సేఫ్టీ విషయంలో కూడా హెక్టర్ స్టార్మ్ సిరీస్‌లో పలు ఫీచర్లు ఉన్నాయి. వీటిలో వీల్ వ్యూతో కూడిన 360 డిగ్రీల హెచ్డీ కెమెరా, ఏబీఎస్, ఈబీడీ, ఎలక్ట్రానిక్ స్టెబిలిటీ ప్రోగ్రామ్ (ఈఎస్పీ), ట్రాక్షన్ కంట్రోల్ సిస్టమ్ (టీసీఎస్), హిల్ హోల్డ్ కంట్రోల్, బ్రేక్ అసిస్ట్ ఉన్నాయి. ఇంజిన్ విషయానికి వస్తే, 1.5-లీటర్ టర్బో పెట్రోల్ ఇంజిన్ 143 పీఎస్ పవర్, 250 ఎన్ఎమ్ టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. దీంతో డ్రైవింగ్ సమయంలో మంచి రెస్పాన్స్, స్మూత్ పనితీరు లభించేలా ఈ కారు రూపొందించారు. భారతదేశపు తొలి ఇంటర్నెట్ కారుగా గుర్తింపు పొందిన MG హెక్టర్‌లో కనెక్టెడ్ టెక్నాలజీ, ప్రీమియం సౌకర్యాలు, SUV సామర్థ్యాలు కొనసాగుతున్నాయి. స్టార్మ్ ఎడిషన్లలో డ్యూయల్-పేన్ పనోరమిక్ సన్‌రూఫ్, 35.56 సెం.మీ. అంటే 14 అంగుళాల హెచ్డీ పోర్ట్రెయిట్ ఇన్ఫోటైన్మెంట్ స్క్రీన్, 8 రంగుల యాంబియంట్ మూడ్ లైటింగ్, అడ్వాన్స్డ్ డ్రైవర్ అసిస్టెన్స్ సిస్టమ్స్ (ఏడీఏఎస్), ఆటోమేటిక్ పవర్డ్ టెయిల్‌గేట్ ఉన్నాయి. (image: MG Motor India)

