ప్రభన్యూస్

Chiranjeevi: మల్టీప్లెక్స్ వ్యాపారంలోకి మెగాస్టార్ చిరంజీవి.. సంక్రాంతి 2027కి గ్రాండ్ ఓపెనింగ్? | తెలుగు సినిమా వార్తలు


Last Updated:

మెగాస్టార్ చిరంజీవి కేవలం వెండితెరపై తన అద్భుత నటనతోనే కాకుండా.. ఇప్పుడు థియేటర్ల నిర్వహణ, ఎగ్జిబిషన్ (Exhibition Sector) వ్యాపారంలోకి కూడా భారీ స్థాయిలో అడుగుపెడుతున్నారు. ఇప్పుడు ఆయన మల్టీప్లెక్స్ వ్యాపారంలోకి అడుగు పెడుతున్నట్లు సమాచారం.

News18
News18

మెగాస్టార్ చిరంజీవి కేవలం వెండితెరపై తన అద్భుత నటనతోనే కాకుండా.. ఇప్పుడు థియేటర్ల నిర్వహణ, ఎగ్జిబిషన్ (Exhibition Sector) వ్యాపారంలోకి కూడా భారీ స్థాయిలో అడుగుపెడుతున్నారు. టాలీవుడ్‌లో ఇప్పటికే సూపర్ స్టార్ మహేష్ బాబు (AMB), అల్లు అర్జున్ (AAA), విజయ్ దేవరకొండ (AVD) వంటి స్టార్లు మల్టీప్లెక్స్ రంగంలో విజయవంతంగా రాణిస్తుండగా, ఇప్పుడు చిరంజీవి కూడా ప్రముఖ డిస్ట్రిబ్యూషన్, ఎగ్జిబిషన్ సంస్థ ‘ఏషియన్ సినిమాస్’ (Asian Cinemas) తో చేతులు కలపడం ఇండస్ట్రీలో ఆసక్తికరంగా మారింది.

ఈ భాగస్వామ్యంలో భాగంగా హైదరాబాద్‌లోని ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ (Financial District) లో ఒక ఐకానిక్ మల్టీప్లెక్స్‌ను నిర్మించనున్నట్లు గతంలోనే వార్తలు వచ్చాయి. ముఖ్యంగా ఈ మల్టీప్లెక్స్‌లో ప్రపంచంలోనే అతిపెద్ద స్క్రీన్ (World’s Largest Screen) ను ఏర్పాటు చేయబోతున్నారనే ప్రకటన సినీ అభిమానుల్లో తీవ్ర ఆసక్తిని రేకెత్తించింది. అయితే, అత్యాధునిక సాంకేతికత, విలాసవంతమైన హంగులతో అత్యంత భారీ స్థాయిలో ఈ మెగా ప్రాజెక్టును నిర్మిస్తుండటం వల్ల ఇది పూర్తి కావడానికి మరింత సమయం పట్టే అవకాశం ఉంది. ఈ సుదీర్ఘ నిరీక్షణకు బదులుగా, ముందుగా మరో మల్టీప్లెక్స్‌ను నగర వాసులకు అందుబాటులోకి తీసుకురావాలని ఆసియన్ సంస్థ, మెగాస్టార్ ప్లాన్ చేస్తున్నారు.

తాజా సమాచారం ప్రకారం, హైదరాబాద్‌లోని కుషాయిగూడ ప్రాంతంలో దశాబ్దాలుగా సినీ ప్రేక్షకులకు వినోదాన్ని పంచుతున్న ‘టల్లూరి థియేటర్ల’ను (Talluri Theatres) ఆసియన్ సినిమాస్, చిరంజీవిల భాగస్వామ్య సంస్థ తమ ఆధీనంలోకి తీసుకున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం ఈ థియేటర్లను పూర్తిగా ఆధునీకరించి కార్పొరేట్ మల్టీప్లెక్స్ తరహాలో తీర్చిదిద్దే పనులు శరవేగంగా జరుగుతున్నాయి. ఈ సరికొత్త మల్టీప్లెక్స్‌కు ‘ఆసియన్ మెగాస్టార్ సినీప్లెక్స్’ (Asian Megastar Cineplex) అనే పేరును ఖరారు చేసినట్లు టాలీవుడ్ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది.

