Last Updated:
Russia-Ukraine War: సుదీర్ఘ కాలంగా కొనసాగుతున్న రష్యా-ఉక్రెయిన్ యుద్ధానికి ముగింపు పలికే దిశగా దౌత్యపరమైన ముందడుగు పడింది.
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రత్యేక ప్రతినిధులు స్టీవ్ విట్‌కాఫ్, జారెడ్ కుష్నర్‌లు శనివారం మాస్కో చేరుకున్న వేళ, రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ కీలక నిర్ణయం తీసుకున్నారు. ఉక్రెయిన్ రాజధాని కీవ్‌పై మూడు రోజుల పాటు దాడులను నిలిపివేయాలని ఆయన శనివారం ఆదేశాలు జారీ చేశారు. రష్యా-ఉక్రెయిన్ యుద్ధాన్ని శాంతింపజేసే లక్ష్యంతో వాషింగ్టన్ రూపొందించిన తాజా ప్రతిపాదనలతో ట్రంప్ ప్రతినిధులు మాస్కోకు చేరుకున్నారు. ఈ ప్రతిపాదనల పూర్తి వివరాలు ఇంకా బహిర్గతం కాలేదు. క్రెమ్లిన్‌లో అధ్యక్షుడు పుతిన్‌తో పాటు ఇతర ఉన్నతాధికారులతో వీరు విస్తృత స్థాయి చర్చలు జరపనున్నారు.

