ప్రభన్యూస్

Nail Polish: నెయిల్ పాలిష్ వాడితే క్యాన్సర్ వస్తుందా? అసలు నిజం ఏంటి.. మెడికల్ ఎక్స్‌పర్ట్స్ ఏం చెబుతున్నారు? | లైఫ్ స్టైల్


Last Updated:

నెయిల్ పాలిష్‌లో ఉండే రసాయనాలు ఎంత ప్రమాదకరం? అప్పుడప్పుడు నెయిల్ పాలిష్ వేసుకోవడం వల్ల క్యాన్సర్ వచ్చే అవకాశం ఉందా? జెల్ మానిక్యూర్‌లో ఉపయోగించే యూవీ ల్యాంప్స్ వల్ల ఏమైనా ప్రమాదం ఉందా? అనే సందేహాలు చాలామందికి ఉన్నాయి.

News18
News18

అందమైన గోళ్ల కోసం నెయిల్ పాలిష్, జెల్ నెయిల్స్, మానిక్యూర్ వంటివి చేసుకోవడం ఇప్పుడు సాధారణంగా మారిపోయింది. అయితే నెయిల్ పాలిష్ వాడటం వల్ల క్యాన్సర్ వస్తుందంటూ సోషల్ మీడియాలో, నెట్టింట కొన్ని వార్తలు వైరల్ అవుతున్నాయి. దీంతో చాలామందిలో ఆందోళన మొదలైంది. అసలు నెయిల్ పాలిష్‌లో ఉండే రసాయనాలు ఎంత ప్రమాదకరం? అప్పుడప్పుడు నెయిల్ పాలిష్ వేసుకోవడం వల్ల క్యాన్సర్ వచ్చే అవకాశం ఉందా? జెల్ మానిక్యూర్‌లో ఉపయోగించే యూవీ ల్యాంప్స్ వల్ల ఏమైనా ప్రమాదం ఉందా? అనే సందేహాలు చాలామందికి ఉన్నాయి.

కొన్ని నెయిల్ పాలిష్‌లలో ఫార్మాల్డిహైడ్, టోల్యూయీన్, డైబ్యూటైల్ ఫ్తాలేట్ (DBP) వంటి రసాయనాలను గతంలో ఎక్కువగా ఉపయోగించేవారు. వీటిని కొన్నిసార్లు “టాక్సిక్ ట్రియో” అని కూడా పిలుస్తారు. ఫార్మాల్డిహైడ్‌ను గోళ్లను గట్టిగా ఉంచడానికి, టోల్యూయీన్‌ను పాలిష్‌లోని పదార్థాలను కలపడానికి, DBPను పాలిష్ పగలకుండా ఉండేందుకు ఉపయోగించేవారు. ఫార్మాల్డిహైడ్‌కు ఎక్కువ స్థాయిలో, దీర్ఘకాలం గురికావడం ఆరోగ్యానికి హానికరం అని ఆరోగ్య సంస్థలు గుర్తించాయి. అయితే ఈ విషయాలను బట్టి సాధారణంగా అప్పుడప్పుడు నెయిల్ పాలిష్ ఉపయోగించే ప్రతి ఒక్కరికీ క్యాన్సర్ వస్తుందని చెప్పడం సరైనది కాదని అన్నారు మెడికవర్ ఇంటర్నల్ మెడిసిన్ డాక్టర్ కార్తీక్ రావ్ తెలిపారు

నెయిల్ పాలిష్‌కు సంబంధించి ప్రమాదం ఎక్కువగా ఉండే వర్గాల్లో రోజూ ఎక్కువసేపు ఈ ఉత్పత్తులతో పనిచేసే బ్యూటీషియన్లు ఉండవచ్చు. ముఖ్యంగా గాలి ప్రసరణ సరిగా లేని ప్రదేశాల్లో గంటల తరబడి రసాయనాల వాసనకు గురికావడం వల్ల ఇబ్బందులు తలెత్తే అవకాశం ఉంటుంది. అందుకే నెయిల్ సెలూన్లలో సరైన వెంటిలేషన్ ఉండటం, అవసరమైన భద్రతా చర్యలు తీసుకోవడం ముఖ్యం. ప్రస్తుతం మార్కెట్‌లో 3-free, 5-free, 10-free వంటి పేర్లతో కొన్ని రసాయనాలను తొలగించిన నెయిల్ పాలిష్ ఉత్పత్తులు కూడా అందుబాటులో ఉన్నాయి.