ఈ ఆధునికీకరణలో భాగంగా పాత థియేటర్ల స్థానంలో అత్యాధునిక 4K లేజర్ ప్రొజెక్షన్, డాల్బీ అట్మాస్ (Dolby Atmos) సౌండ్ సిస్టమ్, విలాసవంతమైన రిక్లైనర్ సీటింగ్, ప్రీమియం లాంజ్‌లు, విశాలమైన ఫుడ్ కోర్టులను ఏర్పాటు చేయనున్నారు. స్క్రీన్ల సంఖ్య, పూర్తి సీటింగ్ కెపాసిటీపై అధికారిక ప్రకటన రాకపోయినప్పటికీ, ప్రేక్షకులకు ఒక వరల్డ్ క్లాస్ సినిమాటిక్ ఎక్స్‌పీరియన్స్ అందించడమే లక్ష్యంగా డిజైన్ చేస్తున్నారు. 2027 సంక్రాంతి (Sankranthi 2027) పండుగ కానుకగా ఈ ‘ఆసియన్ మెగాస్టార్ సినీప్లెక్స్’ను అంగరంగ వైభవంగా ప్రారంభించేందుకు సన్నాహాలు చేస్తున్నారు.

సంక్రాంతికి బడా హీరోల సినిమాలు విడుదలయ్యే క్రమంలో.. మెగాస్టార్ సొంత థియేటర్‌లో సినిమా చూడటం అభిమానులకు పండుగ లాంటి వార్త అనడంలో సందేహం లేదు. అటు కుషాయిగూడ, ఈసీఐఎల్ పరిసర ప్రాంతాల ప్రజలకు సైతం ఇదొక ప్రీమియం ఎంటర్‌టైన్‌మెంట్ డెస్టినేషన్‌గా మారనుంది. ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ ప్రాజెక్ట్ పూర్తయ్యేలోపు, ఈ ‘ఆసియన్ మెగాస్టార్ సినీప్లెక్స్’ ద్వారా చిరు థియేటర్ వ్యాపారంలో తనదైన ముద్ర వేయడం ఖాయంగా కనిపిస్తోంది.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

×
prabhanews.co.in
Logo
Date of Publish : 28 September 2026, 6:19 pm Digital Edition : Prabhanews
Chiranjeevi: మల్టీప్లెక్స్ వ్యాపారంలోకి మెగాస్టార్ చిరంజీవి.. సంక్రాంతి 2027కి గ్రాండ్ ఓపెనింగ్? | తెలుగు సినిమా వార్తలు

