కోల్‌కతా దుర్గా పూజ పండల్‌లో తొక్కిసలాట.. 17 మంది దుర్మరణం.. 35 మంది భక్తులకు గాయాలు |


Last Updated:

కోల్‌కతాలోని చోర్‌బగాన్ దుర్గా పూజా పండల్‌లో సప్తమి వేళ ఒక్కసారిగా తొక్కిసలాట జరిగింది. విపరీతమైన రద్దీ, ఉక్కపోత వల్ల చోటుచేసుకున్న ఈ ప్రమాదంలో 35 మంది భక్తులు తీవ్రంగా గాయపడ్డారు.

News18
News18

పశ్చిమ బెంగాల్ రాజధాని కోల్‌కతాలో దసరా నవరాత్రి వేడుకల్లో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. నార్త్ కోల్‌కతా పరిధిలోని ప్రముఖ చోర్‌బగాన్ సార్వజనీన్ దుర్గా పూజా పండల్‌లో శనివారం సాయంత్రం సప్తమి పూజల సందర్భంగా ఒక్కసారిగా తొక్కిసలాట జరిగింది. విపరీతమైన రద్దీ, విపరీతమైన ఉక్కపోత కారణంగా భక్తుల్లో భయాందోళనలు చెలరేగి తోపులాట మొదలైంది. ఇదే సమయంలో భక్తుల ఒత్తిడికి తాళలేక పండల్ ఒక భాగం కుప్పకూలిపోవడంతో పరిస్థితి మరింత దిగజారింది. ఈ ఘోర దుర్ఘటనలో కనీసం 17 మంది భక్తులు మృతి చెందగా, మరో 35 మంది తీవ్రంగా గాయపడ్డారు. ప్రమాద తీవ్రతను గమనించిన అధికారులు సహాయక చర్యల కోసం పండల్‌ను వెంటనే తాత్కాలికంగా మూసివేశారు.

సీఎం పరామర్శ..

ప్రమాదం జరిగిన వెంటనే పోలీసులు, విపత్తు నిర్వహణ బృందాలు రంగంలోకి దిగాయి. నిర్వాహకులు, రెస్క్యూ సిబ్బంది కలిసి క్షతగాత్రులను కోల్‌కతా మెడికల్ కాలేజ్ ఆస్పత్రికి తరలించారు. విషయం తెలిసిన వెంటనే పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి సువేందు అధికారి, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి మనోజ్ అగర్వాల్ ఆసుపత్రికి చేరుకుని క్షతగాత్రులను పరామర్శించారు. మెరుగైన వైద్యం అందించాలని ఆదేశించారు.

మాజీ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ఈ ఘటనపై తీవ్ర విచారం వ్యక్తం చేశారు. చోర్‌బగాన్ పూజా పండల్‌లో తొక్కిసలాట జరగడం తనను తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేసిందని సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. గాయపడిన భక్తులు త్వరగా కోలుకోవాలని అమ్మవారిని ప్రార్థిస్తూ, వారి కుటుంబాలకు ధైర్యాన్ని ఇవ్వాలని పేర్కొన్నారు.

రద్దీ నియంత్రణ కోసం పోలీసులు మైదానం చుట్టూ భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. తొక్కిసలాటకు దారితీసిన ఖచ్చితమైన కారణాలపై అధికారులు దర్యాప్తు చేస్తున్నారు. పండల్ పునర్నిర్మాణ పనులు, భద్రతా ఏర్పాట్లు సరిచూసిన తర్వాతే మళ్లీ దర్శనాలకు అనుమతి ఇస్తామని అధికారులు వెల్లడించారు.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

×
prabhanews.co.in
Logo
Date of Publish : 17 October 2026, 10:42 pm Digital Edition : Prabhanews
కోల్‌కతా దుర్గా పూజ పండల్‌లో తొక్కిసలాట.. 17 మంది దుర్మరణం.. 35 మంది భక్తులకు గాయాలు |

