Last Updated:
Smriti Mandhana: టీమిండియా విమెన్స్ జట్టు న్యూ కెప్టెన్‌గా స్టార్ ఓపెనర్ స్మృతి మంధానను నియమించింది బీసీసీఐ. ఇప్పటివరకు కెప్టెన్‌గా ఉన్న హర్మన్‌ప్రీత్ కౌర్ మంగళవారం కెప్టెన్సీ నుంచి తప్పుకుంటున్నట్లుగా మంగళవారం ప్రకటించిన తర్వాత భారత క్రికెట్ నియంత్రణ మండలి తదుపరి కెప్టెన్‌గా స్మృతి మంధానను ప్రకటించింది.
Smriti Mandhana: టీమిండియా విమెన్స్ జట్టు న్యూ కెప్టెన్‌గా స్టార్ ఓపెనర్ స్మృతి మంధానను నియమించింది బీసీసీఐ. ఇప్పటివరకు కెప్టెన్‌గా ఉన్న హర్మన్‌ప్రీత్ కౌర్ మంగళవారం కెప్టెన్సీ నుంచి తప్పుకుంటున్నట్లుగా మంగళవారం ప్రకటించిన తర్వాత భారత క్రికెట్ నియంత్రణ మండలి తదుపరి కెప్టెన్‌గా స్మృతి మంధానను ప్రకటించింది. ఇకపై అన్నీ ఫార్మాట్లకు కెప్టెన్‌గా వైట్-బాల్ క్రికెట్‌కు పూర్తిస్థాయి కెప్టెన్‌గా మంధాన బాధ్యతలు కొనసాగనుంది.
టీమిండియా విమెన్ క్రికెట్ జట్టులో స్టార్ ఓపెన్ కాస్తా ఇప్పుడు జట్టు సారధిగా మారిపోయారు. 2013లో ఇంటర్‌ర్నేషనల్ క్రికెట్ టీంలోకి అడుగుపెట్టిన స్మృతి మందన అతి తక్కవ సమయంలోనే జట్టులో కీ ప్లేయర్‌గా మారిపోయింది. అటుపై ఆమె టాలెంట్ కారణంగానే ఇప్పుడు కెప్టెన్సీ బాధ్యతలు చేపట్టింది. అయితే స్మృతి మందనకు సారథ్య బాధ్యతలు కొత్తేమీ కాదు. గతంలో ఆమె 18 టీ20లు, నాలుగు వన్డే మ్యాచ్‌లలో భారత జట్టును ముందుండి నడిపించింది. దేశీయ, ఫ్రాంచైజీ క్రికెట్‌లోనూ ఆమె తన నాయకత్వ పటిమను నిరూపించుకుంది. ముఖ్యంగా ఉమెన్స్ ప్రీమియర్ లీగ్‌లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టును 2024, 2026 సంవత్సరాల్లో విజేతగా నిలిపి టైటిల్స్ అందించింది.
Honoured. Grateful. Ready. 💙
@mandhana_smriti reflects on the immense pride of becoming #TeamIndia Captain and carrying the legacy forward 🫡🇮🇳 https://t.co/qFooagUeJr— BCCI Women (@BCCIWomen) October 6, 2026
బీసీసీఐ తనకు జట్టు పగ్గాలు అప్పగించడంపై సంతోషం వ్యక్తం చేసింది స్మృతి మందన. భారత జట్టుకు నాయకత్వం వహించే అవకాశం లభించడం ఒక ప్రత్యేక గౌరవంగా భావిస్తున్నానంటూ రిప్లై ఇచ్చింది. తనపై నమ్మకం పెట్టుకున్న బీసీసీఐ, సెలక్టర్లు, సహచర క్రీడాకారిణులు, నాకు మద్దతుగా నిలిచిన ప్రతి ఒక్కరికీ కృతజ్ఞతలు అంటూ కామెంట్ పెట్టింది. కెప్టెన్‌గా హర్మన్‌ప్రీత్ అందించిన విశేష సేవలను నేను గౌరవిస్తున్నాను. ఈ బాధ్యతను సమర్థవంతంగా నిర్వర్తించి, భారత క్రికెట్‌ను మరిన్ని ఉన్నత శిఖరాలకు తీసుకెళ్లేందుకు నా వంతు కృషి చేస్తానంటూ ఓ నోట్ రిలీజ్ చేసింది.
స్మృతి మంధాన నియామకంపై బీసీసీఐ అధ్యక్షుడు మిథున్ మన్హాస్, కార్యదర్శి దేవజిత్ సైకియా హర్షం వ్యక్తం చేశారు. జట్టును విజయపథంలో నడిపించే సత్తా, అపార అనుభవం ఆమెకు ఉన్నాయని వారు విశ్వాసం వ్యక్తం చేశారు. గౌహతిలో జరిగిన సమీక్షా సమావేశం అనంతరం ఈ నిర్ణయం తీసుకున్నారు. త్వరలో ప్రారంభం కానున్న జింబాబ్వే సిరీస్‌తో స్మృతి మంధాన కెప్టెన్‌గా తన ప్రస్థానాన్ని ప్రారంభించనుంది.

