Last Updated:
జెజె ఆర్ట్ మూవీస్, పవనసుత ప్రొడక్షన్స్, గాయత్రి సినిమాస్ బ్యానర్స్ సంయుక్తంగా మహేష్ కుమార్ సంక, భగవాన్ నిర్మాతలుగా మణికంఠ పెదమల్లు తొలి దర్శకునిగా పరిచయం అవుతూ ప్రారంభమైన చిత్రం #LUB.
జెజె ఆర్ట్ మూవీస్, పవనసుత ప్రొడక్షన్స్, గాయత్రి సినిమాస్ బ్యానర్స్ సంయుక్తంగా మహేష్ కుమార్ సంక, భగవాన్ నిర్మాతలుగా మణికంఠ పెదమల్లు తొలి దర్శకునిగా పరిచయం అవుతూ ప్రారంభమైన చిత్రం #LUB. ఈ చిత్రం ద్వారా పవన్ కేసరి, ప్రాముఖ్య హీరో హీరోయిన్ గా పరిచయం అవుతుండగా అభితేజ్, జెడివి ప్రసాద్, మల్లిక లెల్ల, సాయికిరణ్, రోమాంచకం ఫేమ్ మధు, విశ్వనాథ్ & సన్స్ ఫేమ్ హారిక, భాను ప్రకాష్ కడియాల, మోత రాజేందర్ తదితరులు కీలక పాత్రలు పోషించనున్నారు. అక్షయ్ వసూరి డిఓపిగా పని చేస్తున్న ఈ చిత్రానికి కార్తికేయన్ రోహిణి ఎడిటర్ గా, సుధ శ్రీనివాస్ సంగీత దర్శకుడిగా, లిరికల్ రైటర్ గా జైలర్ 2, ఓజి ఫేమ్ శ్రీనివాస మౌళి పని చేయనున్నారు. ప్రముఖ రచయిత బివిఎస్ రవి ఈ చిత్రానికి క్లాప్ చేయగా హనుమాన్ చిత్ర నిర్మాత చైతన్య రెడ్డి గారు కెమెరా స్విచ్ ఆన్ చేశారు. మొదటి షాట్ చిత్ర దర్శకుడు మణికంఠ దర్శకత్వం చేయగా స్క్రిప్టును క్రేజీ కల్యాణం చిత్ర నిర్మాత బి జగన్ మోహన్ రెడ్డి గారు, బివిఎస్ రవి గారు అందజేశారు. ఈ ఈవెంట్ కు హాజరైన సంబరాల ఏటిగట్టు చిత్ర దర్శకుడు రోహిత్ కెపి, దర్శకుడు సముద్ర, నిర్మాతలు లగడపాటి శ్రీనివాసరావు, శ్రీకాంత్ ఈ చిత్ర యూనిట్ కు తమ బెస్ట్ విషెస్ తెలిపారు.

