సినిమాకు మొదటి రోజు నుంచే నెగెటివ్ టాక్ వినిపిస్తోంది. కథలో సరైన ఎమోషనల్ డెప్త్ లేదని, ఎటు చూసినా రక్తపాతం, హింస మాత్రమే కనిపిస్తున్నాయని ప్రేక్షకులు పెదవి విరుస్తున్నారు. మరికొందరైతే ఇటీవల వచ్చిన సినిమాలతో పోల్చుతూ విమర్శలు చేస్తున్నారు. అయినప్పటికీ, నేచురల్ స్టార్ నాని ఊర మాస్ యాక్టింగ్, స్క్రీన్ ప్రెజెన్స్ కారణంగా జనాలు థియేటర్లకు క్యూ కడుతున్నారు. నెగెటివ్ టాక్‌ను సైతం కలెక్షన్ల ప్రవాహంతో నాని పక్కకు నెట్టేస్తున్నారు.

