ప్రభన్యూస్

Top 10 News: గల్లీ నుంచి ఢిల్లీ వరకు.. నేటి టాప్ 10 వార్తలు మీకోసం | తెలంగాణ వార్తలు


బీఆర్ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌, సీఎం రేవంత్‌రెడ్డి కుటుంబ ఆస్తులతో పాటు తమ కుటుంబ ఆస్తులపైనా విచారణ జరపాలని డిమాండ్‌ చేశారు.

సుప్రీంకోర్టు లేదా హైకోర్టు సిట్టింగ్‌ జడ్జితో దర్యాప్తు నిర్వహించాలని ఆయన కోరారు. విచారణలో తమ తప్పు తేలితే ఎలాంటి శిక్షకైనా సిద్ధమని కేటీఆర్‌ ప్రకటించారు. తాను 2006లో హోటల్‌ వ్యాపారం ప్రారంభించానని, ప్రస్తుతం మూడు హోటళ్లు ఉన్నాయని తెలిపారు. తన ఆస్తుల వివరాలన్నీ ఎన్నికల అఫిడవిట్లలో వెల్లడించానని, వ్యాపారం చేయడం తప్పా అని ప్రశ్నిస్తూ, తనపై వచ్చిన విమర్శలను ఖండించారు.

2.ఖైరతాబాద్ ఉపఎన్నిక నోటిఫికేషన్ నిలిపివేయాలి..!

దివంగత మాజీ మంత్రి పి. జనార్దన్‌ రెడ్డి కుమార్తె విజయారెడ్డి ఎన్నికల అఫిడవిట్‌లో దానం నాగేందర్‌ తప్పుడు సమాచారం ఇచ్చారని లంచ్‌ మోషన్‌ పిటిషన్‌ దాఖలు చేశారు. విజయారెడ్డి తరఫు న్యాయవాది, 2024 ఎన్నికల్లో దానం నాగేందర్‌ విజయాన్ని సవాల్‌ చేస్తూ దాఖలైన ఎన్నికల పిటిషన్‌ ఇంకా కోర్టులో పెండింగ్‌లో ఉందని తెలిపారు. ఈ అంశంపై తుది తీర్పు వెలువడే వరకు ఖైరతాబాద్‌ ఉపఎన్నిక నోటిఫికేషన్‌ జారీ చేయవద్దని కోర్టును కోరారు. పిటిషన్‌పై వాదనలు విన్న తెలంగాణ హైకోర్టు, ప్రతివాదులు కౌంటర్‌ అఫిడవిట్‌ దాఖలు చేయాలని ఆదేశించింది. అనంతరం కేసు తదుపరి విచారణను మంగళవారానికి వాయిదా వేసింది.

3.ఎల్‌నినో పరిస్థితులపై తెలంగాణ కేబినెట్‌లో చర్చ

తెలంగాణలో 235 మండలాల్లో కరువు పరిస్థితులు ఉన్నట్లు అధికారులు నివేదించగా, దీనిపై కేబినెట్‌ సబ్‌కమిటీలో చర్చించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఎల్‌నినో ప్రభావం, ఉపశమన చర్యలపై సూచనలు స్వీకరించేందుకు త్వరలో అఖిలపక్ష సమావేశం నిర్వహించాలని సీఎం రేవంత్‌రెడ్డి సూచించారు. కరువు మండలాలను అధికారికంగా ప్రకటించడంతో పాటు కేంద్ర సాయం కోరాలని కేబినెట్‌ నిర్ణయించింది. రాష్ట్ర పరిస్థితులను కేంద్రమంత్రులకు వివరించాలని సీఎం రేవంత్‌రెడ్డి అధికారులను ఆదేశించారు.

4. రైతులకు 8 గంటల కరెంట్ కూడా ఇవ్వడంలేదు-హరీష్‌రావు

విద్యుత్‌ సమస్యలపై బీఆర్‌ఎస్‌ నేత హరీశ్‌రావు ప్రభుత్వాన్ని విమర్శించారు. సీఎం గాల్లో పర్యటనలు చేస్తుంటే ప్రజల వాస్తవ సమస్యలు ఎలా తెలుస్తాయని ప్రశ్నించారు. బీఆర్‌ఎస్‌ హయాంలో రెండు గంటల కరెంట్‌ అంతరాయం వచ్చినా స్పందించిన కోమటిరెడ్డి వెంకటరెడ్డి, ఇప్పుడు విద్యుత్‌ సమస్యలపై ఎందుకు సమీక్షలు నిర్వహించడం లేదని నిలదీశారు. రాష్ట్రంలో నెలకొన్న పరిస్థితులు ప్రభుత్వ వైఫల్యానికి నిదర్శనమని హరీశ్‌రావు వ్యాఖ్యానించారు.