ఇక జెల్ మానిక్యూర్ విషయానికి వస్తే, జెల్ పాలిష్‌ను ఆరబెట్టడానికి యూవీ లేదా LED ల్యాంప్స్ ఉపయోగిస్తారు. ఈ కాంతికి పదేపదే గురికావడం వల్ల చర్మంపై యూవీ ప్రభావం ఉండొచ్చని పరిశోధనలు సూచిస్తున్నాయి. కొన్ని ప్రయోగశాల అధ్యయనాల్లో యూవీ డ్రైయర్ల కాంతి కణాలపై డీఎన్‌ఏ నష్టానికి కారణమయ్యే మార్పులను చూపించింది. అయితే ల్యాబ్‌లో కణాలపై చేసిన ప్రయోగాల ఫలితాలను నేరుగా మనుషుల్లో క్యాన్సర్ వచ్చే ప్రమాదంగా భావించకూడదు. అప్పుడప్పుడు జెల్ మానిక్యూర్ చేసుకోవడం వల్ల చర్మ క్యాన్సర్ వస్తుందని నిర్ధారించే బలమైన ఆధారాలు ప్రస్తుతం లేవు.

అయితే తరచుగా జెల్ మానిక్యూర్ చేసుకునేవారు కొన్ని జాగ్రత్తలు తీసుకోవచ్చు. యూవీ ల్యాంప్ ఉపయోగించే ముందు చేతులపై SPF 30 లేదా అంతకంటే ఎక్కువ సన్‌స్క్రీన్ రాసుకోవచ్చు. వేళ్లను మాత్రమే బయటకు ఉంచే యూవీ రక్షణ గ్లోవ్స్ కూడా ఉపయోగించవచ్చు. అలాగే నెయిల్ పాలిష్ వేసుకునే సమయంలో గది కిటికీలు తెరిచి ఉంచడం లేదా మంచి వెంటిలేషన్ ఉన్న ప్రదేశాన్ని ఎంచుకోవడం మంచిది.

నెయిల్ పాలిష్ వల్ల క్యాన్సర్ కంటే అలర్జీ, చర్మం ఎర్రబడటం, దురద, గోళ్లు బలహీనపడటం, గోళ్ల రంగు మారడం వంటి సమస్యలు ఎక్కువగా కనిపించవచ్చు. అందుకే గోళ్లకు మధ్యమధ్యలో విరామం ఇవ్వడం, పాలిష్‌ను ఎక్కువకాలం అలాగే ఉంచకుండా తొలగించడం, నాణ్యమైన ఉత్పత్తులను ఎంచుకోవడం మంచిది. నెయిల్ పాలిష్ ఉపయోగించిన తర్వాత చర్మంపై తీవ్రమైన దద్దుర్లు, వాపు లేదా గోళ్లలో అసాధారణ మార్పులు కనిపిస్తే వైద్యుడిని సంప్రదించాలి.

మొత్తంగా, అప్పుడప్పుడు నెయిల్ పాలిష్ వేసుకోవడం వల్ల నేరుగా క్యాన్సర్ వస్తుందని చెప్పడానికి బలమైన ఆధారాలు లేవు. అయితే రసాయనాలకు దీర్ఘకాలం, అధిక స్థాయిలో గురికావడాన్ని తగ్గించడం, గాలి ప్రసరణ ఉండేలా చూసుకోవడం, జెల్ మానిక్యూర్‌లో యూవీ ఎక్స్‌పోజర్‌ను తగ్గించడం వంటి జాగ్రత్తలు పాటించడం మంచిది. సోషల్ మీడియాలో వచ్చే భయపెట్టే సమాచారాన్ని నమ్మే ముందు విశ్వసనీయ వైద్య వర్గాల సమాచారం తెలుసుకోవడం ఉత్తమం.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

