపిసోడ్స్, గూస్‌బంప్స్ తెప్పించే పోరాట ఘట్టాలు ఉన్నప్పటికీ, సెన్సార్ బోర్డు సభ్యులు ఒక్క సన్నివేశాన్ని కూడా తొలగించలేదు. కనీసం ఒక్క డైలాగ్‌ను కూడా మ్యూట్ చేయమని సూచించకుండా జీరో కట్స్‌తో ప్రదర్శనకు అనుమతి ఇవ్వడం విశేషం. కథలోని ఎమోషన్‌ను, చారిత్రక నేపథ్యాన్ని ఎక్కడా మితిమీరిన హింస లేకుండా, కుటుంబ సమేతంగా చూసేలా దర్శకుడు అద్భుతంగా తెరకెక్కించారని సెన్సార్ సభ్యులు ప్రశంసించినట్లు సమాచారం. దీనికి తోడు సామాన్య ప్రేక్షకులను దృష్టిలో ఉంచుకుని ఈ సినిమాకు థియేటర్లలో ఎలాంటి అదనపు టికెట్ రేట్లు పెంచడం లేదని నిర్మాతలు ముందుగానే ప్రకటించడం సినిమాపై మరింత పాజిటివిటీని పెంచుతోంది.కథా నేపథ్యం విషయానికొస్తే.. 1854 నుంచి 1878 మధ్య బ్రిటిష్ వలస పాలన కాలంలో జరిగిన యదార్థ పరిస్థితుల ఆధారంగా ఈ సినిమా రూపొందింది. నాటి మద్రాస్ ప్రెసిడెన్సీ పరిధిలోని రాయలసీమ ప్రాంతాన్ని అతలాకుతలం చేసిన భయంకరమైన కరువు పరిస్థితులు, ఆకలి చావులను ఈ చిత్రంలో ప్రధానంగా ఆవిష్కరించారు. తినడానికి తిండి లేక ప్రజలు విలవిలలాడుతున్నా కనికరం లేకుండా తెల్లదొరలు వసూలు చేసిన అమానుష పన్నుల విధానాన్ని ఎదిరించి, ప్రజల పక్షాన నిలబడిన ఓ స్థానిక యోధుడి చారిత్రక గాథే ఈ 'రణబాలి'.ఈ చిత్రంలో విజయ్ దేవరకొండ 'శింగనమల బొబ్బిలి రణబాలి' అనే అత్యంత శక్తిమంతమైన, తిరుగుబాటుదారుడి పాత్రలో విశ్వరూపం చూపించనున్నారు. ఆయనకు అండగా నిలిచే అత్యంత కీలకమైన పాత్రలో రష్మిక నటించింది. ఇక క్రూరుడైన బ్రిటిష్ అధికారి 'సర్ థియోడర్ హెక్టర్' పాత్రలో హాలీవుడ్ నటుడు ఆర్నాల్డ్ ఓస్లో విలనిజం పండించనున్నారు. ఈశ్వరీ రావు, జేసన్ షా, మైమ్ మధు తదితరులు ఇతర కీలక పాత్రలు పోషిస్తున్నారు. పాన్ ఇండియా స్థాయిలో తెలుగు, హిందీ, తమిళ, కన్నడ, మలయాళ భాషల్లో విడుదల కానున్న ఈ చారిత్రక చిత్రం కోసం ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. 2 గంట‌ల 50 నిమిషాల ర‌న్ టైమ్‌ తో అక్టోబర్ 16 ఈ సినిమా గ్రాండ్ రిలీజ్ కానుంది.మరింత చదవండి

Source link