5. ఏపీ రోడ్లకు డాక్టర్లు.. గొడ్డలిపార్టీ బీసీ రిజర్వేషన్లను అడ్డుకుంటోంది

ఏపీ స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించిన పలు పిటిషన్లపై విచారణ జరిపిన హైకోర్టు కీలక నిర్ణయం తీసుకుంది. బీసీలకు 34 శాతం రిజర్వేషన్లు కల్పించడం వల్ల మొత్తం రిజర్వేషన్లు 50 శాతం దాటుతున్నాయని పేర్కొంటూ సంబంధిత జీవోలను రద్దు చేసింది.దీనిపై స్పందించిన సీఎం నారా చంద్రబాబు నాయుడు, బీసీలకు నష్టం జరగకుండా సుప్రీంకోర్టును ఆశ్రయిస్తామని తెలిపారు. బాపట్ల జిల్లా రేపల్లెలో జరిగిన ప్రజావేదిక సభలో మాట్లాడుతూ,డీఎస్సీ నియామకాల విషయంలోనూ అనవసర అడ్డంకులు సృష్టించారని ఆయన ఆరోపించారు. అలాగే రాష్ట్రంలో రహదారులను ఒకరు పర్యవేక్షిస్తూ, మరమ్మతులు, అభివృద్ధి పనులను నిరంతరం కొనసాగిస్తున్నామని అన్నారు.

6.జ్ఞానేశ్‌ రాజీనామా చేసే వరకు నిరసనలు చేస్తాం

కాక్రోచ్ జనతా పార్టీ ప్రధాన ఎన్నికల కమిషనర్‌ జ్ఞానేశ్‌ కుమార్‌ రాజీనామా కోరుతూ దేశవ్యాప్త నిరసనలకు పిలుపునిచ్చింది. అక్టోబర్‌ 2 నుంచి ఈ ఆందోళనలు ప్రారంభమవుతాయని పార్టీ వ్యవస్థాపకుడు అభిజీత్‌ దీప్కే తెలిపారు. జ్ఞానేశ్‌ కుమార్‌ రాజీనామా చేసే వరకు ఉద్యమం కొనసాగుతుందని ఆయన పేర్కొన్నారు.

సీఈసీపై క్రిమినల్‌ కేసు నమోదు చేయాలని, నియామక ప్రక్రియలో పారదర్శకత పెంచాలని డిమాండ్‌ చేశారు. ఎన్నికల వ్యవస్థలో పౌర సమాజానికి మరింత భాగస్వామ్యం కల్పించాలని కోరారు.

7. మమతకు ఇప్పుడు కాంగ్రెస్‌ అవసరమొచ్చింది..!

ఇండియా కూటమి సమావేశంలో సోనియా గాంధీ, మమతా బెనర్జీ స్నేహపూర్వకంగా మెలిగారు. మూడున్నర గంటలపాటు జరిగిన సమావేశంలో ఇద్దరూ పక్కపక్కనే కూర్చొని చర్చలు జరిపారు.ఈ దృశ్యాలకు సంబంధించిన వీడియోను కాంగ్రెస్‌ పార్టీ విడుదల చేస్తూ, కలిసి పోరాడే నాయకులు ఒకరినొకరు గౌరవిస్తారని వ్యాఖ్యానించింది.ఇండియా కూటమి సమావేశంలో మమతా బెనర్జీ పాల్గొనడాన్ని కాంగ్రెస్‌ నేత అధీర్‌ రంజన్‌ చౌధరీ విమర్శించారు. తన పార్టీ బలహీనపడటంతో మమతా బెనర్జీకి ఇప్పుడు కాంగ్రెస్‌ అవసరమైందని వ్యాఖ్యానించారు. గతంలో రాహుల్‌ గాంధీ నాయకత్వాన్ని వ్యతిరేకించిన పలువురు నేతలు, ప్రస్తుతం ఆయన నాయకత్వాన్ని అంగీకరిస్తున్నారని అన్నారు.

