Last Updated:
యూటీఐ బీఎస్ఈ ఇండియా సెక్టార్ లీడర్స్ ఎక్స్చేంజ్ ట్రేడెడ్ ఫండ్, యూటీఐ బీఎస్ఈ ఇండియా సెక్టార్ లీడర్స్ ఇండెక్స్ ఫండ్ పేరిట కొత్తగా 2 ప్యాసివ్ ఫండ్స్‌ను ఆవిష్కరించింది.
యూటీఐ మ్యుచువల్ ఫండ్ (యూటీఐ ఎంఎఫ్) కొత్తగా రెండు ప్యాసివ్ ఫండ్స్‌ను ఆవిష్కరించింది. యూటీఐ బీఎస్ఈ ఇండియా సెక్టార్ లీడర్స్ ఎక్స్చేంజ్ ట్రేడెడ్ ఫండ్, యూటీఐ బీఎస్ఈ ఇండియా సెక్టార్ లీడర్స్ ఇండెక్స్ ఫండ్ వీటిలో ఉన్నాయి. యూటీఐ బీఎస్ఈ ఇండియా సెక్టార్ లీడర్స్ ఎక్స్చేంజ్ ట్రేడెడ్ ఫండ్ అనేది బీఎస్ఈ ఇండియా సెక్టార్ లీడర్స్ టోటల్ రిటర్న్స్ ఇండెక్స్ (టీఆర్ఐ)ని ప్రతిబింబించే/ట్రాక్ చేసే ఓపెన్ ఎండెడ్ స్కీము. ఇక యూటీఐ బీఎస్ఈ ఇండియా సెక్టార్ లీడర్స్ ఇండెక్స్ ఫండ్ అనేది బీఎస్ఈ ఇండియా సెక్టార్ లీడర్స్ టోటల్ రిటర్న్ ఇండెక్స్ (టీఆర్ఐ) ని ప్రతిబింబించే/ట్రాక్ చేసే ఓపెన్ ఎండెడ్ స్కీము. ఈ రెండు ప్యాసివ్ ఫండ్ల ఎన్ఎఫ్‌వోలు 2026 ఆగస్టు 31న ప్రారంభమై 2026 సెప్టెంబర్ 11 వరకు అందుబాటులో ఉంటాయి. యూటీఐ బీఎస్ఈ ఇండియా సెక్టార్ లీడర్స్ ఎక్స్చేంజ్ ట్రేడెడ్ ఫండ్‌ను ప్రవేశపెట్టడం ద్వారా పరిశ్రమలోనే మొదటిసారిగా బీఎస్ఈ ఇండియా సెక్టార్ లీడర్స్ ఇండెక్స్‌ను ట్రాక్ చేసే తొలి ఈటీఎఫ్‌ను యూటీఐ ఎంఎఫ్ అందుబాటులోకి తెచ్చింది.