Last Updated:Oct 17, 2026 10:42 PM ISTకోల్‌కతాలోని చోర్‌బగాన్ దుర్గా పూజా పండల్‌లో సప్తమి వేళ ఒక్కసారిగా తొక్కిసలాట జరిగింది. విపరీతమైన రద్దీ, ఉక్కపోత వల్ల చోటుచేసుకున్న ఈ ప్రమాదంలో 35 మంది భక్తులు తీవ్రంగా గాయపడ్డారు.News18పశ్చిమ బెంగాల్ రాజధాని కోల్‌కతాలో దసరా నవరాత్రి వేడుకల్లో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. నార్త్ కోల్‌కతా పరిధిలోని ప్రముఖ చోర్‌బగాన్ సార్వజనీన్ దుర్గా పూజా పండల్‌లో శనివారం సాయంత్రం సప్తమి పూజల సందర్భంగా ఒక్కసారిగా తొక్కిసలాట జరిగింది. విపరీతమైన రద్దీ, విపరీతమైన ఉక్కపోత కారణంగా భక్తుల్లో భయాందోళనలు చెలరేగి తోపులాట మొదలైంది. ఇదే సమయంలో భక్తుల ఒత్తిడికి తాళలేక పండల్ ఒక భాగం కుప్పకూలిపోవడంతో పరిస్థితి మరింత దిగజారింది. ఈ ఘోర దుర్ఘటనలో కనీసం 17 మంది భక్తులు మృతి చెందగా, మరో 35 మంది తీవ్రంగా గాయపడ్డారు. ప్రమాద తీవ్రతను గమనించిన అధికారులు సహాయక చర్యల కోసం పండల్‌ను వెంటనే తాత్కాలికంగా మూసివేశారు.సీఎం పరామర్శ..ప్రమాదం జరిగిన వెంటనే పోలీసులు, విపత్తు నిర్వహణ బృందాలు రంగంలోకి దిగాయి. నిర్వాహకులు, రెస్క్యూ సిబ్బంది కలిసి క్షతగాత్రులను కోల్‌కతా మెడికల్ కాలేజ్ ఆస్పత్రికి తరలించారు. విషయం తెలిసిన వెంటనే పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి సువేందు అధికారి, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి మనోజ్ అగర్వాల్ ఆసుపత్రికి చేరుకుని క్షతగాత్రులను పరామర్శించారు. మెరుగైన వైద్యం అందించాలని ఆదేశించారు.
Kolkata, West Bengal: Chief Minister Suvendu Adhikari and Chief Secretary Manoj Agarwal reached Calcutta Medical College amid reports of a stampede-like situation at the Chorebagan Durga Puja pandal. Several people are feared injured, with the injured being taken to the hospital. Further details are awaited.
— IANS (@ians_india) October 17, 2026మాజీ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ఈ ఘటనపై తీవ్ర విచారం వ్యక్తం చేశారు. చోర్‌బగాన్ పూజా పండల్‌లో తొక్కిసలాట జరగడం తనను తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేసిందని సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. గాయపడిన భక్తులు త్వరగా కోలుకోవాలని అమ్మవారిని ప్రార్థిస్తూ, వారి కుటుంబాలకు ధైర్యాన్ని ఇవ్వాలని పేర్కొన్నారు.
Deeply shocked and saddened to learn about the stampede at the Chore Bagan Puja Pandal.
I pray to Maa Durga for the speedy recovery of all those injured and for strength and courage for their families during this difficult time.— Mamata Banerjee (@MamataOfficial) October 17, 2026రద్దీ నియంత్రణ కోసం పోలీసులు మైదానం చుట్టూ భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. తొక్కిసలాటకు దారితీసిన ఖచ్చితమైన కారణాలపై అధికారులు దర్యాప్తు చేస్తున్నారు. పండల్ పునర్నిర్మాణ పనులు, భద్రతా ఏర్పాట్లు సరిచూసిన తర్వాతే మళ్లీ దర్శనాలకు అనుమతి ఇస్తామని అధికారులు వెల్లడించారు.మరింత చదవండి

Source link