పీఎఫ్‌కు సంబంధించిన ప్రతి పని కోసం ఆఫీసుకు వెళ్లాల్సిన అవసరం ఇప్పుడు చాలా వరకు తగ్గింది. క్లెయిమ్ స్టేటస్ తెలుసుకోవడం నుంచి ఆన్‌లైన్‌లో క్లెయిమ్ పెట్టడం, యూఏఎన్, కేవైసీ వివరాలు నిర్వహించడం వరకు ఈపీఎఫ్‌వో పలు సేవలను ఆన్‌లైన్‌లో అందిస్తోంది. ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ (ఈపీఎఫ్‌వో) పీఎఫ్ సభ్యుల కోసం ఎన్నో ఆన్‌లైన్ సేవలు అందిస్తోందని మనీకంట్రోల్ కథనం వివరించింది. యూనిఫైడ్ మెంబర్ పోర్టల్ ద్వారా యూఏఎన్, క్లెయిమ్స్, కేవైసీ, పీఎఫ్ ట్రాన్స్‌ఫర్ వంటి పలు పనులను ఆన్‌లైన్‌లో చేసుకోవచ్చు. దీంతో చిన్న చిన్న పనుల కోసం పీఎఫ్ ఆఫీసుకు పదేపదే వెళ్లాల్సిన అవసరం ఉండదు. (ప్రతీకాత్మక చిత్రం)