×
prabhanews.co.in
Logo
Date of Publish : 21 September 2026, 2:53 pm Digital Edition : Prabhanews
Nail Polish: నెయిల్ పాలిష్ వాడితే క్యాన్సర్ వస్తుందా? అసలు నిజం ఏంటి.. మెడికల్ ఎక్స్‌పర్ట్స్ ఏం చెబుతున్నారు? | లైఫ్ స్టైల్

Last Updated:Sep 21, 2026 2:50 PM ISTనెయిల్ పాలిష్‌లో ఉండే రసాయనాలు ఎంత ప్రమాదకరం? అప్పుడప్పుడు నెయిల్ పాలిష్ వేసుకోవడం వల్ల క్యాన్సర్ వచ్చే అవకాశం ఉందా? జెల్ మానిక్యూర్‌లో ఉపయోగించే యూవీ ల్యాంప్స్ వల్ల ఏమైనా ప్రమాదం ఉందా? అనే సందేహాలు చాలామందికి ఉన్నాయి.News18అందమైన గోళ్ల కోసం నెయిల్ పాలిష్, జెల్ నెయిల్స్, మానిక్యూర్ వంటివి చేసుకోవడం ఇప్పుడు సాధారణంగా మారిపోయింది. అయితే నెయిల్ పాలిష్ వాడటం వల్ల క్యాన్సర్ వస్తుందంటూ సోషల్ మీడియాలో, నెట్టింట కొన్ని వార్తలు వైరల్ అవుతున్నాయి. దీంతో చాలామందిలో ఆందోళన మొదలైంది. అసలు నెయిల్ పాలిష్‌లో ఉండే రసాయనాలు ఎంత ప్రమాదకరం? అప్పుడప్పుడు నెయిల్ పాలిష్ వేసుకోవడం వల్ల క్యాన్సర్ వచ్చే అవకాశం ఉందా? జెల్ మానిక్యూర్‌లో ఉపయోగించే యూవీ ల్యాంప్స్ వల్ల ఏమైనా ప్రమాదం ఉందా? అనే సందేహాలు చాలామందికి ఉన్నాయి.కొన్ని నెయిల్ పాలిష్‌లలో ఫార్మాల్డిహైడ్, టోల్యూయీన్, డైబ్యూటైల్ ఫ్తాలేట్ (DBP) వంటి రసాయనాలను గతంలో ఎక్కువగా ఉపయోగించేవారు. వీటిని కొన్నిసార్లు “టాక్సిక్ ట్రియో” అని కూడా పిలుస్తారు. ఫార్మాల్డిహైడ్‌ను గోళ్లను గట్టిగా ఉంచడానికి, టోల్యూయీన్‌ను పాలిష్‌లోని పదార్థాలను కలపడానికి, DBPను పాలిష్ పగలకుండా ఉండేందుకు ఉపయోగించేవారు. ఫార్మాల్డిహైడ్‌కు ఎక్కువ స్థాయిలో, దీర్ఘకాలం గురికావడం ఆరోగ్యానికి హానికరం అని ఆరోగ్య సంస్థలు గుర్తించాయి. అయితే ఈ విషయాలను బట్టి సాధారణంగా అప్పుడప్పుడు నెయిల్ పాలిష్ ఉపయోగించే ప్రతి ఒక్కరికీ క్యాన్సర్ వస్తుందని చెప్పడం సరైనది కాదని అన్నారు మెడికవర్ ఇంటర్నల్ మెడిసిన్ డాక్టర్ కార్తీక్ రావ్ తెలిపారునెయిల్ పాలిష్‌కు సంబంధించి ప్రమాదం ఎక్కువగా ఉండే వర్గాల్లో రోజూ ఎక్కువసేపు ఈ ఉత్పత్తులతో పనిచేసే బ్యూటీషియన్లు ఉండవచ్చు. ముఖ్యంగా గాలి ప్రసరణ సరిగా లేని ప్రదేశాల్లో గంటల తరబడి రసాయనాల వాసనకు గురికావడం వల్ల ఇబ్బందులు తలెత్తే అవకాశం ఉంటుంది. అందుకే నెయిల్ సెలూన్లలో సరైన వెంటిలేషన్ ఉండటం, అవసరమైన భద్రతా చర్యలు తీసుకోవడం ముఖ్యం. ప్రస్తుతం మార్కెట్‌లో 3-free, 5-free, 10-free వంటి పేర్లతో కొన్ని రసాయనాలను తొలగించిన నెయిల్ పాలిష్ ఉత్పత్తులు కూడా అందుబాటులో ఉన్నాయి.