ప్రభన్యూస్

Posani Krishna Murali: ఆ ఒక్క సినిమాతో నా జీవితమే మారిపోయింది.. చూడగానే చిరంజీవి ఏమన్నారంటే..! | తెలుగు సినిమా వార్తలు


Last Updated:

ఒకప్పుడు రచయితగా ఇండస్ట్రీని ఏలిన పోసాని, ఆ తర్వాత నటుడిగా, దర్శకుడిగా తనకంటూ ఒక ప్రత్యేకమైన బ్రాండ్ క్రియేట్ చేసుకున్నారు. ఆయన కెరీర్ లో చిరంజీవి పాత్ర మరువలేనిదట.

News18
News18

టాలీవుడ్ ప్రముఖ రచయిత, విలక్షణ నటుడు పోసాని కృష్ణ మురళి (Posani Krishna Murali) సుదీర్ఘ విరామం తర్వాత వెండితెరపైకి గ్రాండ్ రీ ఎంట్రీ ఇచ్చారు. గత కొంతకాలంగా రాజకీయాల్లో బిజీగా ఉండి, సినిమాలకు పూర్తిగా దూరమైన ఆయన.. తాజాగా ‘ఆపరేషన్‌ అరుణారెడ్డి’ (Operation Arunareddy) చిత్రంతో ప్రేక్షకుల ముందుకు వచ్చారు. జులై 17న థియేటర్లలో విడుదలైన ఈ సినిమా ద్వారా ఆయన కేవలం నటుడిగానే కాకుండా.. దర్శకుడిగా, నిర్మాతగా, కథా రచయితగా బహుముఖ పాత్రలు పోషించడం విశేషం. సుమారు 150కి పైగా చిత్రాలకు వివిధ విభాగాల్లో పనిచేసిన అనుభవం ఉన్న పోసాని, ఈ సినిమా ప్రమోషన్స్‌లో భాగంగా తన వ్యక్తిగత, సినీ ప్రయాణం గురించి పలు ఆసక్తికరమైన విషయాలను పంచుకున్నారు. ముఖ్యంగా తన కెరీర్‌ను మలుపు తిప్పిన రామ్ చరణ్ సినిమా గురించి ఆయన చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు నెట్టింట వైరల్‌గా మారాయి.

‘ఆపరేషన్ అరుణారెడ్డి’తో రీ-ఎంట్రీ:

ఒకప్పుడు రచయితగా ఇండస్ట్రీని ఏలిన పోసాని, ఆ తర్వాత నటుడిగా, దర్శకుడిగా తనకంటూ ఒక ప్రత్యేకమైన బ్రాండ్ క్రియేట్ చేసుకున్నారు. ఫైర్ బ్రాండ్ లీడర్‌గా రాజకీయాల్లోకి వెళ్లిన తర్వాత ఆయన సినిమాలకు గ్యాప్ ఇచ్చారు. ఇప్పుడు మళ్లీ తనే స్వయంగా బాధ్యతలు భుజాన వేసుకుని ‘ఆపరేషన్‌ అరుణారెడ్డి’ని తెరకెక్కించారు. ఈ చిత్రంలో పోసానితో పాటు హిందోళ చక్రవర్తి, కాజల్‌ శర్మ, ఆయేషా ఖాన్‌ తదితరులు కీలక పాత్రలు పోషించారు. తన మార్క్ డైలాగ్స్, స్క్రీన్ ప్లేతో ఈ సినిమాను ఆయన రూపొందించినట్లు తెలుస్తోంది.

తన సినీ జీవితంలో రామ్ చరణ్, వీవీ వినాయక్ కాంబినేషన్‌లో వచ్చిన ‘నాయక్’ (Nayak) సినిమాకు ఎప్పటికీ ప్రత్యేక స్థానం ఉంటుందని పోసాని ఎమోషనల్ అయ్యారు. ఆయన మాట్లాడుతూ.. “నా యాక్టింగ్ కెరీర్‌ను పూర్తిగా మార్చేసిన చిత్రాల్లో ‘నాయక్’ దే మొదటి స్థానం. దర్శకుడు వీవీ వినాయక్ అంటే నాకు ఎంతో ప్రాణం. ఒకసారి నేను వేరే సినిమా షూటింగ్‌లో ఉండగా వినాయక్ ఫోన్ చేసి, చరణ్ సినిమాలో ఒక క్యారెక్టర్ ఉందని, మూడు రోజులు డేట్స్ అడ్జస్ట్ చేయాలని అడిగారు. ఆయనపై ఉన్న గౌరవంతో నేను వెంటనే అంగీకరించాను” అని తెలిపారు.

