మిథిలేష్ కేవలం రెండు రోజులకే బిగ్ బాస్ ఆఫర్ చేసిన రూ. 15 లక్షల సూట్‌కేస్‌ను తీసుకుని హౌస్‌ను వీడగా, మరో వైల్డ్ కార్డ్ కంటెస్టెంట్ అపూర్వ ఆటతీరు కూడా విసుగు తెప్పించింది. హౌస్‌లోకి ఎంట్రీ ఇచ్చిన వెంటనే కెప్టెన్సీ బాధ్యతలు చేపట్టిన అపూర్వ, ఆ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోలేకపోయింది. తోటి కంటెస్టెంట్లతో కలుపుగోలుగా ఉండకుండా, ప్రతి చిన్న విషయానికి అరుస్తూ, గొడవలు పడుతూ ప్రేక్షకులకు తీవ్ర అసహనం కలిగించింది.

