ప్రభన్యూస్

అమెరికా మార్కెట్‌లోకి షిర్డి సాయి ఎలక్ట్రిక్‌ తొలి EHV పవర్‌ ట్రాన్స్‌ఫార్మర్ల ఎగుమతి | బిజినెస్


Last Updated:

అమెరికా మార్కెట్‌కు భారత్ నుంచి తొలి 175 MVA, 345 kV EHV పవర్ ట్రాన్స్‌ఫార్మర్‌ను SSEL ఎగుమతి చేసింది. నైనీ తయారీ కేంద్రం నుంచి రాబోయే 12–18 నెలల్లో రూ.500–600 కోట్ల ఎగుమతులను కంపెనీ లక్ష్యంగా పెట్టుకుంది.

News18
News18

విద్యుత్‌ ప్రసార రంగంలో తన అంతర్జాతీయ విస్తరణను మరింత బలోపేతం చేసుకుంటూ Shirdi Sai Electricals Limited (SSEL), అమెరికా మార్కెట్‌కు తన తొలి 175 MVA, 345 kV Extra High Voltage (EHV) Power Transformerను విజయవంతంగా ఎగుమతి చేసింది. ఉత్తరప్రదేశ్‌లోని ప్రయాగ్‌రాజ్‌ నైనీ తయారీ కేంద్రంలో ఈ అధిక సామర్థ్యం కలిగిన EHV Power Transformerను తయారు చేశారు.

అమెరికాకు ఈ తొలి EHV Power Transformer ఎగుమతి, అంతర్జాతీయ విద్యుత్‌ ప్రసార మార్కెట్లలో SSEL సామర్థ్యాలకు మరో ముఖ్యమైన గుర్తింపుగా నిలిచింది. అధిక సామర్థ్యం కలిగిన పవర్‌ ట్రాన్స్ఫార్మర్‌ను అత్యున్నత ఇంజినీరింగ్‌, నాణ్యత, పనితీరు ప్రమాణాలకు అనుగుణంగా తయారు చేసి, అంతర్జాతీయ యుటిలిటీ మార్కెట్ల అవసరాలను తీర్చగే సామర్థ్యాన్ని సొంతం చేసుకున్నట్లు SSEL తెలిపింది. ఈ మైలురాయి ద్వారా అమెరికాతో పాటు ఇతర అంతర్జాతీయ పవర్‌ ట్రాన్స్‌మిషన్‌ మార్కెట్లలో తన కార్యకలాపాలను విస్తరించేందుకు SSELకు మరింత బలమైన పునాది ఏర్పడింది.

అంతర్జాతీయ విస్తరణకు నైనీ తయారీ యూనిట్ కీలకం..

ఈ సందర్భంగా షిర్డీ సాయి ఎలక్ట్రికల్స్‌ లిమిటెడ్, CEO శరత్‌ చంద్ర కొల్లా మాట్లాడుతూ.. ‘అమెరికాకు మా తొలి ఈహెచ్‌వీ ట్రాన్స్‌ఫార్మర్‌ను ఎగుమతి చేయడం, ఎస్‌ఎస్‌ఈఎల్‌ అంతర్జాతీయ ప్రస్థానంలో ఒక ముఖ్యమైన మైలురాయి. ఇది మా ఇంజినీరింగ్‌ నైపుణ్యం, తయారీ సామర్థ్యాలు, నాణ్యత పట్ల మా నిబద్ధతకు నిదర్శనం. అంతర్జాతీయ మార్కెట్లలో మా ఉనికిని మరింత విస్తరించడంతో పాటు, రాబోయే 12–18 నెలల్లో నైనీ ట్రాన్స్‌ఫార్మర్‌ తయారీ యూనిట్‌ ద్వారా రూ.500–600 కోట్ల స్థాయిలో ఎగుమతులను లక్ష్యంగా పెట్టుకున్నాం. యూరప్‌ మార్కెట్లో పవర్‌, డిస్ట్రిబ్యూషన్‌ ట్రాన్స్‌ఫార్మర్లకు అవసరమైన అనుమతులు, ధృవీకరణలు పొందేందుకు కూడా మేము చర్యలు కొనసాగిస్తున్నాం.’ అని తెలిపారు.

