ప్రభన్యూస్

Loan EMI: ఆర్‌బీఐ షాక్.. రెపో రేటు పెంపు! మీ ఈఎంఐ ఎంత పెరగనుందో తెలుసా? | బిజినెస్


Last Updated:

Repo Rate | ఆర్‌బీఐ కీలక నిర్ణయం తీసుకుంది. రెపో రేటును 25 బేసిస్ పాయింట్లు పెంచి 5.5 శాతానికి చేర్చింది. దీంతో హోమ్ లోన్, కార్ లోన్ తీసుకున్నవారిపై ఈఎంఐ భారం పెరిగే అవకాశం ఉంది. అదే సమయంలో డిపాజిట్లు, పొదుపులపై మెరుగైన వడ్డీ రాబడులు వచ్చే ఛాన్స్ కూడా ఉంది.

Loan EMI: ఆర్‌బీఐ షాక్.. రెపో రేటు పెంపు! మీ ఈఎంఐ ఎంత పెరగనుందో తెలుసా? (ప్రతీకాత్మక చిత్రం)
Loan EMI: ఆర్‌బీఐ షాక్.. రెపో రేటు పెంపు! మీ ఈఎంఐ ఎంత పెరగనుందో తెలుసా? (ప్రతీకాత్మక చిత్రం)

ఈ నిర్ణయం రుణాలు తీసుకునే వాళ్ల నుంచి పొదుపు చేసే వాళ్ల వరకు అందరిపైనా ప్రభావం చూపే అవకాశం ఉంది. ఆర్‌బీఐ రెపో రేటును 25 బేసిస్ పాయింట్లు పెంచి 5.5 శాతానికి చేర్చింది. 2023 ఫిబ్రవరి తర్వాత రెపో రేటు పెరగడం ఇదే తొలిసారి. మానిటరీ పాలసీ కమిటీ (ఎంపీసీ) వరుసగా 21 సమావేశాల్లో రెపో రేటును పెంచలేదు. ఇప్పుడు ఆర్‌బీఐ తీసుకున్న ఈ నిర్ణయం ద్రవ్యోల్బణం మళ్లీ పెరుగుతున్న పరిస్థితులు, ముడి చమురు ధరలు ఎక్కువగా ఉండటం, ప్రపంచ ఆర్థిక పరిస్థితులు కఠినంగా మారడం, రూపాయిపై ఒత్తిడి వంటి అంశాల మధ్య వచ్చింది. ఇంధన ఖర్చులు పెరగడం, ద్రవ్యోల్బణం ముప్పు కొనసాగుతుండటంతో ఆర్‌బీఐ ముందున్న పరిస్థితులు మరింత క్లిష్టంగా మారాయి.

రెపో రేటు పెంచితే ఏం జరుగుతుంది?

రెపో రేటు పెరిగితే బ్యాంకులు ఆర్‌బీఐ నుంచి డబ్బు తీసుకోవడం ఖరీదవుతుంది. దీంతో బ్యాంకులు తమపై పెరిగిన రుణ ఖర్చును కస్టమర్లకు బదిలీ చేసే అవకాశం ఉంటుంది. ఫలితంగా రుణాలపై వడ్డీ రేట్లు పెరగొచ్చు. దీని ప్రభావంతో హోమ్ లోన్స్, కార్ లోన్స్, ఇతర ఫ్లోటింగ్ రేట్ రుణాలపై వడ్డీ పెరగొచ్చు. దీంతో రుణం తీసుకున్న వాళ్ల ఈఎంఐలు కూడా పెరుగుతాయి. వడ్డీ రేట్లు పెరగడం వల్ల కొత్తగా రుణాలు తీసుకోవడం, ఖర్చు చేయడం తగ్గొచ్చు. చివరికి మార్కెట్‌లో డిమాండ్ తగ్గి ద్రవ్యోల్బణాన్ని అదుపులోకి తీసుకురావడానికి ఇది కొంతవరకు ఉపయోగపడొచ్చు.

