ప్రభన్యూస్

Europe Weather: ఐరోపాను వణికిస్తున్న ఎండలు.. వడగాలులకు 50 వేల మందికి పైగా బలి! |


Last Updated:

Europe Weather: శీతల వాతావరణానికి, ఆహ్లాదకరమైన శీతాకాలాలకు చిరునామాగా నిలిచే ఐరోపా ఖండం ప్రస్తుతం తీవ్రమైన ఎండల తీవ్రతతో అల్లాడిపోతోంది.

ప్రతీకాత్మక చిత్రం
ప్రతీకాత్మక చిత్రం

గ్లోబల్ వార్మింగ్, పర్యావరణ మార్పులకు తోడు ఎల్‌నినో పరిస్థితులు తీవ్రరూపం దాల్చడంతో గతంలో ఎన్నడూ చూడని రీతిలో ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. పర్యవసానంగా సంభవించిన పెను వడగాలుల ధాటికి ఐరోపావ్యాప్తంగా వేలాది మంది ప్రాణాలు కోల్పోయినట్లు తాజా అంతర్జాతీయ అధ్యయనం దిగ్భ్రాంతికర వాస్తవాలను వెల్లడించింది. వివిధ ఐరోపా దేశాల్లోని 854 నగరాల్లో నిర్వహించిన పరిశోధనల ప్రకారం.. జూన్, జులై, ఆగస్టు నెలల్లో పదేపదే విరుచుకుపడిన తీవ్ర వడగాలుల కారణంగా ఏకంగా 50,391 మంది మృతి చెందినట్లు తేలింది.

శిలాజ ఇంధనాల వినియోగమే ప్రధాన కారణం

ఈ భారీ ప్రాణనష్టానికి మానవ తప్పిదాలే ప్రధాన కారణమని శాస్త్రవేత్తలు తేల్చిచెప్పారు. మొత్తం 50,391 మరణాలలో దాదాపు 32,619 మరణాలు బొగ్గు, చమురు, సహజవాయువు వంటి శిలాజ ఇంధనాలను విచ్చలవిడిగా మండించడం ద్వారా పెరిగిన ఉష్ణోగ్రతల వల్లే సంభవించినట్లు పరిశోధకులు గుర్తించారు. ప్రకృతి సమతుల్యతను దెబ్బతీసే చర్యలు మానవాళి మనుగడకే ముప్పుగా మారుతున్నాయని ఈ గణాంకాలు హెచ్చరిస్తున్నాయి. ప్రముఖ సైన్స్ జర్నల్ ‘నేచర్ హెల్త్’ లో త్వరలోనే ప్రచురితం కానున్న ఈ అధ్యయనాన్ని ఇంపీరియల్ కాలేజ్ లండన్ పరిశోధక బృందం నిర్వహించింది. తీవ్ర ఎండలు నమోదైన 2022 సంవత్సరంలో 29,480 మంది మరణించగా, ఆ సంఖ్యతో పోలిస్తే ఈసారి మరణాలు ఏకంగా 71 శాతం పెరగడం శాస్త్రవేత్తలను తీవ్ర విస్మయానికి గురిచేస్తోంది.

రికార్డు స్థాయి ఉష్ణోగ్రతలు – వృద్ధులపై తీవ్ర ప్రభావం

ఐరోపా దేశాల్లో సాధారణంగా వేసవి కాలంలో ఉష్ణోగ్రతలు 12 నుంచి 35 డిగ్రీల సెల్సియస్ మధ్య మాత్రమే నమోదవుతుంటాయి. కానీ ఈ ఏడాది తీవ్రమైన మార్పులతో ఫ్రాన్స్‌లో ఏకంగా 43.8 డిగ్రీలు, జర్మనీలో 41.7 డిగ్రీలు, బ్రిటన్‌లో 37.3 డిగ్రీల సెల్సియస్ మేర గరిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. ఈ ఎండల ధాటికి ఇటలీ, ఫ్రాన్స్, స్పెయిన్, జర్మనీ దేశాల్లో అత్యధిక సంఖ్యలో ప్రజలు ప్రాణాలు వదిలారు. మొత్తం సంభవించిన మరణాలలో మూడో వంతు మరణాలు వేడిగాలులు తీవ్రస్థాయికి చేరిన జూన్ 17 నుంచి జులై 1 మధ్య కేవలం రెండు వారాల స్వల్ప వ్యవధిలోనే సంభవించడం తీవ్రతకు నిదర్శనం.