8.ఇళయరాజాకు సుప్రీంకోర్టులో షాక్

1980లో విడుదలైన ‘మూడు పాని’ చిత్రంలోని ‘ఎన్ ఇనియ పొన్ నిలవే’ పాటను ‘అఘతియా’ సినిమాలో రీక్రియేట్‌ చేయడంపై ఇళయరాజా అభ్యంతరం వ్యక్తం చేశారు. తన అనుమతి లేకుండానే పాటను ఉపయోగించారని ఆరోపిస్తూ ఆయన కోర్టును ఆశ్రయించారు. అదే సమయంలో, ఆ పాటల కాపీరైట్‌ హక్కులు తమవేనని సరిగమ సంస్థ కూడా కోర్టులో పిటిషన్‌ దాఖలు చేసింది.ఈ వివాదంపై దిల్లీ హైకోర్టు గతంలో స్టే విధించగా, ఆ నిర్ణయాన్ని సవాలు చేస్తూ ఇళయరాజా సుప్రీంకోర్టును ఆశ్రయించారు. ‘సరిగమ’ మ్యూజిక్‌ లేబుల్‌కు అనుకూలంగా దిల్లీ హైకోర్టు ఇచ్చిన ఉత్తర్వులను సుప్రీంకోర్టు సమర్థించింది.

9.కెప్టెన్ మచ్చర్‌ ఓ హీరో- ట్రంప్

ఫ్లైదుబాయ్ విమాన ఘటనలో గాయపడిన భారత పైలట్ కెప్టెన్ స్మిత్ మచ్చర్‌ను తదుపరి చికిత్స కోసం యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్‌కు ఎయిర్‌లిఫ్ట్ చేశారు. కెప్టెన్ స్మిత్ ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందని సౌదీలోని భారత రాయబార కార్యాలయం వెల్లడించింది. ఇదిలాఉంటే ప్రధాని నరేంద్ర మోదీ ఎక్స్‌ వేదికగా ఆయనను నిజమైన హీరోగా అభివర్ణించారు. ఆయన సాహసానికి గుర్తింపుగా రాష్ట్ర ప్రభుత్వం ‘విశిష్ట గుజరాత్ గరిమా అవార్డు’ను ప్రకటించింది. డొనాల్డ్ ట్రంప్, తీవ్ర గాయాలపాలైనా సమయస్ఫూర్తితో వ్యవహరించి ఆయన నిజమైన హీరోగా నిలిచారని వ్యాఖ్యానించారు. ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు స్మిత్ ర్ ధైర్యానికి సెల్యూట్ చేస్తూ, ఆయన త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. ఆయన సేవలను దేశవ్యాప్తంగా పలువురు ప్రముఖులు కొనియాడుతున్నారు.

10.అణు పరీక్షలను గుర్తించే అమెరికా కొత్త టెక్నాలజీ

అణు పరీక్షలను మరింత కచ్చితంగా గుర్తించేందుకు అమెరికా నెవాడా నేషనల్ సెక్యూరిటీ సైట్‌లో కొత్త ప్రయోగం నిర్వహించింది. అణుయేతర రసాయనిక పేలుడు పదార్థాలు, రేడియోట్రేసర్లతో ఈ పరీక్ష చేపట్టారు. తక్కువ స్థాయి అణు విస్ఫోటనాలను గుర్తించే కంప్యూటర్ అల్గారిథమ్‌లను మెరుగుపరచడమే ప్రధాన లక్ష్యం. భూగర్భ గుహలు, టన్నెల్స్ ఉపయోగించి రహస్యంగా నిర్వహించే అణు పరీక్షలను గుర్తించే సామర్థ్యాన్ని పెంచేందుకు ఈ ప్రయోగం ఉపయోగపడనుంది. ఇరాన్, చైనా వంటి దేశాలపై గతంలో వచ్చిన రహస్య అణు పరీక్షల ఆరోపణల నేపథ్యంలో ఈ ప్రయోగం ప్రాధాన్యం సంతరించుకుంది.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

