ఈ సమావేశాల సందర్భంగా ఉద్యోగుల ప్రతినిధులు ప్రధానంగా నాలుగు అంశాలపై దృష్టి సారించారు. జీతాల పెంపును నిర్ణయించే ‘ఫిట్‌మెంట్ ఫ్యాక్టర్’ (Fitment Factor) ను పెంచాలని, వేతన సవరణలు శాస్త్రీయంగా జరగాలని, పెన్షన్ విధానంలో సానుకూల సంస్కరణలు తీసుకురావాలని, అలాగే ప్రస్తుత పరిస్థితులకు అనుగుణంగా వివిధ రకాల అలవెన్సులను సవరించాలని కమిటీ ముందు తమ ప్రధాన డిమాండ్లను ఉంచారు. అయితే, ఈ డిమాండ్లన్నింటిలోకీ అత్యంత ప్రధానమైన, చిరకాలంగా పెండింగ్‌లో ఉన్న ఒక డిమాండ్‌ను కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్ల సంఘాలు 8వ వేతన సంఘం ముందు బలంగా వినిపించాయి. అదేమిటంటే.. వేతన, పెన్షన్ సవరణలను పదేళ్లకు ఒకసారి (దశాబ్దానికి ఒకసారి) కాకుండా, ప్రతి ఐదేళ్లకు ఒకసారి చేపట్టాలి. ప్రస్తుత వ్యవస్థలో ఉన్న ఈ పదేళ్ల సుదీర్ఘ నిరీక్షణ ఉద్యోగులకు ఆర్థికంగా తీవ్ర నష్టం చేకూరుస్తోందని వారు వాపోతున్నారు.(ప్రతీకాత్మక చిత్రం)