SSEL President సుధీర్‌ వెన్నం మాట్లాడుతూ.. ‘నైనీ నుంచి అమెరికాకు మా తొలి 175 MVA, 345 kV క్లాస్ ట్రాన్స్‌ఫార్మర్‌ను విజయవంతంగా రవాణా చేయడం సంస్థకు ఒక కీలక మైలురాయి. కఠినమైన అంతర్జాతీయ యుటిలిటీ ప్రమాణాలకు అనుగుణంగా భారీ సామర్థ్యం కలిగిన పవర్‌ ట్రాన్స్‌ఫార్మర్లను తయారు చేసి, సరఫరా చేయగల మా సామర్థ్యాన్ని ఇది ధృవీకరిస్తోంది. కడపతో పాటు నైనీని కూడా అధునాతన పవర్‌ ట్రాన్స్‌ఫార్మర్‌ మార్కెట్లకు ఒక విశ్వసనీయ ఎగుమతి కేంద్రంగా స్థాపించేందుకు ఈ విజయం దోహదపడుతుంది. ప్రపంచవ్యాప్తంగా గ్రిడ్‌ విస్తరణ, విద్యుదీకరణ, పునరుత్పాదక ఇంధన అనుసంధానంపై భారీ పెట్టుబడులు కొనసాగుతున్న నేపథ్యంలో, ఈ మైలురాయి మా అంతర్జాతీయ వ్యాపారాన్ని మరింత విస్తరించేందుకు, అలాగే మా ఆదాయ వనరులను మరింత విభిన్నీకరించేందుకు బలమైన పునాదిని ఏర్పరుస్తుందని మేము విశ్వసిస్తున్నాము’ అని అన్నారు.

1,58,000 MVAకి చేరనున్న మొత్తం తయారీ సామర్థ్యం..

ప్రస్తుతం దేశంవ్యప్తంగా ఉన్న వివిధ తయారీ కేంద్రాల్లో షిర్డిసాయి ఎలక్ట్రిల్‌కు సుమారు 48,000 ఎంవీఏ ట్రాన్స్‌ఫార్మర్‌ తయారీ సామర్థ్యం ఉంది. రాబోయే సంవత్సరాల్లో అదనంగా 1,10,000 ఎంవీఏ తయారీ సామర్థ్యాన్ని ఏర్పాటు చేసేందుకు సంస్థ విస్తరణ ప్రణాళికలను అమలు చేస్తోంది. దీంతో ఎస్‌ఎస్‌ఈఎల్‌ మొత్తం ట్రాన్స్‌ఫార్మర్‌ తయారీ సామర్థ్యం సుమారు 1,58,000 ఎంవీఏకు చేరుకోనుంది.

అంతర్జాతీయ విద్యుత్‌ మౌలిక వసతుల మార్కెట్లలో పెరుగుతున్న డిమాండ్‌ను దృష్టిలో ఉంచుకుని, అధిక సామర్థ్యం కలిగిన ఈహెచ్‌వీ, పవర్‌ ట్రాన్స్‌మిషన్‌ పరికరాల తయారీ సామర్థ్యాలను ఎస్‌ఎస్‌ఈఎల్‌ నిరంతరం విస్తరిస్తోంది. అమెరికాకు తొలి ఈహెచ్‌వీ పవర్‌ ట్రాన్స్‌ఫార్మర్‌ ఎగుమతి చేయడం ద్వారా, అంతర్జాతీయ పవర్‌ ట్రాన్స్‌మిషన్‌ పరికరాల సరఫరా వ్యవస్థలో ఎస్‌ఎస్‌ఈఎల్‌ తన స్థానాన్ని మరింత బలోపేతం చేసుకుంది.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

