అయితే ఈ వాషింగ్ మెషీన్ కొనేముందు కొన్ని విషయాలు గుర్తుంచుకోవాలి. రూ.4,671 ధరకు లభిస్తున్న ఈ 8.5 కిలోల ఫాక్స్‌స్కై వాషింగ్ మెషీన్ తక్కువ బడ్జెట్‌లో ఎక్కువ బట్టలు ఉతకగల మెషీన్ కోసం చూస్తున్నవారిని లక్ష్యంగా చేసుకుంది. అయితే, ఇది సెమీ ఆటోమేటిక్ మోడల్ అనే విషయాన్ని గుర్తుంచుకోవాలి. ఇందులో ఇన్‌బిల్ట్ హీటర్, స్టీమ్ ఫంక్షన్, వై-ఫై కనెక్టివిటీ, డిజిటల్ డిస్‌ప్లే వంటి ఫీచర్లు ఉండవు. బట్టలు ఉతికే ప్రక్రియ పూర్తిగా ఆటోమేటిక్‌గా జరగాలని కోరుకునేవారు లేదా అధునాతన ఫీచర్లు కావాలనుకునేవారు ఎక్కువ ధర ఉన్న ఇతర మోడళ్లను పరిశీలించాల్సి ఉంటుంది. కొనుగోలు చేసే ముందు ఫ్లిప్‌కార్ట్‌లో తాజా ధర, వారంటీ వివరాలు, అదనపు ఛార్జీలు, చివరగా చెల్లించాల్సిన మొత్తం గురించి తెలుసుకోవడం మంచిది. (image: Flipkart)

