ప్రభన్యూస్

India Swiss Trade: భారత్–స్విట్జర్లాండ్ మైత్రిలో సరికొత్త అధ్యాయం.. రక్షణ, అణుశక్తి సహా 5 కీలక ఒప్పందాలు! |


100 బిలియన్ల పెట్టుబడులు.. 10 లక్షల ఉద్యోగాలు

యూరోపియన్ ఆర్థిక కూటమితో భారత్ కుదుర్చుకున్న మొట్టమొదటి వాణిజ్య ఒప్పందమైన టెపా (TEPA)ను ప్రధాని మోదీ ప్రశంసించారు. వచ్చే 15 ఏళ్లలో నాలుగు సభ్య దేశాల ద్వారా భారత్‌కు $100 బిలియన్ల (రూ. లక్షల కోట్ల) పెట్టుబడులు, 10 లక్షల ఉద్యోగాల కల్పనే లక్ష్యంగా ఇది ఒక ప్రతిష్టాత్మక బ్లూప్రింట్‌గా నిలుస్తుందని పేర్కొన్నారు.

స్విట్జర్లాండ్‌కు భారత వ్యవసాయ ఉత్పత్తులు, ఫార్మాస్యూటికల్స్, టెక్స్‌టైల్స్, ఇంజనీరింగ్ వస్తువుల ఎగుమతులను మరింత విస్తరించడానికి నిర్ణయాలు తీసుకున్నామని, అలాగే భారత్‌లోని బయోటెక్నాలజీ, లైఫ్ సైన్సెస్, బ్యాంకింగ్, బీమా, ఫుడ్ ప్రాసెసింగ్, సుస్థిర ఇంధన రంగాల్లోకి భారీగా స్విస్ పెట్టుబడులను ఆకర్షించేందుకు చర్యలు చేపట్టినట్లు సంయుక్త మీడియా సమావేశంలో మోదీ వెల్లడించారు.

నిపుణుల కోసం మొబిలిటీ ఒప్పందాలు

ఇరు దేశాల మధ్య ప్రతిభావంతులు, నిపుణుల రాకపోకలను ప్రోత్సహించేందుకు రెండు ప్రత్యేక ఒప్పందాలు కుదిరాయి.

వలసలు, మొబిలిటీ భాగస్వామ్యం (MoU): సమాన నిబంధనల ఆధారంగా వృత్తి నిపుణులకు వెసులుబాటు కల్పించడం, అక్రమ వలసలు, మానవ అక్రమ రవాణాను అరికట్టడం దీని ముఖ్య ఉద్దేశం. దీని కింద ఐదేళ్ల వరకు చెల్లుబాటు అయ్యే మల్టిపుల్ ఎంట్రీ వీసాలు (ప్రతి పర్యటనలో 6 నెలల వరకు ఉండే అవకాశం), పునరుద్ధరించుకోదగిన ఏడాది విద్యార్థి అనుమతులు లభిస్తాయి.

యువ నిపుణుల మార్పిడి (Young Professionals Exchange): ఇరు దేశాల యువ నిపుణులు తాత్కాలిక ఉద్యోగాలు చేస్తూ నైపుణ్యాలు, భాషా పరిజ్ఞానాన్ని పెంపొందించుకునేందుకు ఏటా 300 మందిని మార్పిడి చేసుకోవాలని నిర్ణయించారు (ఈ సంఖ్యను భవిష్యత్తులో 500కు పెంచే వీలుంది).

రక్షణ, అణుశక్తి రంగాల్లో సహకారం

ఇరు దేశాల భాగస్వామ్యంలో ఆవిష్కరణలు, మౌలిక సదుపాయాలు, అధునాతన సాంకేతికత కీలక స్తంభాలని ప్రధాని మోదీ పేర్కొన్నారు. “సైనిక మార్పిడి, రక్షణ రంగ ఉత్పత్తిలో సహకారానికి ఉన్న కొత్త అవకాశాలను నేడు గుర్తించాం. అణుశక్తి రంగంలోనూ పరస్పర సహకారాన్ని మరింత విస్తరించుకోవాలని నిర్ణయించుకున్నాం” అని ప్రధాని స్పష్టం చేశారు. అలాగే రోడ్లు, సొరంగాలు, రోప్‌వేలు, రైల్వేల వంటి భారత మౌలిక సదుపాయాల ప్రాజెక్టులలో భారీగా పెట్టుబడులు పెట్టాలని స్విస్ కంపెనీలను ఆయన ఆహ్వానించారు.

స్విస్ అధ్యక్షుడు పార్మెలిన్ మాట్లాడుతూ, ప్రపంచ వాణిజ్యం అనిశ్చితిగా ఉన్న ప్రస్తుత తరుణంలో నిరంతర వృద్ధిని నమోదు చేస్తున్న భారత్ వంటి భారీ మార్కెట్‌తో భాగస్వామ్యం ఇరు దేశాలకూ ఎంతో మేలు చేస్తుందన్నారు. పెట్టుబడులకు మరింత ప్రోత్సాహం లభించేలా ఇన్వెస్ట్‌‌మెంట్ ప్రొటెక్షన్ ఒప్పందం, మేధో సంపత్తి హక్కుల (IPR) రక్షణపై వేగంగా చర్యలు తీసుకోవాలని ఆయన సూచించారు.