ఇది కూడా చదవండి: OnePlus Offers: వన్‌ప్లస్ ఫ్యాన్స్‌కు పండగే… రూ.14,999కే ఫోన్! ఈ ఆఫర్లు మిస్ కావద్దు

ఉదాహరణకు, ఒక వ్యక్తి 20 ఏళ్ల కాలానికి రూ.50 లక్షల హోమ్ లోన్ తీసుకున్నారని అనుకుందాం. వడ్డీ రేటు 8.5 శాతంగా ఉంటే నెలకు ఈఎంఐ సుమారు రూ.43,400 ఉంటుంది. ఇప్పుడు ఆర్‌బీఐ రెపో రేటును 25 బేసిస్ పాయింట్లు పెంచింది. బ్యాంక్ ఆ పెంపును పూర్తిగా రుణగ్రహీతపై వేస్తే హోమ్ లోన్ వడ్డీ రేటు 8.75 శాతానికి పెరగొచ్చు. అప్పుడు నెలవారీ ఈఎంఐ సుమారు రూ.44,200 అవుతుంది. అంటే ప్రతి నెల దాదాపు రూ.800 అదనంగా చెల్లించాలి. ఏడాదికి ఇది దాదాపు రూ.9,600 అదనపు భారం అవుతుంది. అయితే అసలు ప్రభావం ఏ బ్యాంకులో రుణం తీసుకున్నారు, రుణం ఏ రకం, ఇంకా ఎంత మొత్తం బాకీ ఉంది, రుణ కాలపరిమితి ఎంత మిగిలింది అనే అంశాలపై ఆధారపడి ఉంటుంది.

మరోవైపు, వడ్డీ రేట్లు పెరగడం పొదుపు చేసేవాళ్లకు కొంత ప్రయోజనం కలిగించొచ్చు. డిపాజిట్లు, ఫిక్స్‌డ్ ఇన్‌కమ్ సాధనాలపై మెరుగైన రాబడులు వచ్చే అవకాశం ఉంటుంది. వ్యాపారాల విషయానికి వస్తే, రుణాలు తీసుకునే ఖర్చు పెరగొచ్చు. దీంతో మూలధన వ్యయం ఎక్కువై కొత్త పెట్టుబడులు పెట్టడం, వ్యాపారాన్ని విస్తరించే ప్రణాళికలపై ప్రభావం పడే అవకాశం ఉంటుంది. మార్కెట్లపై ప్రభావం మాత్రం ఒక్కలా ఉండదు. వడ్డీ రేట్ల మార్పులకు త్వరగా స్పందించే బ్యాంకింగ్, రియల్ ఎస్టేట్, ఆటోమొబైల్ రంగాలపై అధిక రుణ ఖర్చుల ప్రభావం కనిపించొచ్చు. మరోవైపు రూపాయి, బాండ్ మార్కెట్లు భవిష్యత్తులో వడ్డీ రేట్లపై ఆర్‌బీఐ ఇచ్చే సంకేతాలను నిశితంగా గమనిస్తాయి.

ఇది కూడా చదవండి: Solar Power: మీ ఇంటికి ఎంత కెపాసిటీ సోలార్ సరైనది? సబ్సిడీ ఎంతొస్తుంది?

25 బేసిస్ పాయింట్ల పెంపు ఇప్పటికే మార్కెట్లు కొంతవరకు అంచనా వేసిన నేపథ్యంలో, ఇక ముందు ఆర్‌బీఐ ఎంత వేగంగా, ఎంత స్థాయిలో వడ్డీ రేట్లను పెంచుతుందనే దానిపైనే అందరి దృష్టి ఉంది. ద్రవ్యోల్బణం, ఆర్థిక వృద్ధిపై ఆర్‌బీఐ అంచనాలు ఎలా ఉన్నాయి, బ్యాంకింగ్ వ్యవస్థలో ఉన్న అదనపు నగదు లిక్విడిటీని ఎలా నిర్వహించబోతోందన్న అంశాలను ఇన్వెస్టర్లు గమనించనున్నారు.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