అధిక ఉష్ణోగ్రతలకు బలైన వారిలో సగానికి పైగా 85 ఏళ్లు పైబడిన వృద్ధులే ఉన్నారని నివేదిక స్పష్టం చేసింది. వయోభారం, అనారోగ్య సమస్యల కారణంగా వారు తీవ్రమైన ఉక్కపోత, వేడిని తట్టుకోలేకపోయారు. మరోవైపు 20 నుంచి 44 ఏళ్ల మధ్య వయసున్న యువత కూడా దాదాపు 800 మంది వరకు ఈ వడగాలుల బారినపడి ప్రాణాలు కోల్పోవడం ఆందోళన కలిగిస్తోంది.

వాతావరణ మార్పుల వేగానికి తగినట్లుగా ముందస్తు రక్షణ చర్యలు, అత్యవసర ప్రణాళికలు చేపట్టడంలో ఐరోపా దేశాల ప్రభుత్వాలు ఘోరంగా విఫలమయ్యాయని, ఆ నిర్లక్ష్యం వల్లే వేలాది మంది ప్రాణాలు గాల్లో కలిసిపోయాయని పరిశోధకులు స్పష్టం చేశారు. తక్షణమే కర్బన ఉద్గారాలను తగ్గించి, పర్యావరణ పరిరక్షణ దిశగా సమగ్ర చర్యలు చేపట్టకపోతే భవిష్యత్తులో ఇంతకంటే ఘోరమైన విపత్తులు తప్పవని హెచ్చరించారు.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

×
prabhanews.co.in
Logo
Date of Publish : 24 October 2026, 8:05 am Digital Edition : Prabhanews
Europe Weather: ఐరోపాను వణికిస్తున్న ఎండలు.. వడగాలులకు 50 వేల మందికి పైగా బలి! |