×
prabhanews.co.in
Logo
Date of Publish : 01 October 2026, 8:09 pm Digital Edition : Prabhanews
Top 10 News: గల్లీ నుంచి ఢిల్లీ వరకు.. నేటి టాప్ 10 వార్తలు మీకోసం | తెలంగాణ వార్తలు

బీఆర్ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌, సీఎం రేవంత్‌రెడ్డి కుటుంబ ఆస్తులతో పాటు తమ కుటుంబ ఆస్తులపైనా విచారణ జరపాలని డిమాండ్‌ చేశారు.సుప్రీంకోర్టు లేదా హైకోర్టు సిట్టింగ్‌ జడ్జితో దర్యాప్తు నిర్వహించాలని ఆయన కోరారు. విచారణలో తమ తప్పు తేలితే ఎలాంటి శిక్షకైనా సిద్ధమని కేటీఆర్‌ ప్రకటించారు. తాను 2006లో హోటల్‌ వ్యాపారం ప్రారంభించానని, ప్రస్తుతం మూడు హోటళ్లు ఉన్నాయని తెలిపారు. తన ఆస్తుల వివరాలన్నీ ఎన్నికల అఫిడవిట్లలో వెల్లడించానని, వ్యాపారం చేయడం తప్పా అని ప్రశ్నిస్తూ, తనపై వచ్చిన విమర్శలను ఖండించారు.2.ఖైరతాబాద్ ఉపఎన్నిక నోటిఫికేషన్ నిలిపివేయాలి..!దివంగత మాజీ మంత్రి పి. జనార్దన్‌ రెడ్డి కుమార్తె విజయారెడ్డి ఎన్నికల అఫిడవిట్‌లో దానం నాగేందర్‌ తప్పుడు సమాచారం ఇచ్చారని లంచ్‌ మోషన్‌ పిటిషన్‌ దాఖలు చేశారు. విజయారెడ్డి తరఫు న్యాయవాది, 2024 ఎన్నికల్లో దానం నాగేందర్‌ విజయాన్ని సవాల్‌ చేస్తూ దాఖలైన ఎన్నికల పిటిషన్‌ ఇంకా కోర్టులో పెండింగ్‌లో ఉందని తెలిపారు. ఈ అంశంపై తుది తీర్పు వెలువడే వరకు ఖైరతాబాద్‌ ఉపఎన్నిక నోటిఫికేషన్‌ జారీ చేయవద్దని కోర్టును కోరారు. పిటిషన్‌పై వాదనలు విన్న తెలంగాణ హైకోర్టు, ప్రతివాదులు కౌంటర్‌ అఫిడవిట్‌ దాఖలు చేయాలని ఆదేశించింది. అనంతరం కేసు తదుపరి విచారణను మంగళవారానికి వాయిదా వేసింది.3.ఎల్‌నినో పరిస్థితులపై తెలంగాణ కేబినెట్‌లో చర్చ తెలంగాణలో 235 మండలాల్లో కరువు పరిస్థితులు ఉన్నట్లు అధికారులు నివేదించగా, దీనిపై కేబినెట్‌ సబ్‌కమిటీలో చర్చించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఎల్‌నినో ప్రభావం, ఉపశమన చర్యలపై సూచనలు స్వీకరించేందుకు త్వరలో అఖిలపక్ష సమావేశం నిర్వహించాలని సీఎం రేవంత్‌రెడ్డి సూచించారు. కరువు మండలాలను అధికారికంగా ప్రకటించడంతో పాటు కేంద్ర సాయం కోరాలని కేబినెట్‌ నిర్ణయించింది. రాష్ట్ర పరిస్థితులను కేంద్రమంత్రులకు వివరించాలని సీఎం రేవంత్‌రెడ్డి అధికారులను ఆదేశించారు.4. రైతులకు 8 గంటల కరెంట్ కూడా ఇవ్వడంలేదు-హరీష్‌రావు విద్యుత్‌ సమస్యలపై బీఆర్‌ఎస్‌ నేత హరీశ్‌రావు ప్రభుత్వాన్ని విమర్శించారు. సీఎం గాల్లో పర్యటనలు చేస్తుంటే ప్రజల వాస్తవ సమస్యలు ఎలా