Last Updated:
సన్‌స్క్రీన్ రాసుకున్నంత మాత్రాన చర్మం పూర్తిగా ఎండ నుంచి రక్షించబడుతుందని అనుకోకూడదు. సరైన మొత్తంలో అప్లై చేయడం, అవసరమైనప్పుడు మళ్లీ రాయడం, ఇతర సన్ ప్రొటెక్షన్ పద్ధతులను పాటించడం కూడా ముఖ్యం.
సన్‌స్క్రీన్‌ను కేవలం వేసవి కాలంలో మాత్రమే ఉపయోగించాలని చాలామంది అనుకుంటారు. కానీ సూర్యుడి నుంచి వచ్చే యూవీ కిరణాలు వేసవిలోనే కాకుండా ఇతర కాలాల్లోనూ చర్మంపై ప్రభావం చూపుతాయి. అందుకే బయటకు వెళ్లే సమయంలో మాత్రమే కాకుండా, రోజువారీ చర్మ సంరక్షణలో కూడా సన్‌స్క్రీన్‌కు ప్రాధాన్యత ఇవ్వడం మంచిది. అయితే సన్‌స్క్రీన్ రాసుకున్నంత మాత్రాన చర్మం పూర్తిగా ఎండ నుంచి రక్షించబడుతుందని అనుకోకూడదు. సరైన మొత్తంలో అప్లై చేయడం, అవసరమైనప్పుడు మళ్లీ రాయడం, ఇతర సన్ ప్రొటెక్షన్ పద్ధతులను పాటించడం కూడా ముఖ్యమని డాక్టర్ శ్రావ్య చల్ల, న్యూస్18 తెలుగుతో చెప్పుకొచ్చారు.

