ప్రభన్యూస్

Sudigali Sudheer: సుడిగాలి సుధీర్‌ ‘G.O.A.T’ మూవీ రిలీజ్ డేట్ లాక్.. విడుదల ఎప్పుడంటే? | తెలుగు సినిమా వార్తలు


Last Updated:

ప్రముఖ హాస్య నటుడు, హీరో సుడిగాలి సుధీర్‌ కథానాయకుడిగా నటిస్తున్న తాజా చిత్రం ‘G.O.A.T’. ‘Greatest Of All Times’ అనేది ఈ సినిమా ఉపశీర్షిక. వేదవ్యాస్‌ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో దివ్యభారతి హీరోయిన్‌గా నటిస్తోంది.

News18
News18

ప్రముఖ హాస్య నటుడు, హీరో సుడిగాలి సుధీర్‌ కథానాయకుడిగా నటిస్తున్న తాజా చిత్రం ‘G.O.A.T’. ‘Greatest Of All Times’ అనేది ఈ సినిమా ఉపశీర్షిక. వేదవ్యాస్‌ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో దివ్యభారతి హీరోయిన్‌గా నటిస్తోంది. మహాతేజ క్రియేషన్స్‌, జైష్ణవ్‌ ప్రొడక్షన్స్‌ బ్యానర్లపై ఈ సినిమాను రూపొందిస్తున్నారు. చంద్రశేఖర్‌ రెడ్డి మొగుళ్ల నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. ప్రముఖ నిర్మాణ సంస్థ ఏషియన్‌ సినిమాస్‌ సమర్పణలో తెరకెక్కుతున్న ఈ చిత్రం నవంబర్‌ 12న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదల కానుంది.

సుడిగాలి సుధీర్‌ సినిమాల్లో తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకున్నారు. టెలివిజన్‌ నుంచి హీరోగా ఎదిగిన ఆయన, విభిన్నమైన కథలను ఎంచుకుంటూ ప్రేక్షకులను అలరిస్తున్నారు. ఇప్పుడు ‘G.O.A.T’ సినిమాతో మరోసారి ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు సిద్ధమవుతున్నారు. ఈ సినిమాపై ఇప్పటికే మంచి అంచనాలు ఏర్పడ్డాయి. ఇప్పటివరకు చిత్రబృందం విడుదల చేసిన పోస్టర్లు, గ్లింప్స్‌, ఇతర కంటెంట్‌కు ప్రేక్షకుల నుంచి మంచి స్పందన లభించినట్లు మేకర్స్‌ చెబుతున్నారు. త్వరలోనే ఈ సినిమా ట్రైలర్‌ను కూడా విడుదల చేసేందుకు చిత్రబృందం సన్నాహాలు చేస్తోంది.

‘G.O.A.T’ చిత్రాన్ని నిర్మాణ విలువల విషయంలో ఎక్కడా రాజీపడకుండా తెరకెక్కిస్తున్నామని నిర్మాత చంద్రశేఖర్‌ రెడ్డి మొగుళ్ల తెలిపారు. ప్రస్తుతం సినిమా నిర్మాణ పనులు జరుగుతున్నాయని, ప్రతి సన్నివేశాన్ని రిచ్‌గా చూపించేందుకు ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటున్నామని చెప్పారు. సాంకేతికంగా కూడా సినిమా ఉన్నత ప్రమాణాలతో ఉండేలా జాగ్రత్తలు తీసుకుంటున్నట్లు వెల్లడించారు.

సుడిగాలి సుధీర్‌ కెరీర్‌లో ‘G.O.A.T’ ఒక మైల్‌స్టోన్‌గా నిలుస్తుందని నిర్మాత ధీమా వ్యక్తం చేశారు. సినిమాలోని ప్రతి ఫ్రేమ్‌ ప్రేక్షకులను ఆకట్టుకునేలా ఉంటుందని తెలిపారు. పూర్తి కమర్షియల్‌ అంశాలతో తెరకెక్కుతున్న ఈ సినిమాలో నేటి యువతను ఆలోచింపజేసే ఓ మంచి అంశాన్ని కూడా చూపించనున్నట్లు చెప్పారు. అన్ని వర్గాల ప్రేక్షకులను అలరించేలా సినిమా ఉంటుందని, తప్పకుండా ప్రేక్షకులకు నచ్చుతుందనే నమ్మకం ఉందన్నారు.