×
prabhanews.co.in
Logo
Date of Publish : 07 October 2026, 10:26 am Digital Edition : Prabhanews
Loan EMI: ఆర్‌బీఐ షాక్.. రెపో రేటు పెంపు! మీ ఈఎంఐ ఎంత పెరగనుందో తెలుసా? | బిజినెస్

Last Updated:Oct 07, 2026 10:03 AM ISTRepo Rate | ఆర్‌బీఐ కీలక నిర్ణయం తీసుకుంది. రెపో రేటును 25 బేసిస్ పాయింట్లు పెంచి 5.5 శాతానికి చేర్చింది. దీంతో హోమ్ లోన్, కార్ లోన్ తీసుకున్నవారిపై ఈఎంఐ భారం పెరిగే అవకాశం ఉంది. అదే సమయంలో డిపాజిట్లు, పొదుపులపై మెరుగైన వడ్డీ రాబడులు వచ్చే ఛాన్స్ కూడా ఉంది.Loan EMI: ఆర్‌బీఐ షాక్.. రెపో రేటు పెంపు! మీ ఈఎంఐ ఎంత పెరగనుందో తెలుసా? (ప్రతీకాత్మక చిత్రం)ఈ నిర్ణయం రుణాలు తీసుకునే వాళ్ల నుంచి పొదుపు చేసే వాళ్ల వరకు అందరిపైనా ప్రభావం చూపే అవకాశం ఉంది. ఆర్‌బీఐ రెపో రేటును 25 బేసిస్ పాయింట్లు పెంచి 5.5 శాతానికి చేర్చింది. 2023 ఫిబ్రవరి తర్వాత రెపో రేటు పెరగడం ఇదే తొలిసారి. మానిటరీ పాలసీ కమిటీ (ఎంపీసీ) వరుసగా 21 సమావేశాల్లో రెపో రేటును పెంచలేదు. ఇప్పుడు ఆర్‌బీఐ తీసుకున్న ఈ నిర్ణయం ద్రవ్యోల్బణం మళ్లీ పెరుగుతున్న పరిస్థితులు, ముడి చమురు ధరలు ఎక్కువగా ఉండటం, ప్రపంచ ఆర్థిక పరిస్థితులు కఠినంగా మారడం, రూపాయిపై ఒత్తిడి వంటి అంశాల మధ్య వచ్చింది. ఇంధన ఖర్చులు పెరగడం, ద్రవ్యోల్బణం ముప్పు కొనసాగుతుండటంతో ఆర్‌బీఐ ముందున్న పరిస్థితులు మరింత క్లిష్టంగా మారాయి.రెపో రేటు పెంచితే ఏం జరుగుతుంది?రెపో రేటు పెరిగితే బ్యాంకులు ఆర్‌బీఐ నుంచి డబ్బు తీసుకోవడం ఖరీదవుతుంది. దీంతో బ్యాంకులు తమపై పెరిగిన రుణ ఖర్చును కస్టమర్లకు బదిలీ చేసే అవకాశం ఉంటుంది. ఫలితంగా రుణాలపై వడ్డీ రేట్లు పెరగొచ్చు. దీని ప్రభావంతో హోమ్ లోన్స్, కార్ లోన్స్, ఇతర ఫ్లోటింగ్ రేట్ రుణాలపై వడ్డీ పెరగొచ్చు. దీంతో రుణం తీసుకున్న వాళ్ల ఈఎంఐలు కూడా పెరుగుతాయి. వడ్డీ రేట్లు పెరగడం వల్ల కొత్తగా రుణాలు తీసుకోవడం, ఖర్చు చేయడం తగ్గొచ్చు. చివరికి మార్కెట్‌లో డిమాండ్ తగ్గి ద్రవ్యోల్బణాన్ని అదుపులోకి తీసుకురావడానికి ఇది కొంతవరకు ఉపయోగపడొచ్చు.