మొత్తం 5 ఒప్పందాలు.. అంతర్జాతీయ పరిణామాలపై చర్చ

ఈ భేటీలో మొత్తం ఐదు ఒప్పందాలు కుదిరాయి.

1. వలసలు, మొబిలిటీ భాగస్వామ్య ఒప్పందం

2. యువ నిపుణుల మార్పిడి ఒప్పందం

3. రవాణా సాంకేతికతలు, ఎలక్ట్రిక్ వాహనాలు, రోప్‌వేలు, టన్నెల్స్ మరియు సుస్థిర మౌలిక వసతుల సహకార MoU

4. భారత్–స్విస్ పరిశోధక వర్గాల మధ్య దీర్ఘకాలిక సహకారానికి లెటర్ ఆఫ్ ఇంటెంట్ (LoI)

5, ఇన్నోవేషన్, సాంకేతిక బదిలీ, ఎంట్రప్రెన్యూర్‌షిప్ సహకారం కోసం ఇంప్లిమెంటేషన్ ఏర్పాట్లు.

ఉక్రెయిన్, పశ్చిమాసియా (మిడిల్ ఈస్ట్) యుద్ధ పరిణామాలపై కూడా ఇరు నేతలు చర్చించారు. భారత్ ఎల్లప్పుడూ చర్చలు, దౌత్యం ద్వారా శాంతి స్థాపనకే మొగ్గు చూపుతుందని మోదీ స్పష్టం చేశారు.

కాగా, EFTA కూటమిలో స్విట్జర్లాండ్ భారత్‌కు అతిపెద్ద వాణిజ్య భాగస్వామిగా కొనసాగుతోంది. ఇరు దేశాల మధ్య ద్వైపాక్షిక వాణిజ్యం $25 బిలియన్లుగా ఉండగా, భారత్‌లో సుమారు 340 స్విస్ కంపెనీలు $11 బిలియన్ల పెట్టుబడులతో కార్యకలాపాలు సాగిస్తున్నాయి. స్విట్జర్లాండ్‌లో దాదాపు 30,000 మంది భారతీయ నిపుణులు, విద్యార్థులు నివసిస్తున్నారు.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

×
prabhanews.co.in
Logo
Date of Publish : 06 October 2026, 10:53 am Digital Edition : Prabhanews
India Swiss Trade: భారత్–స్విట్జర్లాండ్ మైత్రిలో సరికొత్త అధ్యాయం.. రక్షణ, అణుశక్తి సహా 5 కీలక ఒప్పందాలు! |