3 రోజుల పాత్ర.. 18 రోజులకు పెరిగిందిలా.. షూటింగ్ మొదటి రోజు సెట్స్‌లో తాను చెప్పిన డైలాగ్స్‌, తన టైమింగ్ చూసి యూనిట్ సభ్యులంతా పగలబడి నవ్వారని, చప్పట్లు కొట్టారని పోసాని గుర్తు చేసుకున్నారు. ఆ రెస్పాన్స్ చూసి ఇంప్రెస్ అయిన వినాయక్.. మరుసటి రోజు వచ్చి తన పాత్ర నిడివిని మరింత పెంచుతున్నట్లు చెప్పారని వెల్లడించారు.అలా కేవలం 3 రోజుల కోసం అనుకున్న ఆ క్యారెక్టర్, తన కామెడీ టైమింగ్ వల్ల ఏకంగా 18 రోజుల షూటింగ్ చేసేంత పూర్తి స్థాయి పాత్రగా మారిపోయిందని తెలిపారు.

చిరంజీవి సపోర్ట్..

‘నాయక్’ సినిమా ఫైనల్ కాపీ చూసిన మెగాస్టార్ చిరంజీవి తన కామెడీ సీన్స్ చూసి ఎంతో ఎంజాయ్ చేశారని పోసాని చెప్పారు. ఆ సీన్స్ అద్భుతంగా వచ్చాయని, అందులో ఒక్క ఫ్రేమ్ కూడా కట్ చేయవద్దని చిరంజీవి స్వయంగా వినాయక్‌కు సూచించినట్లు ఆయన వెల్లడించారు. సినిమా రిలీజ్ అయిన వారం రోజుల్లోనే తన కామెడీకి వచ్చిన రెస్పాన్స్ చూసి, ఏకంగా 36 కొత్త సినిమాల్లో ఆఫర్లు వచ్చాయని పోసాని ఆనందం వ్యక్తం చేశారు. నటుడిగా తనకు అంతటి బిగ్ బ్రేక్ ఇచ్చిన ‘నాయక్’ సినిమాను, దర్శకుడు వినాయక్‌ను తన జీవితంలో ఎప్పటికీ మరువలేనని ఆయన భావోద్వేగానికి గురయ్యారు.

Click here to add News18 as your preferred news source on Google.

సినిమా న్యూస్, మూవీ అప్‌డేట్స్, సినిమా రివ్యూస్, OTT అప్‌డేట్స్, టీవీ షోస్‌, రియాల్టీ షోస్‌, వెబ్‌స్టోరీస్ ఈ కేటగిరీలో చూడొచ్చు. న్యూస్ 18 తెలుగులో లేటెస్ట్ ఎంటర్‌టైన్‌మెంట్ అప్‌డేట్స్ చదవండి. మరిన్ని వార్తల కోసం న్యూస్ 18 తెలుగు ఫాలో అవండి.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

×
prabhanews.co.in
Logo
Date of Publish : 24 July 2026, 6:38 am Digital Edition : Prabhanews
Posani Krishna Murali: ఆ ఒక్క సినిమాతో నా జీవితమే మారిపోయింది.. చూడగానే చిరంజీవి ఏమన్నారంటే..! | తెలుగు సినిమా వార్తలు