×
prabhanews.co.in
Logo
Date of Publish : 22 September 2026, 8:32 pm Digital Edition : Prabhanews
అమెరికా మార్కెట్‌లోకి షిర్డి సాయి ఎలక్ట్రిక్‌ తొలి EHV పవర్‌ ట్రాన్స్‌ఫార్మర్ల ఎగుమతి | బిజినెస్

Last Updated:Sep 22, 2026 8:16 PM ISTఅమెరికా మార్కెట్‌కు భారత్ నుంచి తొలి 175 MVA, 345 kV EHV పవర్ ట్రాన్స్‌ఫార్మర్‌ను SSEL ఎగుమతి చేసింది. నైనీ తయారీ కేంద్రం నుంచి రాబోయే 12–18 నెలల్లో రూ.500–600 కోట్ల ఎగుమతులను కంపెనీ లక్ష్యంగా పెట్టుకుంది.News18విద్యుత్‌ ప్రసార రంగంలో తన అంతర్జాతీయ విస్తరణను మరింత బలోపేతం చేసుకుంటూ Shirdi Sai Electricals Limited (SSEL), అమెరికా మార్కెట్‌కు తన తొలి 175 MVA, 345 kV Extra High Voltage (EHV) Power Transformerను విజయవంతంగా ఎగుమతి చేసింది. ఉత్తరప్రదేశ్‌లోని ప్రయాగ్‌రాజ్‌ నైనీ తయారీ కేంద్రంలో ఈ అధిక సామర్థ్యం కలిగిన EHV Power Transformerను తయారు చేశారు.అమెరికాకు ఈ తొలి EHV Power Transformer ఎగుమతి, అంతర్జాతీయ విద్యుత్‌ ప్రసార మార్కెట్లలో SSEL సామర్థ్యాలకు మరో ముఖ్యమైన గుర్తింపుగా నిలిచింది. అధిక సామర్థ్యం కలిగిన పవర్‌ ట్రాన్స్ఫార్మర్‌ను అత్యున్నత ఇంజినీరింగ్‌, నాణ్యత, పనితీరు ప్రమాణాలకు అనుగుణంగా తయారు చేసి, అంతర్జాతీయ యుటిలిటీ మార్కెట్ల అవసరాలను తీర్చగే సామర్థ్యాన్ని సొంతం చేసుకున్నట్లు SSEL తెలిపింది. ఈ మైలురాయి ద్వారా అమెరికాతో పాటు ఇతర అంతర్జాతీయ పవర్‌ ట్రాన్స్‌మిషన్‌ మార్కెట్లలో తన కార్యకలాపాలను విస్తరించేందుకు SSELకు మరింత బలమైన పునాది ఏర్పడింది.అంతర్జాతీయ విస్తరణకు నైనీ తయారీ యూనిట్ కీలకం..ఈ సందర్భంగా షిర్డీ సాయి ఎలక్ట్రికల్స్‌ లిమిటెడ్, CEO శరత్‌ చంద్ర కొల్లా మాట్లాడుతూ.. ‘అమెరికాకు మా తొలి ఈహెచ్‌వీ ట్రాన్స్‌ఫార్మర్‌ను ఎగుమతి చేయడం, ఎస్‌ఎస్‌ఈఎల్‌ అంతర్జాతీయ ప్రస్థానంలో ఒక ముఖ్యమైన మైలురాయి. ఇది మా ఇంజినీరింగ్‌ నైపుణ్యం, తయారీ సామర్థ్యాలు, నాణ్యత పట్ల మా నిబద్ధతకు నిదర్శనం. అంతర్జాతీయ మార్కెట్లలో మా ఉనికిని మరింత విస్తరించడంతో పాటు, రాబోయే 12–18 నెలల్లో నైనీ ట్రాన్స్‌ఫార్మర్‌ తయారీ యూనిట్‌ ద్వారా రూ.500–600 కోట్ల స్థాయిలో ఎగుమతులను లక్ష్యంగా పెట్టుకున్నాం. యూరప్‌ మార్కెట్లో పవర్‌, డిస్ట్రిబ్యూషన్‌ ట్రాన్స్‌ఫార్మర్లకు అవసరమైన అనుమతులు, ధృవీకరణలు పొందేందుకు కూడా మేము చర్యలు కొనసాగిస్తున్నాం.’ అని తెలిపారు.SSEL President సుధీర్‌ వెన్నం మాట్లాడుతూ.. ‘నైనీ నుంచి అమెరికాకు మా తొలి 175 MVA, 345 kV క్లాస్ ట్రాన్స్‌ఫార్మర్‌ను విజయవంతంగా రవాణా చేయడం సంస్థకు ఒక కీలక మైలురాయి. కఠినమైన అంతర్జాతీయ యుటిలిటీ ప్రమాణాలకు అనుగుణంగా భారీ సామర్థ్యం కలిగిన పవర్‌ ట్రాన్స్‌ఫార్మర్లను తయారు చేసి, సరఫరా చేయగల మా సామర్థ్యాన్ని ఇది ధృవీకరిస్తోంది. కడపతో పాటు నైనీని కూడా అధునాతన పవర్‌ ట్రాన్స్‌ఫార్మర్‌ మార్కెట్లకు ఒక విశ్వసనీయ ఎగుమతి కేంద్రంగా స్థాపించేందుకు ఈ విజయం దోహదపడుతుంది. ప్రపంచవ్యాప్తంగా గ్రిడ్‌ విస్తరణ, విద్యుదీకరణ, పునరుత్పాదక ఇంధన అనుసంధానంపై భారీ పెట్టుబడులు కొనసాగుతున్న నేపథ్యంలో, ఈ మైలురాయి మా అంతర్జాతీయ వ్యాపారాన్ని మరింత విస్తరించేందుకు, అలాగే మా ఆదాయ వనరులను మరింత విభిన్నీకరించేందుకు బలమైన పునాదిని ఏర్పరుస్తుందని మేము విశ్వసిస్తున్నాము’ అని అన్నారు.1,58,000 MVAకి చేరనున్న మొత్తం తయారీ సామర్థ్యం..ప్రస్తుతం దేశంవ్యప్తంగా ఉన్న వివిధ తయారీ కేంద్రాల్లో షిర్డిసాయి ఎలక్ట్రిల్‌కు సుమారు 48,000 ఎంవీఏ ట్రాన్స్‌ఫార్మర్‌ తయారీ సామర్థ్యం ఉంది. రాబోయే సంవత్సరాల్లో అదనంగా 1,10,000 ఎంవీఏ తయారీ సామర్థ్యాన్ని ఏర్పాటు చేసేందుకు సంస్థ విస్తరణ ప్రణాళికలను అమలు చేస్తోంది. దీంతో ఎస్‌ఎస్‌ఈఎల్‌ మొత్తం ట్రాన్స్‌ఫార్మర్‌ తయారీ సామర్థ్యం సుమారు 1,58,000 ఎంవీఏకు చేరుకోనుంది.అంతర్జాతీయ విద్యుత్‌ మౌలిక వసతుల మార్కెట్లలో పెరుగుతున్న డిమాండ్‌ను దృష్టిలో ఉంచుకుని, అధిక సామర్థ్యం కలిగిన ఈహెచ్‌వీ, పవర్‌ ట్రాన్స్‌మిషన్‌ పరికరాల తయారీ సామర్థ్యాలను ఎస్‌ఎస్‌ఈఎల్‌ నిరంతరం విస్తరిస్తోంది. అమెరికాకు తొలి ఈహెచ్‌వీ పవర్‌ ట్రాన్స్‌ఫార్మర్‌ ఎగుమతి చేయడం ద్వారా, అంతర్జాతీయ పవర్‌ ట్రాన్స్‌మిషన్‌ పరికరాల సరఫరా వ్యవస్థలో ఎస్‌ఎస్‌ఈఎల్‌ తన స్థానాన్ని మరింత బలోపేతం చేసుకుంది.మరింత చదవండి

Source link