Last Updated:Sep 28, 2026 5:04 PM ISTమెగాస్టార్ చిరంజీవి కేవలం వెండితెరపై తన అద్భుత నటనతోనే కాకుండా.. ఇప్పుడు థియేటర్ల నిర్వహణ, ఎగ్జిబిషన్ (Exhibition Sector) వ్యాపారంలోకి కూడా భారీ స్థాయిలో అడుగుపెడుతున్నారు. ఇప్పుడు ఆయన మల్టీప్లెక్స్ వ్యాపారంలోకి అడుగు పెడుతున్నట్లు సమాచారం. News18మెగాస్టార్ చిరంజీవి కేవలం వెండితెరపై తన అద్భుత నటనతోనే కాకుండా.. ఇప్పుడు థియేటర్ల నిర్వహణ, ఎగ్జిబిషన్ (Exhibition Sector) వ్యాపారంలోకి కూడా భారీ స్థాయిలో అడుగుపెడుతున్నారు. టాలీవుడ్‌లో ఇప్పటికే సూపర్ స్టార్ మహేష్ బాబు (AMB), అల్లు అర్జున్ (AAA), విజయ్ దేవరకొండ (AVD) వంటి స్టార్లు మల్టీప్లెక్స్ రంగంలో విజయవంతంగా రాణిస్తుండగా, ఇప్పుడు చిరంజీవి కూడా ప్రముఖ డిస్ట్రిబ్యూషన్, ఎగ్జిబిషన్ సంస్థ 'ఏషియన్ సినిమాస్' (Asian Cinemas) తో చేతులు కలపడం ఇండస్ట్రీలో ఆసక్తికరంగా మారింది.ఈ భాగస్వామ్యంలో భాగంగా హైదరాబాద్‌లోని ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ (Financial District) లో ఒక ఐకానిక్ మల్టీప్లెక్స్‌ను నిర్మించనున్నట్లు గతంలోనే వార్తలు వచ్చాయి. ముఖ్యంగా ఈ మల్టీప్లెక్స్‌లో ప్రపంచంలోనే అతిపెద్ద స్క్రీన్ (World's Largest Screen) ను ఏర్పాటు చేయబోతున్నారనే ప్రకటన సినీ అభిమానుల్లో తీవ్ర ఆసక్తిని రేకెత్తించింది. అయితే, అత్యాధునిక సాంకేతికత, విలాసవంతమైన హంగులతో అత్యంత భారీ స్థాయిలో ఈ మెగా ప్రాజెక్టును నిర్మిస్తుండటం వల్ల ఇది పూర్తి కావడానికి మరింత సమయం పట్టే అవకాశం ఉంది. ఈ సుదీర్ఘ నిరీక్షణకు బదులుగా, ముందుగా మరో మల్టీప్లెక్స్‌ను నగర వాసులకు అందుబాటులోకి తీసుకురావాలని ఆసియన్ సంస్థ, మెగాస్టార్ ప్లాన్ చేస్తున్నారు.తాజా సమాచారం ప్రకారం, హైదరాబాద్‌లోని కుషాయిగూడ ప్రాంతంలో దశాబ్దాలుగా సినీ ప్రేక్షకులకు వినోదాన్ని పంచుతున్న 'టల్లూరి థియేటర్ల'ను (Talluri Theatres) ఆసియన్ సినిమాస్, చిరంజీవిల భాగస్వామ్య సంస్థ తమ ఆధీనంలోకి తీసుకున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం ఈ థియేటర్లను పూర్తిగా ఆధునీకరించి కార్పొరేట్ మల్టీప్లెక్స్ తరహాలో తీర్చిదిద్దే పనులు శరవేగంగా జరుగుతున్నాయి. ఈ సరికొత్త మల్టీప్లెక్స్‌కు ‘ఆసియన్ మెగాస్టార్ సినీప్లెక్స్’ (Asian Megastar Cineplex) అనే పేరును ఖరారు చేసినట్లు టాలీవుడ్ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది.ఈ ఆధునికీకరణలో భాగంగా పాత థియేటర్ల స్థానంలో అత్యాధునిక 4K లేజర్ ప్రొజెక్షన్, డాల్బీ అట్మాస్ (Dolby Atmos) సౌండ్ సిస్టమ్, విలాసవంతమైన రిక్లైనర్ సీటింగ్, ప్రీమియం లాంజ్‌లు, విశాలమైన ఫుడ్ కోర్టులను ఏర్పాటు చేయనున్నారు. స్క్రీన్ల సంఖ్య, పూర్తి సీటింగ్ కెపాసిటీపై అధికారిక ప్రకటన రాకపోయినప్పటికీ, ప్రేక్షకులకు ఒక వరల్డ్ క్లాస్ సినిమాటిక్ ఎక్స్‌పీరియన్స్ అందించడమే లక్ష్యంగా డిజైన్ చేస్తున్నారు. 2027 సంక్రాంతి (Sankranthi 2027) పండుగ కానుకగా ఈ 'ఆసియన్ మెగాస్టార్ సినీప్లెక్స్'ను అంగరంగ వైభవంగా ప్రారంభించేందుకు సన్నాహాలు చేస్తున్నారు.సంక్రాంతికి బడా హీరోల సినిమాలు విడుదలయ్యే క్రమంలో.. మెగాస్టార్ సొంత థియేటర్‌లో సినిమా చూడటం అభిమానులకు పండుగ లాంటి వార్త అనడంలో సందేహం లేదు. అటు కుషాయిగూడ, ఈసీఐఎల్ పరిసర ప్రాంతాల ప్రజలకు సైతం ఇదొక ప్రీమియం ఎంటర్‌టైన్‌మెంట్ డెస్టినేషన్‌గా మారనుంది. ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ ప్రాజెక్ట్ పూర్తయ్యేలోపు, ఈ 'ఆసియన్ మెగాస్టార్ సినీప్లెక్స్' ద్వారా చిరు థియేటర్ వ్యాపారంలో తనదైన ముద్ర వేయడం ఖాయంగా కనిపిస్తోంది.మరింత చదవండి

Source link