ఇది కూడా చదవండి: OnePlus Offers: వన్‌ప్లస్ ఫ్యాన్స్‌కు పండగే... రూ.14,999కే ఫోన్! ఈ ఆఫర్లు మిస్ కావద్దుఉదాహరణకు, ఒక వ్యక్తి 20 ఏళ్ల కాలానికి రూ.50 లక్షల హోమ్ లోన్ తీసుకున్నారని అనుకుందాం. వడ్డీ రేటు 8.5 శాతంగా ఉంటే నెలకు ఈఎంఐ సుమారు రూ.43,400 ఉంటుంది. ఇప్పుడు ఆర్‌బీఐ రెపో రేటును 25 బేసిస్ పాయింట్లు పెంచింది. బ్యాంక్ ఆ పెంపును పూర్తిగా రుణగ్రహీతపై వేస్తే హోమ్ లోన్ వడ్డీ రేటు 8.75 శాతానికి పెరగొచ్చు. అప్పుడు నెలవారీ ఈఎంఐ సుమారు రూ.44,200 అవుతుంది. అంటే ప్రతి నెల దాదాపు రూ.800 అదనంగా చెల్లించాలి. ఏడాదికి ఇది దాదాపు రూ.9,600 అదనపు భారం అవుతుంది. అయితే అసలు ప్రభావం ఏ బ్యాంకులో రుణం తీసుకున్నారు, రుణం ఏ రకం, ఇంకా ఎంత మొత్తం బాకీ ఉంది, రుణ కాలపరిమితి ఎంత మిగిలింది అనే అంశాలపై ఆధారపడి ఉంటుంది.మరోవైపు, వడ్డీ రేట్లు పెరగడం పొదుపు చేసేవాళ్లకు కొంత ప్రయోజనం కలిగించొచ్చు. డిపాజిట్లు, ఫిక్స్‌డ్ ఇన్‌కమ్ సాధనాలపై మెరుగైన రాబడులు వచ్చే అవకాశం ఉంటుంది. వ్యాపారాల విషయానికి వస్తే, రుణాలు తీసుకునే ఖర్చు పెరగొచ్చు. దీంతో మూలధన వ్యయం ఎక్కువై కొత్త పెట్టుబడులు పెట్టడం, వ్యాపారాన్ని విస్తరించే ప్రణాళికలపై ప్రభావం పడే అవకాశం ఉంటుంది. మార్కెట్లపై ప్రభావం మాత్రం ఒక్కలా ఉండదు. వడ్డీ రేట్ల మార్పులకు త్వరగా స్పందించే బ్యాంకింగ్, రియల్ ఎస్టేట్, ఆటోమొబైల్ రంగాలపై అధిక రుణ ఖర్చుల ప్రభావం కనిపించొచ్చు. మరోవైపు రూపాయి, బాండ్ మార్కెట్లు భవిష్యత్తులో వడ్డీ రేట్లపై ఆర్‌బీఐ ఇచ్చే సంకేతాలను నిశితంగా గమనిస్తాయి.ఇది కూడా చదవండి: Solar Power: మీ ఇంటికి ఎంత కెపాసిటీ సోలార్ సరైనది? సబ్సిడీ ఎంతొస్తుంది?25 బేసిస్ పాయింట్ల పెంపు ఇప్పటికే మార్కెట్లు కొంతవరకు అంచనా వేసిన నేపథ్యంలో, ఇక ముందు ఆర్‌బీఐ ఎంత వేగంగా, ఎంత స్థాయిలో వడ్డీ రేట్లను పెంచుతుందనే దానిపైనే అందరి దృష్టి ఉంది. ద్రవ్యోల్బణం, ఆర్థిక వృద్ధిపై ఆర్‌బీఐ అంచనాలు ఎలా ఉన్నాయి, బ్యాంకింగ్ వ్యవస్థలో ఉన్న అదనపు నగదు లిక్విడిటీని ఎలా నిర్వహించబోతోందన్న అంశాలను ఇన్వెస్టర్లు గమనించనున్నారు.మరింత చదవండి

Source link