వితికా శేరు తెలుగు ప్రేక్షకులకు ప్రత్యేకంగా పరిచయం అవసరం లేని హీరోయిన్. సినిమాల్లో నటించడంతో పాటు బిగ్ బాస్‌లో కూడా మంచి గుర్తింపు సంపాదించుకుంది. చిన్న వయసులోనే నటన ప్రారంభించిన ఆమె తెలుగు, తమిళ, కన్నడ చిత్రాల్లో నటించింది. ‘ప్రేమ ఇష్క్ కాదల్’, ‘పడ్డానండి ప్రేమలో మరి’, ‘పెళ్లి సందD’ వంటి సినిమాలతో తెలుగు ప్రేక్షకులకు దగ్గరైంది. నటనతో పాటు ఫ్యాషన్, సోషల్ మీడియా కంటెంట్ ద్వారా కూడా తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది.