ఇక జెల్ మానిక్యూర్ విషయానికి వస్తే, జెల్ పాలిష్‌ను ఆరబెట్టడానికి యూవీ లేదా LED ల్యాంప్స్ ఉపయోగిస్తారు. ఈ కాంతికి పదేపదే గురికావడం వల్ల చర్మంపై యూవీ ప్రభావం ఉండొచ్చని పరిశోధనలు సూచిస్తున్నాయి. కొన్ని ప్రయోగశాల అధ్యయనాల్లో యూవీ డ్రైయర్ల కాంతి కణాలపై డీఎన్‌ఏ నష్టానికి కారణమయ్యే మార్పులను చూపించింది. అయితే ల్యాబ్‌లో కణాలపై చేసిన ప్రయోగాల ఫలితాలను నేరుగా మనుషుల్లో క్యాన్సర్ వచ్చే ప్రమాదంగా భావించకూడదు. అప్పుడప్పుడు జెల్ మానిక్యూర్ చేసుకోవడం వల్ల చర్మ క్యాన్సర్ వస్తుందని నిర్ధారించే బలమైన ఆధారాలు ప్రస్తుతం లేవు.అయితే తరచుగా జెల్ మానిక్యూర్ చేసుకునేవారు కొన్ని జాగ్రత్తలు తీసుకోవచ్చు. యూవీ ల్యాంప్ ఉపయోగించే ముందు చేతులపై SPF 30 లేదా అంతకంటే ఎక్కువ సన్‌స్క్రీన్ రాసుకోవచ్చు. వేళ్లను మాత్రమే బయటకు ఉంచే యూవీ రక్షణ గ్లోవ్స్ కూడా ఉపయోగించవచ్చు. అలాగే నెయిల్ పాలిష్ వేసుకునే సమయంలో గది కిటికీలు తెరిచి ఉంచడం లేదా మంచి వెంటిలేషన్ ఉన్న ప్రదేశాన్ని ఎంచుకోవడం మంచిది.నెయిల్ పాలిష్ వల్ల క్యాన్సర్ కంటే అలర్జీ, చర్మం ఎర్రబడటం, దురద, గోళ్లు బలహీనపడటం, గోళ్ల రంగు మారడం వంటి సమస్యలు ఎక్కువగా కనిపించవచ్చు. అందుకే గోళ్లకు మధ్యమధ్యలో విరామం ఇవ్వడం, పాలిష్‌ను ఎక్కువకాలం అలాగే ఉంచకుండా తొలగించడం, నాణ్యమైన ఉత్పత్తులను ఎంచుకోవడం మంచిది. నెయిల్ పాలిష్ ఉపయోగించిన తర్వాత చర్మంపై తీవ్రమైన దద్దుర్లు, వాపు లేదా గోళ్లలో అసాధారణ మార్పులు కనిపిస్తే వైద్యుడిని సంప్రదించాలి.మొత్తంగా, అప్పుడప్పుడు నెయిల్ పాలిష్ వేసుకోవడం వల్ల నేరుగా క్యాన్సర్ వస్తుందని చెప్పడానికి బలమైన ఆధారాలు లేవు. అయితే రసాయనాలకు దీర్ఘకాలం, అధిక స్థాయిలో గురికావడాన్ని తగ్గించడం, గాలి ప్రసరణ ఉండేలా చూసుకోవడం, జెల్ మానిక్యూర్‌లో యూవీ ఎక్స్‌పోజర్‌ను తగ్గించడం వంటి జాగ్రత్తలు పాటించడం మంచిది. సోషల్ మీడియాలో వచ్చే భయపెట్టే సమాచారాన్ని నమ్మే ముందు విశ్వసనీయ వైద్య వర్గాల సమాచారం తెలుసుకోవడం ఉత్తమం.మరింత చదవండి

Source link