వర్షం అంటే పిల్లలకు అమితమైన ఆనందం. వానలో తడవడం, నీటి గుంటల్లో ఆడుకోవడం, చల్లటి వాతావరణాన్ని ఆస్వాదించడం వారికి ఎంతో ఇష్టం. కానీ ఇదే కాలం పిల్లల ఆరోగ్యానికి పెద్ద సవాల్‌గా కూడా మారుతుంది. గాలిలో పెరిగిన తేమ, ఇంట్లో పేరుకునే బూజు, కలుషితమైన ఆహారం, అపరిశుభ్రమైన నీరు వంటి కారణాలతో వైరస్‌లు, బ్యాక్టీరియా వేగంగా వ్యాపించే అవకాశం ఉంటుంది. ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO) కూడా పరిశుభ్రమైన ఆహారం, సురక్షితమైన తాగునీరు, మంచి పరిశుభ్రత అలవాట్లతో చాలా వరకు ఇన్ఫెక్షన్లను నివారించవచ్చని సూచిస్తోంది. అందుకే ఈ సీజన్‌లో తల్లిదండ్రులు కొన్ని చిన్న జాగ్రత్తలు తీసుకుంటే పిల్లలను అనారోగ్యం నుంచి సులభంగా కాపాడుకోవచ్చని గుజరాత్ కు చెందిన వైద్యులు శుభమన్ చెబుతున్నారు. మా గుజరాత్ ప్రతినిధి కృష్ణ సాల్పురే సేకరించిన సమాచారం ప్రకారం.