తెలుస్తాయని ప్రశ్నించారు. బీఆర్‌ఎస్‌ హయాంలో రెండు గంటల కరెంట్‌ అంతరాయం వచ్చినా స్పందించిన కోమటిరెడ్డి వెంకటరెడ్డి, ఇప్పుడు విద్యుత్‌ సమస్యలపై ఎందుకు సమీక్షలు నిర్వహించడం లేదని నిలదీశారు. రాష్ట్రంలో నెలకొన్న పరిస్థితులు ప్రభుత్వ వైఫల్యానికి నిదర్శనమని హరీశ్‌రావు వ్యాఖ్యానించారు.5. ఏపీ రోడ్లకు డాక్టర్లు.. గొడ్డలిపార్టీ బీసీ రిజర్వేషన్లను అడ్డుకుంటోందిఏపీ స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించిన పలు పిటిషన్లపై విచారణ జరిపిన హైకోర్టు కీలక నిర్ణయం తీసుకుంది. బీసీలకు 34 శాతం రిజర్వేషన్లు కల్పించడం వల్ల మొత్తం రిజర్వేషన్లు 50 శాతం దాటుతున్నాయని పేర్కొంటూ సంబంధిత జీవోలను రద్దు చేసింది.దీనిపై స్పందించిన సీఎం నారా చంద్రబాబు నాయుడు, బీసీలకు నష్టం జరగకుండా సుప్రీంకోర్టును ఆశ్రయిస్తామని తెలిపారు. బాపట్ల జిల్లా రేపల్లెలో జరిగిన ప్రజావేదిక సభలో మాట్లాడుతూ,డీఎస్సీ నియామకాల విషయంలోనూ అనవసర అడ్డంకులు సృష్టించారని ఆయన ఆరోపించారు. అలాగే రాష్ట్రంలో రహదారులను ఒకరు పర్యవేక్షిస్తూ, మరమ్మతులు, అభివృద్ధి పనులను నిరంతరం కొనసాగిస్తున్నామని అన్నారు.6.జ్ఞానేశ్‌ రాజీనామా చేసే వరకు నిరసనలు చేస్తాం కాక్రోచ్ జనతా పార్టీ ప్రధాన ఎన్నికల కమిషనర్‌ జ్ఞానేశ్‌ కుమార్‌ రాజీనామా కోరుతూ దేశవ్యాప్త నిరసనలకు పిలుపునిచ్చింది. అక్టోబర్‌ 2 నుంచి ఈ ఆందోళనలు ప్రారంభమవుతాయని పార్టీ వ్యవస్థాపకుడు అభిజీత్‌ దీప్కే తెలిపారు. జ్ఞానేశ్‌ కుమార్‌ రాజీనామా చేసే వరకు ఉద్యమం కొనసాగుతుందని ఆయన పేర్కొన్నారు.సీఈసీపై క్రిమినల్‌ కేసు నమోదు చేయాలని, నియామక ప్రక్రియలో పారదర్శకత పెంచాలని డిమాండ్‌ చేశారు. ఎన్నికల వ్యవస్థలో పౌర సమాజానికి మరింత భాగస్వామ్యం కల్పించాలని కోరారు.7. మమతకు ఇప్పుడు కాంగ్రెస్‌ అవసరమొచ్చింది..! ఇండియా కూటమి సమావేశంలో సోనియా గాంధీ, మమతా బెనర్జీ స్నేహపూర్వకంగా మెలిగారు. మూడున్నర గంటలపాటు జరిగిన సమావేశంలో ఇద్దరూ పక్కపక్కనే కూర్చొని చర్చలు జరిపారు.ఈ దృశ్యాలకు సంబంధించిన వీడియోను కాంగ్రెస్‌ పార్టీ విడుదల చేస్తూ, కలిసి పోరాడే నాయకులు ఒకరినొకరు గౌరవిస్తారని వ్యాఖ్యానించింది.ఇండియా కూటమి సమావేశంలో మమతా బెనర్జీ పాల్గొనడాన్ని కాంగ్రెస్‌ నేత అధీర్‌ రంజన్‌ చౌధరీ విమర్శించారు. తన పార్టీ బలహీనపడటంతో మమతా బెనర్జీకి ఇప్పుడు కాంగ్రెస్‌ అవసరమైందని వ్యాఖ్యానించారు. గతంలో రాహుల్‌ గాంధీ నాయకత్వాన్ని వ్యతిరేకించిన పలువురు నేతలు, ప్రస్తుతం ఆయన నాయకత్వాన్ని అంగీకరిస్తున్నారని అన్నారు.8.