100 బిలియన్ల పెట్టుబడులు.. 10 లక్షల ఉద్యోగాలుయూరోపియన్ ఆర్థిక కూటమితో భారత్ కుదుర్చుకున్న మొట్టమొదటి వాణిజ్య ఒప్పందమైన టెపా (TEPA)ను ప్రధాని మోదీ ప్రశంసించారు. వచ్చే 15 ఏళ్లలో నాలుగు సభ్య దేశాల ద్వారా భారత్‌కు $100 బిలియన్ల (రూ. లక్షల కోట్ల) పెట్టుబడులు, 10 లక్షల ఉద్యోగాల కల్పనే లక్ష్యంగా ఇది ఒక ప్రతిష్టాత్మక బ్లూప్రింట్‌గా నిలుస్తుందని పేర్కొన్నారు.స్విట్జర్లాండ్‌కు భారత వ్యవసాయ ఉత్పత్తులు, ఫార్మాస్యూటికల్స్, టెక్స్‌టైల్స్, ఇంజనీరింగ్ వస్తువుల ఎగుమతులను మరింత విస్తరించడానికి నిర్ణయాలు తీసుకున్నామని, అలాగే భారత్‌లోని బయోటెక్నాలజీ, లైఫ్ సైన్సెస్, బ్యాంకింగ్, బీమా, ఫుడ్ ప్రాసెసింగ్, సుస్థిర ఇంధన రంగాల్లోకి భారీగా స్విస్ పెట్టుబడులను ఆకర్షించేందుకు చర్యలు చేపట్టినట్లు సంయుక్త మీడియా సమావేశంలో మోదీ వెల్లడించారు.నిపుణుల కోసం మొబిలిటీ ఒప్పందాలుఇరు దేశాల మధ్య ప్రతిభావంతులు, నిపుణుల రాకపోకలను ప్రోత్సహించేందుకు రెండు ప్రత్యేక ఒప్పందాలు కుదిరాయి.వలసలు, మొబిలిటీ భాగస్వామ్యం (MoU): సమాన నిబంధనల ఆధారంగా వృత్తి నిపుణులకు వెసులుబాటు కల్పించడం, అక్రమ వలసలు, మానవ అక్రమ రవాణాను అరికట్టడం దీని ముఖ్య ఉద్దేశం. దీని కింద ఐదేళ్ల వరకు చెల్లుబాటు అయ్యే మల్టిపుల్ ఎంట్రీ వీసాలు (ప్రతి పర్యటనలో 6 నెలల వరకు ఉండే అవకాశం), పునరుద్ధరించుకోదగిన ఏడాది విద్యార్థి అనుమతులు లభిస్తాయి.యువ నిపుణుల మార్పిడి (Young Professionals Exchange): ఇరు దేశాల యువ నిపుణులు తాత్కాలిక ఉద్యోగాలు చేస్తూ నైపుణ్యాలు, భాషా పరిజ్ఞానాన్ని పెంపొందించుకునేందుకు ఏటా 300 మందిని మార్పిడి చేసుకోవాలని నిర్ణయించారు (ఈ సంఖ్యను భవిష్యత్తులో 500కు పెంచే వీలుంది).రక్షణ, అణుశక్తి రంగాల్లో సహకారంఇరు దేశాల భాగస్వామ్యంలో ఆవిష్కరణలు, మౌలిక సదుపాయాలు, అధునాతన సాంకేతికత కీలక స్తంభాలని ప్రధాని మోదీ పేర్కొన్నారు. "సైనిక మార్పిడి, రక్షణ రంగ ఉత్పత్తిలో సహకారానికి ఉన్న కొత్త అవకాశాలను నేడు గుర్తించాం. అణుశక్తి రంగంలోనూ పరస్పర సహకారాన్ని మరింత విస్తరించుకోవాలని నిర్ణయించుకున్నాం" అని ప్రధాని స్పష్టం చేశారు. అలాగే రోడ్లు, సొరంగాలు, రోప్‌వేలు, రైల్వేల వంటి భారత మౌలిక సదుపాయాల ప్రాజెక్టులలో భారీగా పెట్టుబడులు పెట్టాలని స్విస్ కంపెనీలను ఆయన ఆహ్వానించారు.స్విస్ అధ్యక్షుడు పార్మెలిన్ మాట్లాడుతూ, ప్రపంచ వాణిజ్యం అనిశ్చితిగా ఉన్న ప్రస్తుత తరుణంలో నిరంతర వృద్ధిని నమోదు చేస్తున్న భారత్ వంటి భారీ మార్కెట్‌తో భాగస్వామ్యం ఇరు దేశాలకూ ఎంతో మేలు చేస్తుందన్నారు. పెట్టుబడులకు మరింత ప్రోత్సాహం లభించేలా ఇన్వెస్ట్‌‌మెంట్ ప్రొటెక్షన్ ఒప్పందం, మేధో సంపత్తి హక్కుల (IPR) రక్షణపై వేగంగా చర్యలు తీసుకోవాలని ఆయన సూచించారు.మొత్తం 5 ఒప్పందాలు.. అంతర్జాతీయ పరిణామాలపై చర్చఈ భేటీలో మొత్తం ఐదు ఒప్పందాలు కుదిరాయి.1. వలసలు, మొబిలిటీ భాగస్వామ్య ఒప్పందం2. యువ నిపుణుల మార్పిడి ఒప్పందం3. రవాణా సాంకేతికతలు, ఎలక్ట్రిక్ వాహనాలు, రోప్‌వేలు, టన్నెల్స్ మరియు సుస్థిర మౌలిక వసతుల సహకార MoU4. భారత్–స్విస్ పరిశోధక వర్గాల మధ్య దీర్ఘకాలిక సహకారానికి లెటర్ ఆఫ్ ఇంటెంట్ (LoI)5, ఇన్నోవేషన్, సాంకేతిక బదిలీ, ఎంట్రప్రెన్యూర్‌షిప్ సహకారం కోసం ఇంప్లిమెంటేషన్ ఏర్పాట్లు.ఉక్రెయిన్, పశ్చిమాసియా (మిడిల్ ఈస్ట్) యుద్ధ పరిణామాలపై కూడా ఇరు నేతలు చర్చించారు. భారత్ ఎల్లప్పుడూ చర్చలు, దౌత్యం ద్వారా శాంతి స్థాపనకే మొగ్గు చూపుతుందని మోదీ స్పష్టం చేశారు.కాగా, EFTA కూటమిలో స్విట్జర్లాండ్ భారత్‌కు అతిపెద్ద వాణిజ్య భాగస్వామిగా కొనసాగుతోంది. ఇరు దేశాల మధ్య ద్వైపాక్షిక వాణిజ్యం $25 బిలియన్లుగా ఉండగా, భారత్‌లో సుమారు 340 స్విస్ కంపెనీలు $11 బిలియన్ల పెట్టుబడులతో కార్యకలాపాలు సాగిస్తున్నాయి. స్విట్జర్లాండ్‌లో దాదాపు 30,000 మంది భారతీయ నిపుణులు, విద్యార్థులు నివసిస్తున్నారు.

Source link