Last Updated:Oct 24, 2026 8:04 AM ISTEurope Weather: శీతల వాతావరణానికి, ఆహ్లాదకరమైన శీతాకాలాలకు చిరునామాగా నిలిచే ఐరోపా ఖండం ప్రస్తుతం తీవ్రమైన ఎండల తీవ్రతతో అల్లాడిపోతోంది.ప్రతీకాత్మక చిత్రంగ్లోబల్ వార్మింగ్, పర్యావరణ మార్పులకు తోడు ఎల్‌నినో పరిస్థితులు తీవ్రరూపం దాల్చడంతో గతంలో ఎన్నడూ చూడని రీతిలో ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. పర్యవసానంగా సంభవించిన పెను వడగాలుల ధాటికి ఐరోపావ్యాప్తంగా వేలాది మంది ప్రాణాలు కోల్పోయినట్లు తాజా అంతర్జాతీయ అధ్యయనం దిగ్భ్రాంతికర వాస్తవాలను వెల్లడించింది. వివిధ ఐరోపా దేశాల్లోని 854 నగరాల్లో నిర్వహించిన పరిశోధనల ప్రకారం.. జూన్, జులై, ఆగస్టు నెలల్లో పదేపదే విరుచుకుపడిన తీవ్ర వడగాలుల కారణంగా ఏకంగా 50,391 మంది మృతి చెందినట్లు తేలింది.శిలాజ ఇంధనాల వినియోగమే ప్రధాన కారణంఈ భారీ ప్రాణనష్టానికి మానవ తప్పిదాలే ప్రధాన కారణమని శాస్త్రవేత్తలు తేల్చిచెప్పారు. మొత్తం 50,391 మరణాలలో దాదాపు 32,619 మరణాలు బొగ్గు, చమురు, సహజవాయువు వంటి శిలాజ ఇంధనాలను విచ్చలవిడిగా మండించడం ద్వారా పెరిగిన ఉష్ణోగ్రతల వల్లే సంభవించినట్లు పరిశోధకులు గుర్తించారు. ప్రకృతి సమతుల్యతను దెబ్బతీసే చర్యలు మానవాళి మనుగడకే ముప్పుగా మారుతున్నాయని ఈ గణాంకాలు హెచ్చరిస్తున్నాయి. ప్రముఖ సైన్స్ జర్నల్ ‘నేచర్ హెల్త్’ లో త్వరలోనే ప్రచురితం కానున్న ఈ అధ్యయనాన్ని ఇంపీరియల్ కాలేజ్ లండన్ పరిశోధక బృందం నిర్వహించింది. తీవ్ర ఎండలు నమోదైన 2022 సంవత్సరంలో 29,480 మంది మరణించగా, ఆ సంఖ్యతో పోలిస్తే ఈసారి మరణాలు ఏకంగా 71 శాతం పెరగడం శాస్త్రవేత్తలను తీవ్ర విస్మయానికి గురిచేస్తోంది.రికార్డు స్థాయి ఉష్ణోగ్రతలు – వృద్ధులపై తీవ్ర ప్రభావంఐరోపా దేశాల్లో సాధారణంగా వేసవి కాలంలో ఉష్ణోగ్రతలు 12 నుంచి 35 డిగ్రీల సెల్సియస్ మధ్య మాత్రమే నమోదవుతుంటాయి. కానీ ఈ ఏడాది తీవ్రమైన మార్పులతో ఫ్రాన్స్‌లో ఏకంగా 43.8 డిగ్రీలు, జర్మనీలో 41.7 డిగ్రీలు, బ్రిటన్‌లో 37.3 డిగ్రీల సెల్సియస్ మేర గరిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. ఈ ఎండల ధాటికి ఇటలీ, ఫ్రాన్స్, స్పెయిన్, జర్మనీ దేశాల్లో అత్యధిక సంఖ్యలో ప్రజలు ప్రాణాలు వదిలారు. మొత్తం సంభవించిన మరణాలలో మూడో వంతు మరణాలు వేడిగాలులు తీవ్రస్థాయికి చేరిన జూన్ 17 నుంచి జులై 1 మధ్య కేవలం రెండు వారాల స్వల్ప వ్యవధిలోనే సంభవించడం తీవ్రతకు నిదర్శనం.అధిక ఉష్ణోగ్రతలకు బలైన వారిలో సగానికి పైగా 85 ఏళ్లు పైబడిన వృద్ధులే ఉన్నారని నివేదిక స్పష్టం చేసింది. వయోభారం, అనారోగ్య సమస్యల కారణంగా వారు తీవ్రమైన ఉక్కపోత, వేడిని తట్టుకోలేకపోయారు. మరోవైపు 20 నుంచి 44 ఏళ్ల మధ్య వయసున్న యువత కూడా దాదాపు 800 మంది వరకు ఈ వడగాలుల బారినపడి ప్రాణాలు కోల్పోవడం ఆందోళన కలిగిస్తోంది.వాతావరణ మార్పుల వేగానికి తగినట్లుగా ముందస్తు రక్షణ చర్యలు, అత్యవసర ప్రణాళికలు చేపట్టడంలో ఐరోపా దేశాల ప్రభుత్వాలు ఘోరంగా విఫలమయ్యాయని, ఆ నిర్లక్ష్యం వల్లే వేలాది మంది ప్రాణాలు గాల్లో కలిసిపోయాయని పరిశోధకులు స్పష్టం చేశారు. తక్షణమే కర్బన ఉద్గారాలను తగ్గించి, పర్యావరణ పరిరక్షణ దిశగా సమగ్ర చర్యలు చేపట్టకపోతే భవిష్యత్తులో ఇంతకంటే ఘోరమైన విపత్తులు తప్పవని హెచ్చరించారు.మరింత చదవండి

Source link