ఇళయరాజాకు సుప్రీంకోర్టులో షాక్1980లో విడుదలైన ‘మూడు పాని’ చిత్రంలోని ‘ఎన్ ఇనియ పొన్ నిలవే’ పాటను ‘అఘతియా’ సినిమాలో రీక్రియేట్‌ చేయడంపై ఇళయరాజా అభ్యంతరం వ్యక్తం చేశారు. తన అనుమతి లేకుండానే పాటను ఉపయోగించారని ఆరోపిస్తూ ఆయన కోర్టును ఆశ్రయించారు. అదే సమయంలో, ఆ పాటల కాపీరైట్‌ హక్కులు తమవేనని సరిగమ సంస్థ కూడా కోర్టులో పిటిషన్‌ దాఖలు చేసింది.ఈ వివాదంపై దిల్లీ హైకోర్టు గతంలో స్టే విధించగా, ఆ నిర్ణయాన్ని సవాలు చేస్తూ ఇళయరాజా సుప్రీంకోర్టును ఆశ్రయించారు. ‘సరిగమ’ మ్యూజిక్‌ లేబుల్‌కు అనుకూలంగా దిల్లీ హైకోర్టు ఇచ్చిన ఉత్తర్వులను సుప్రీంకోర్టు సమర్థించింది.9.కెప్టెన్ మచ్చర్‌ ఓ హీరో- ట్రంప్ ఫ్లైదుబాయ్ విమాన ఘటనలో గాయపడిన భారత పైలట్ కెప్టెన్ స్మిత్ మచ్చర్‌ను తదుపరి చికిత్స కోసం యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్‌కు ఎయిర్‌లిఫ్ట్ చేశారు. కెప్టెన్ స్మిత్ ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందని సౌదీలోని భారత రాయబార కార్యాలయం వెల్లడించింది. ఇదిలాఉంటే ప్రధాని నరేంద్ర మోదీ ఎక్స్‌ వేదికగా ఆయనను నిజమైన హీరోగా అభివర్ణించారు. ఆయన సాహసానికి గుర్తింపుగా రాష్ట్ర ప్రభుత్వం ‘విశిష్ట గుజరాత్ గరిమా అవార్డు’ను ప్రకటించింది. డొనాల్డ్ ట్రంప్, తీవ్ర గాయాలపాలైనా సమయస్ఫూర్తితో వ్యవహరించి ఆయన నిజమైన హీరోగా నిలిచారని వ్యాఖ్యానించారు. ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు స్మిత్ ర్ ధైర్యానికి సెల్యూట్ చేస్తూ, ఆయన త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. ఆయన సేవలను దేశవ్యాప్తంగా పలువురు ప్రముఖులు కొనియాడుతున్నారు.10.అణు పరీక్షలను గుర్తించే అమెరికా కొత్త టెక్నాలజీ అణు పరీక్షలను మరింత కచ్చితంగా గుర్తించేందుకు అమెరికా నెవాడా నేషనల్ సెక్యూరిటీ సైట్‌లో కొత్త ప్రయోగం నిర్వహించింది. అణుయేతర రసాయనిక పేలుడు పదార్థాలు, రేడియోట్రేసర్లతో ఈ పరీక్ష చేపట్టారు. తక్కువ స్థాయి అణు విస్ఫోటనాలను గుర్తించే కంప్యూటర్ అల్గారిథమ్‌లను మెరుగుపరచడమే ప్రధాన లక్ష్యం. భూగర్భ గుహలు, టన్నెల్స్ ఉపయోగించి రహస్యంగా నిర్వహించే అణు పరీక్షలను గుర్తించే సామర్థ్యాన్ని పెంచేందుకు ఈ ప్రయోగం ఉపయోగపడనుంది. ఇరాన్, చైనా వంటి దేశాలపై గతంలో వచ్చిన రహస్య అణు పరీక్షల ఆరోపణల నేపథ్యంలో ఈ ప్రయోగం ప్రాధాన్యం సంతరించుకుంది.

Source link