Last Updated:Jul 18, 2026 3:06 PM ISTఒకప్పుడు రచయితగా ఇండస్ట్రీని ఏలిన పోసాని, ఆ తర్వాత నటుడిగా, దర్శకుడిగా తనకంటూ ఒక ప్రత్యేకమైన బ్రాండ్ క్రియేట్ చేసుకున్నారు. ఆయన కెరీర్ లో చిరంజీవి పాత్ర మరువలేనిదట. News18టాలీవుడ్ ప్రముఖ రచయిత, విలక్షణ నటుడు పోసాని కృష్ణ మురళి (Posani Krishna Murali) సుదీర్ఘ విరామం తర్వాత వెండితెరపైకి గ్రాండ్ రీ ఎంట్రీ ఇచ్చారు. గత కొంతకాలంగా రాజకీయాల్లో బిజీగా ఉండి, సినిమాలకు పూర్తిగా దూరమైన ఆయన.. తాజాగా ‘ఆపరేషన్‌ అరుణారెడ్డి’ (Operation Arunareddy) చిత్రంతో ప్రేక్షకుల ముందుకు వచ్చారు. జులై 17న థియేటర్లలో విడుదలైన ఈ సినిమా ద్వారా ఆయన కేవలం నటుడిగానే కాకుండా.. దర్శకుడిగా, నిర్మాతగా, కథా రచయితగా బహుముఖ పాత్రలు పోషించడం విశేషం. సుమారు 150కి పైగా చిత్రాలకు వివిధ విభాగాల్లో పనిచేసిన అనుభవం ఉన్న పోసాని, ఈ సినిమా ప్రమోషన్స్‌లో భాగంగా తన వ్యక్తిగత, సినీ ప్రయాణం గురించి పలు ఆసక్తికరమైన విషయాలను పంచుకున్నారు. ముఖ్యంగా తన కెరీర్‌ను మలుపు తిప్పిన రామ్ చరణ్ సినిమా గురించి ఆయన చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు నెట్టింట వైరల్‌గా మారాయి.'ఆపరేషన్ అరుణారెడ్డి'తో రీ-ఎంట్రీ:ఒకప్పుడు రచయితగా ఇండస్ట్రీని ఏలిన పోసాని, ఆ తర్వాత నటుడిగా, దర్శకుడిగా తనకంటూ ఒక ప్రత్యేకమైన బ్రాండ్ క్రియేట్ చేసుకున్నారు. ఫైర్ బ్రాండ్ లీడర్‌గా రాజకీయాల్లోకి వెళ్లిన తర్వాత ఆయన సినిమాలకు గ్యాప్ ఇచ్చారు. ఇప్పుడు మళ్లీ తనే స్వయంగా బాధ్యతలు భుజాన వేసుకుని ‘ఆపరేషన్‌ అరుణారెడ్డి’ని తెరకెక్కించారు. ఈ చిత్రంలో పోసానితో పాటు హిందోళ చక్రవర్తి, కాజల్‌ శర్మ, ఆయేషా ఖాన్‌ తదితరులు కీలక పాత్రలు పోషించారు. తన మార్క్ డైలాగ్స్, స్క్రీన్ ప్లేతో ఈ సినిమాను ఆయన రూపొందించినట్లు తెలుస్తోంది.తన సినీ జీవితంలో రామ్ చరణ్, వీవీ వినాయక్ కాంబినేషన్‌లో వచ్చిన 'నాయక్' (Nayak) సినిమాకు ఎప్పటికీ ప్రత్యేక స్థానం ఉంటుందని పోసాని ఎమోషనల్ అయ్యారు. ఆయన మాట్లాడుతూ.. "నా యాక్టింగ్ కెరీర్‌ను పూర్తిగా మార్చేసిన చిత్రాల్లో ‘నాయక్’ దే మొదటి స్థానం. దర్శకుడు వీవీ వినాయక్ అంటే నాకు ఎంతో ప్రాణం. ఒకసారి నేను వేరే సినిమా షూటింగ్‌లో ఉండగా వినాయక్ ఫోన్ చేసి, చరణ్ సినిమాలో ఒక క్యారెక్టర్ ఉందని, మూడు రోజులు డేట్స్ అడ్జస్ట్ చేయాలని అడిగారు. ఆయనపై ఉన్న గౌరవంతో నేను వెంటనే అంగీకరించాను" అని తెలిపారు.3 రోజుల పాత్ర.. 18 రోజులకు పెరిగిందిలా.. షూటింగ్ మొదటి రోజు సెట్స్‌లో తాను చెప్పిన డైలాగ్స్‌, తన టైమింగ్ చూసి యూనిట్ సభ్యులంతా పగలబడి నవ్వారని, చప్పట్లు కొట్టారని పోసాని గుర్తు చేసుకున్నారు. ఆ రెస్పాన్స్ చూసి ఇంప్రెస్ అయిన వినాయక్.. మరుసటి రోజు వచ్చి తన పాత్ర నిడివిని మరింత పెంచుతున్నట్లు చెప్పారని వెల్లడించారు.అలా కేవలం 3 రోజుల కోసం అనుకున్న ఆ క్యారెక్టర్, తన కామెడీ టైమింగ్ వల్ల ఏకంగా 18 రోజుల షూటింగ్ చేసేంత పూర్తి స్థాయి పాత్రగా మారిపోయిందని తెలిపారు.చిరంజీవి సపోర్ట్..'నాయక్' సినిమా ఫైనల్ కాపీ చూసిన మెగాస్టార్ చిరంజీవి తన కామెడీ సీన్స్ చూసి ఎంతో ఎంజాయ్ చేశారని పోసాని చెప్పారు. ఆ సీన్స్ అద్భుతంగా వచ్చాయని, అందులో ఒక్క ఫ్రేమ్ కూడా కట్ చేయవద్దని చిరంజీవి స్వయంగా వినాయక్‌కు సూచించినట్లు ఆయన వెల్లడించారు. సినిమా రిలీజ్ అయిన వారం రోజుల్లోనే తన కామెడీకి వచ్చిన రెస్పాన్స్ చూసి, ఏకంగా 36 కొత్త సినిమాల్లో ఆఫర్లు వచ్చాయని పోసాని ఆనందం వ్యక్తం చేశారు. నటుడిగా తనకు అంతటి బిగ్ బ్రేక్ ఇచ్చిన 'నాయక్' సినిమాను, దర్శకుడు వినాయక్‌ను తన జీవితంలో ఎప్పటికీ మరువలేనని ఆయన భావోద్వేగానికి గురయ్యారు.Click here to add News18 as your preferred news source on Google. సినిమా న్యూస్, మూవీ అప్‌డేట్స్, సినిమా రివ్యూస్, OTT అప్‌డేట్స్, టీవీ షోస్‌, రియాల్టీ షోస్‌, వెబ్‌స్టోరీస్ ఈ కేటగిరీలో చూడొచ్చు. న్యూస్ 18 తెలుగులో లేటెస్ట్ ఎంటర్‌టైన్‌మెంట్ అప్‌డేట్స్ చదవండి. మరిన్ని వార్తల కోసం న్యూస్ 18 తెలుగు ఫాలో అవండి.Location :Hyderabad,Hyderabad,Telanganaమరింత చదవండి

Source link