ఈ సినిమాలో సుడిగాలి సుధీర్‌, దివ్యభారతితో పాటు సర్వధమన్‌ బెనర్జీ, నితిన్‌ ప్రసన్న, బ్రహ్మాజీ, పృథ్వీ, ఆడుకాలం నరేష్‌, రాజేంద్రన్‌, ఆనంద్‌ రామరాజ్‌, చమ్మక్‌ చంద్ర, పమ్మీ సాయి, నవీన్‌ నేని తదితరులు కీలక పాత్రల్లో నటిస్తున్నారు. కామెడీ, యాక్షన్‌, ఎమోషన్‌తో పాటు పూర్తి కమర్షియల్‌ అంశాలను మేళవించి ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నట్లు తెలుస్తోంది.

‘G.O.A.T’ సినిమాకు లియోన్‌ జేమ్స్‌ సంగీతం అందిస్తుండగా, మణిశర్మ నేపథ్య సంగీతాన్ని సమకూరుస్తున్నారు. రసూల్‌ ఎల్లోర్‌ సినిమాటోగ్రాఫర్‌గా పనిచేస్తున్నారు. సన్నీ కూరపాటి అదనపు డీఓపీగా వ్యవహరిస్తున్నారు. విజయ్‌ ముక్తవరపు ఎడిటర్‌గా, రాజీవ్‌ నాయర్‌ ప్రొడక్షన్‌ డిజైనర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. సమైరా రెడ్డి.ఎన్‌ కో-ప్రొడ్యూసర్‌గా, ప్రసూన మండవ క్రియేటివ్‌ ప్రొడ్యూసర్‌గా వ్యవహరిస్తున్నారు. వేదవ్యాస్‌ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రానికి చంద్రశేఖర్‌ మొగుళ్ల నిర్మాత.

ఇప్పటికే విడుదలైన కంటెంట్‌కు వస్తున్న స్పందనతో మంచి జోష్‌లో ఉన్న చిత్రబృందం, త్వరలో ట్రైలర్‌ను ప్రేక్షకుల ముందుకు తీసుకురానుంది. నవంబర్‌ 12న ‘G.O.A.T’ థియేటర్లలోకి రానుండటంతో సుడిగాలి సుధీర్‌ అభిమానులతో పాటు సినీ ప్రేక్షకుల్లోనూ సినిమాపై ఆసక్తి పెరుగుతోంది.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

×
prabhanews.co.in
Logo
Date of Publish : 02 October 2026, 12:02 am Digital Edition : Prabhanews
Sudigali Sudheer: సుడిగాలి సుధీర్‌ ‘G.O.A.T’ మూవీ రిలీజ్ డేట్ లాక్.. విడుదల ఎప్పుడంటే? | తెలుగు సినిమా వార్తలు

Last Updated:Oct 01, 2026 11:54 PM ISTప్రముఖ హాస్య నటుడు, హీరో సుడిగాలి సుధీర్‌ కథానాయకుడిగా నటిస్తున్న తాజా చిత్రం ‘G.O.A.T’. ‘Greatest Of All Times’ అనేది ఈ సినిమా ఉపశీర్షిక. వేదవ్యాస్‌ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో దివ్యభారతి హీరోయిన్‌గా నటిస్తోంది.News18ప్రముఖ హాస్య నటుడు, హీరో సుడిగాలి సుధీర్‌ కథానాయకుడిగా నటిస్తున్న తాజా చిత్రం ‘G.O.A.T’. ‘Greatest Of All Times’ అనేది ఈ సినిమా ఉపశీర్షిక. వేదవ్యాస్‌ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో దివ్యభారతి హీరోయిన్‌గా నటిస్తోంది. మహాతేజ క్రియేషన్స్‌, జైష్ణవ్‌ ప్రొడక్షన్స్‌ బ్యానర్లపై ఈ సినిమాను రూపొందిస్తున్నారు. చంద్రశేఖర్‌ రెడ్డి మొగుళ్ల నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. ప్రముఖ నిర్మాణ సంస్థ ఏషియన్‌ సినిమాస్‌ సమర్పణలో తెరకెక్కుతున్న ఈ చిత్రం నవంబర్‌ 12న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదల కానుంది.సుడిగాలి సుధీర్‌ సినిమాల్లో తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకున్నారు. టెలివిజన్‌ నుంచి హీరోగా ఎదిగిన ఆయన, విభిన్నమైన కథలను ఎంచుకుంటూ ప్రేక్షకులను అలరిస్తున్నారు. ఇప్పుడు ‘G.O.A.T’ సినిమాతో మరోసారి ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు సిద్ధమవుతున్నారు. ఈ సినిమాపై ఇప్పటికే మంచి అంచనాలు ఏర్పడ్డాయి. ఇప్పటివరకు చిత్రబృందం విడుదల చేసిన పోస్టర్లు, గ్లింప్స్‌, ఇతర కంటెంట్‌కు ప్రేక్షకుల నుంచి మంచి స్పందన లభించినట్లు మేకర్స్‌ చెబుతున్నారు. త్వరలోనే ఈ సినిమా ట్రైలర్‌ను కూడా విడుదల చేసేందుకు చిత్రబృందం సన్నాహాలు చేస్తోంది.‘G.O.A.T’ చిత్రాన్ని నిర్మాణ విలువల విషయంలో ఎక్కడా రాజీపడకుండా తెరకెక్కిస్తున్నామని నిర్మాత చంద్రశేఖర్‌ రెడ్డి మొగుళ్ల తెలిపారు. ప్రస్తుతం సినిమా నిర్మాణ పనులు జరుగుతున్నాయని, ప్రతి సన్నివేశాన్ని రిచ్‌గా చూపించేందుకు ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటున్నామని చెప్పారు. సాంకేతికంగా కూడా సినిమా ఉన్నత ప్రమాణాలతో ఉండేలా జాగ్రత్తలు తీసుకుంటున్నట్లు వెల్లడించారు.సుడిగాలి సుధీర్‌ కెరీర్‌లో ‘G.O.A.T’ ఒక మైల్‌స్టోన్‌గా నిలుస్తుందని నిర్మాత ధీమా వ్యక్తం చేశారు. సినిమాలోని ప్రతి ఫ్రేమ్‌ ప్రేక్షకులను ఆకట్టుకునేలా ఉంటుందని తెలిపారు. పూర్తి కమర్షియల్‌ అంశాలతో తెరకెక్కుతున్న ఈ సినిమాలో నేటి యువతను ఆలోచింపజేసే ఓ మంచి అంశాన్ని కూడా చూపించనున్నట్లు చెప్పారు. అన్ని వర్గాల ప్రేక్షకులను అలరించేలా సినిమా ఉంటుందని, తప్పకుండా ప్రేక్షకులకు నచ్చుతుందనే నమ్మకం ఉందన్నారు.ఈ సినిమాలో సుడిగాలి సుధీర్‌, దివ్యభారతితో పాటు సర్వధమన్‌ బెనర్జీ, నితిన్‌ ప్రసన్న, బ్రహ్మాజీ, పృథ్వీ, ఆడుకాలం నరేష్‌, రాజేంద్రన్‌, ఆనంద్‌ రామరాజ్‌, చమ్మక్‌ చంద్ర, పమ్మీ సాయి, నవీన్‌ నేని తదితరులు కీలక పాత్రల్లో నటిస్తున్నారు. కామెడీ, యాక్షన్‌, ఎమోషన్‌తో పాటు పూర్తి కమర్షియల్‌ అంశాలను మేళవించి ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నట్లు తెలుస్తోంది.‘G.O.A.T’ సినిమాకు లియోన్‌ జేమ్స్‌ సంగీతం అందిస్తుండగా, మణిశర్మ నేపథ్య సంగీతాన్ని సమకూరుస్తున్నారు. రసూల్‌ ఎల్లోర్‌ సినిమాటోగ్రాఫర్‌గా పనిచేస్తున్నారు. సన్నీ కూరపాటి అదనపు డీఓపీగా వ్యవహరిస్తున్నారు. విజయ్‌ ముక్తవరపు ఎడిటర్‌గా, రాజీవ్‌ నాయర్‌ ప్రొడక్షన్‌ డిజైనర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. సమైరా రెడ్డి.ఎన్‌ కో-ప్రొడ్యూసర్‌గా, ప్రసూన మండవ క్రియేటివ్‌ ప్రొడ్యూసర్‌గా వ్యవహరిస్తున్నారు. వేదవ్యాస్‌ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రానికి చంద్రశేఖర్‌ మొగుళ్ల నిర్మాత.ఇప్పటికే విడుదలైన కంటెంట్‌కు వస్తున్న స్పందనతో మంచి జోష్‌లో ఉన్న చిత్రబృందం, త్వరలో ట్రైలర్‌ను ప్రేక్షకుల ముందుకు తీసుకురానుంది. నవంబర్‌ 12న ‘G.O.A.T’ థియేటర్లలోకి రానుండటంతో సుడిగాలి సుధీర్‌ అభిమానులతో పాటు సినీ ప్రేక్షకుల్లోనూ సినిమాపై ఆసక్తి పెరుగుతోంది.మరింత చదవండి

Source link